E-Paper
Advertisement

Ram Charan : మీ ఫేస్ చాలా కళ గా ఉంది, అనస్వర గురించి చరణ్ మాటలు వింటే షాక్ అవ్వాల్సిందే

Ram Charan : మీ ఫేస్ చాలా కళ గా ఉంది, అనస్వర గురించి చరణ్ మాటలు వింటే షాక్ అవ్వాల్సిందే
Advertisement

Ram Charan : ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో రోషన్ మేక నటిస్తున్న సినిమా ఛాంపియన్ ఈ సినిమా డిసెంబర్ 25న ప్రేక్షకులు ముందుకు రాను తరుణంలో చిత్ర యూనిట్ నేడు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ చీఫ్ గెస్ట్ గా హాజరైన విషయం తెలిసిందే. ముఖ్యంగా రోషన్ గురించి అలానే నిర్మాత అశ్విని దత్ గురించి అద్భుతంగా మాట్లాడారు రాంచరణ్.

ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న అనస్వర గురించి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో మలయాళం సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకుంది అనుస్వర. మొత్తానికి ఛాంపియన్ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తుంది.

మీ ఫేస్ చాలా కళ గా ఉంది

Advertisement

రామ్ చరణ్ అనస్వర గురించి మాట్లాడుతూ కీలక విషయాలను తెలిపారు. మీ ఫేస్ చాలా కళ గా ఉంది. మీకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఖచ్చితంగా మంచి ఫ్యూచర్ ఉంటుంది. అన్నింటిని మించి చాలామంది దర్శక నిర్మాతలు మీ డేట్లు కోసం ఖచ్చితంగా పోటీ పడతారు అంటూ చరణ్ చెప్పాడు.

ఈరోజుల్లో చాలామంది హీరోయిన్లు వాళ్ల పాత్రలకు డబ్బింగ్ చెప్పడం తగ్గించేశారు. కానీ ప్రియాంక కొద్దిసేపటి క్రితమే మీ గురించి చెప్పారు మీరు మలయాళం అయినా కూడా తెలుగు నేర్చుకుని తెలుగులో డబ్బింగ్ చెప్పారు అని తెలిసింది. నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది అంటూ అనస్వర రాజన్ గురించి చరణ్ తేజ మాట్లాడారు.

మగధీర చాలాసార్లు చూశా 

Advertisement

రామ్ చరణ్ కెరియర్ లో మగధీర సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అది చరణ్ కు రెండువ సినిమా అయినా కూడా అప్పటివరకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న అవార్డులు అన్నిటిని కూడా తిరగరాసింది. లేకపోతే అనస్వర రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ నాకు మగధీర సినిమా చాలా ఇష్టమని, ఆ సినిమాను ఎన్నిసార్లు చూశానో లెక్కలేదు అంటూ చెప్పింది.

ఇకపోతే గతంలో చాలామంది మలయాళం ఫిలిం ఇండస్ట్రీ నుంచి వచ్చిన హీరోయిన్స్ కు తెలుగు ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. ఇకపోతే చాంపియన్ సినిమా ఆకట్టుకునే దానిని బట్టి అనస్వర కి కూడా తెలుగులో ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే కొంతమంది సాంగ్ చూసి ఫిదా అయిపోయారు. పర్ఫామెన్స్ తో పాటు డాన్స్ లో ఆమె బాడీ లాంగ్వేజ్ కూడా ఆకట్టుకునే విధంగా ఉంది. మొత్తానికి ఒక హీరోయిన్ కి ఉండాల్సిన అన్ని క్వాలిటీస్ తనకి ఉన్నాయి అని అర్థం అవుతుంది. అలానే విపరీతమైన డెడికేషన్ ఉండటం కూడా ఎక్స్ట్రా బ్యూటీ.

Also Read: Champion Movie Trailer : శ్రీకాంత్ కొడుకు నటించిన ఛాంపియన్ ట్రైలర్ వచ్చేసింది, ఎలా ఉందంటే?

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×