E-Paper
Advertisement

OTT Movie : ‘ఫ్యామిలీ మ్యాన్ 3’ చూశారా ? మనోజ్ బాజ్‌పేయి ఫ్యాన్స్ మిస్ అవ్వకుండా చూడాల్సిన ఓటీటీ మాస్టర్ పీస్ సిరీస్లు ఇవే

OTT Movie : ‘ఫ్యామిలీ మ్యాన్ 3’ చూశారా ? మనోజ్ బాజ్‌పేయి ఫ్యాన్స్ మిస్ అవ్వకుండా చూడాల్సిన ఓటీటీ మాస్టర్ పీస్ సిరీస్లు ఇవే
Advertisement

OTT Movie : మనోజ్ బాజ్‌ పేయి మళ్లీ శ్రీకాంత్ తివారి అవతారంలో వచ్చి ‘ఫ్యామిలీ మ్యాన్ 3’ తో దూసుకెళ్తున్నాడు. నవంబర్ 21 నుంచి వచ్చిన సీజన్ 3 ప్రైమ్ వీడియోలో ఫ్యాన్స్‌ని కట్టి పడేస్తోంది. స్పై థ్రిల్, ఫ్యామిలీ ఎమోషన్, కామెడీ మిక్స్ తో వచ్చిన ఈ సిరీస్ ని మనోజ్ ఫ్యాన్స్ చూస్తూ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో అతని హయ్యెస్ట్ రేటింగ్ సినిమాలు, సిరీస్ లపై ఓ లుక్ వేద్దాం పదండి. గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్ నుంచి కిల్లర్ సూప్, దాకా ఇవన్నీ ఐయండిబిలో 8+ రేటింగ్ ని సొంతం చేసుకున్నాయి. వీటితో ఈ వీకెండ్ లో మనోజ్ మ్యాజిక్ ను మళ్లీ చూసి ఆనందించండి.

1. గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్ (2012) 

ఇది మనోజ్ కెరీర్‌లోనే ఒక గేమ్ ఛేంజర్ సినిమా. వాస్సేపూర్ అనే ఊరిలో కోల్ మైన్స్ కోసం మూడు తరాలగా గ్యాంగ్ వార్ జరుగుతుంటుంది. సర్దార్ ఖాన్ అవతారంలో మనోజ్ గన్ పట్టుకుని ప్రతీకారం తీర్చుకుంటూ రచ్చ చేశాడు. నవాజుద్దీన్, రిచా చడ్డా, హుమా కురేషీ కూడా ఇందులో బలమైన పాత్రల్లో నటించారు. రెండు పార్ట్స్ గా వచ్చిన ఈ సినిమా, ఇప్పటికీ అందులోని డైలాగ్స్ ఎక్కడో ఒక చోట వినబడుతూ ఉంటాయి. ఇది Netflix, Prime, JioCinemaలో అందుబాటులో ఉంది. ఐయండిబిలో దీనికి 8.2 రేటింగ్ ఉంది.

2. ‘కిల్లర్ సూప్’ (2024)

Advertisement

2024లో హిందీలో విడుదలైన బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘కిల్లర్ సూప్’. మాక్‌ గఫిన్ పిక్చర్స్ బ్యానర్‌పై చేతనా కౌషిక్, హనీ ట్రెహాన్ నిర్మించిన ఈ వెబ్ సిరీస్‌కు అభిషేక్ చౌబే దర్శకత్వం వహించాడు. మనోజ్ బాజ్‌పేయ్, కొంకణా సేన్ శర్మ, సాయాజీ షిండే, నాజర్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ వెబ్ సిరీస్‌ ను జనవరి 11న హిందీతో పాటు, తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో విడుదల చేశారు. ఇందులో కొంకణా సేన్ శర్మ భర్త స్వామి ఒక యాక్సిడెంట్‌లో చనిపోతే, ఆమె ప్లాన్ వేసి ప్రభాకర్‌ని స్వామిగా మార్చేస్తుంది. ఇక అక్కడి నుంచి గందరగోళం మొదలవుతుంది. ఇందులో మనోజ్ రెండు రోల్స్‌లో చంపేశాడు. 8 ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ లో మనోజ్ వన్ మ్యాన్ షో చూపించాడు. ఐయండిబిలో ఇది 7.5 రేటింగ్ ని పొందింది.

3. ‘సిర్ఫ్ ఎక్ బందా కాఫీ హై’ (2023)

ZEE5లో వచ్చిన ఈ మూవీలో మనోజ్ ఒక సాధారణ లాయర్ “పీ.సీ. సోలంకి”గా నటించాడు. రియల్ సంఘటనలతో వచ్చిన ఈ సినిమాలో ఒక బాబా 13 ఏళ్ల అమ్మాయిని అఘాయిత్యం చేసిన కేసును తీసుకుంటాడు. ఎవరూ తీసుకోని ఈ కేసును, మనోజ్ ఒక్కడే వాదించి బాబాని జైలు పడేస్తాడు. ఇందులో కోర్ట్ రూమ్ సీన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. దీనికి నేషనల్ అవార్డు రావడం ఒక విశేషం. – ఐయండిబిలో 8.0 రేటింగ్ ని పొందింది.

4. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ 

Advertisement

ఐయండిబిలో 8.7 రేటింగ్ ఉన్న ఈ స్పై థ్రిల్లర్ రాజ్ & DK డైరెక్షన్‌లో అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతోంది. ఈ స్పై థ్రిల్లర్ సిరీస్ (సీజన్ 1: 2019, సీజన్ 2: 2021, సీజన్ 3: 2025)లో రావడంతో పాటు, ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకుంది. శ్రీకాంత్ తివారి పాత్రలో మనోజ్ అద్భుతమైన నటనను అందించారు. ఈ కథ ఇండియా సీక్రెట్ మిషన్స్ తో పాటు, ఫ్యామిలీని రక్షించే మిషన్ కూడా ఉంటుంది. సీజన్ 3 అక్టోబర్ 21న విడుదలై సంచలన విజయం అందుకుంది. మొదటి రెండు సీజన్లను చూడకపోయి ఉంటే, సీజన్ 3 చూశాక వాటిపై కూడా ఓ లుక్ వేయండి.

Read Also : అవినీతికి కేరాఫ్ అడ్రస్ ఈ కేటుగాడు… కంటిపై రెప్ప వేయడం మర్చిపోయేలా చేసే క్రైమ్ థ్రిల్లర్

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×