E-Paper
Advertisement

OTT Movie : ఇంటర్నెట్ సెన్సేషన్ గిరిజ ఓక్ నటించిన ఈ సినిమా చూశారా ? తెలుగులోనూ అందుబాటులో

OTT Movie : ఇంటర్నెట్ సెన్సేషన్ గిరిజ ఓక్ నటించిన ఈ సినిమా చూశారా ? తెలుగులోనూ అందుబాటులో

OTT Movie : నిజమైన క్రైమ్ స్టోరీల ఆధారంగా వస్తున్న సినిమాలు ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఆడియన్స్ కూడా వీటిని తెగ చూస్తున్నారు. మ‌నోజ్ బాజ్ పాయ్ హీరోగా ‘ఇన్‌స్పెక్టర్ జెండే’ అనే సినిమా ఈ నేపథ్యలో తెరకెక్కింది. సీరియల్ కిల్లర్ చార్లెస్ సోభ్రాజ్ ను ఇన్‌స్పెక్టర్ మధుకర్ జెండే పట్టుకునే క్రమంలో ఈ స్టోరీ ఉంటుంది. అప్పట్లో చార్లెస్ సోభ్రాజ్ పేరు మాత్రం భారత దేశం మొత్తం మారుమోగింది. స్విమ్ సూట్ కిల్ల‌ర్‌గా పోలీసులకే చుక్కలు చూపించాడు. ఇతని కథని ఇప్పటికే సినిమాల రూపంలో తెరకెక్కించారు కూడా. ఇతన్ని అతి కష్టం మీద 1971లో తొలిసారి అరెస్టు చేయ‌గా, తిహార్ జైలు నుంచి తప్పించుకున్నాడు. ఆ తర్వాత గోవాలో మళ్లీ అదుపులోకి తీసుకున్నారు. ఈ రియల్ స్టోరీలో ఇన్‌స్పెక్టర్ మాధవ్ జెండే పాత్రలో మనోజ్ బాజ్‌పేయీ, క్రిమినల్ చార్లెస్ శోభ‌రాజ్‌గా జిమ్ సార్భ్ నటించారు. ఈ సినిమాని ఓటీటీలో కూడా ఆడియన్స్ ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు. ఇది ఏ ఓటీటీలో ఉంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోక వెళ్తే ..

నెట్‌ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

‘ఇన్‌స్పెక్టర్ జెండే’ (Inspector zende) 2025లో విడుదలైన హిందీ క్రైమ్ థ్రిల్లర్ సినిమా. ఇది చిన్మయ్ మండేల్కర్ డైరెక్ట్ చేసిన నెట్‌ ఫ్లిక్స్ ఒరిజినల్‌గా సెప్టెంబర్ 5, 2025న విడుదలైంది. ఇందులో మనోజ్ బాజ్‌పేయ్, జిమ్ సార్భ్, గిరిజా ఓక్ ప్రధాన పాత్రలు పోషించారు. సచిన్ ఖేడేకర్, సుకుమార్ తుడు, హరీష్ దుధడే సపోర్టింగ్ రోల్స్ లో నటించారు. అదిపురుష్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ ఈ సినిమాని నిర్మించాడు. ఈ సినిమాను థియేట‌ర్ల‌కు రాకుండా డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేశారు. ప్రస్తుతం నెట్‌ ఫ్లిక్స్ లో హిందీతో పాటు తెలుగులో కూడా అందుబాటులో ఉంది. ఈ సినిమాలో మనోజ్ బాజ్‌పేయీ భార్యగా కీలక పాత్ర పోషించారు గిరిజా ఓక్.  మరాఠీ చిత్ర పరిశ్రమలో మంచి పేరున్న ఆమె 2009లో వచ్చిన “తారే జమీన్ పర్” అనే హిందీ సినిమాలో ప్రేక్షకులకు బాగా పరిచయమయ్యారు.

స్టోరీ ఏమిటంటే

ఈ స్టోరీ1980 ముంబైలో మొదలవుతుంది. ఇన్‌స్పెక్టర్ మధుకర్ జెండే (మనోజ్ బాజ్‌పేయి) అనే పోలీసు ఆఫీసర్, 15 ఏళ్ల క్రితం ఒక కరుడు గట్టిన సీరియల్ కిల్లర్ అయిన కార్ల్ భోజ్‌రాజ్ (చార్లెస్ సోభ్రాజ్)ని పట్టుకుని హీరో అయ్యాడు. ఇప్పుడు జెండే రిటైర్మెంట్ దగ్గర్లో ఉంటే, కార్ల్ తిహార్ జైలు నుంచి జైలర్‌ని మోసం చేసి ఎస్కేప్ అయి ముంబైకి తిరిగి వచ్చేస్తాడు. మళ్లీ ఫారిన్ అమ్మాయిలకి డ్రగ్స్ ఇచ్చి, డబ్బు దోచుకుని చంపడం మొదలుపెడతాడు. జెండే ఈ వార్త విని విచారం వ్యక్తం చేస్తాడు. అతని భార్య ఇక రిటైర్మెంట్ వయసులో ఈ కేసు ఎందుకని అంటుంది. DGP చంద్రకాంత్ అతనికి ఫోన్ చేసి, నువ్వే అతన్ని పట్టగలవు అని కేసు ఇస్తాడు.

Read Also : రిటైర్ అయ్యే టైంలో దెబ్బ కొట్టే కిల్లర్… ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్

జెండే తన టీమ్ తో కలిసి అతని కోసం వేట ప్రారంభిస్తాడు. కార్ల్ ఇప్పుడు విగ్ పెట్టుకుని, మేకప్ వేసుకుని మారువేశంలో ఉన్నాడని తెలుసుకుని ట్రాక్ చేయడం మొదలుపెడతాడు. ఇద్దరి మధ్య క్యాట్ అండ్ మౌస్ గేమ్ స్టార్ట్ అవుతుంది. కార్ల్ జెండేని పర్సనల్‌గా టీజ్ చేస్తూ లేఖలు పంపిస్తాడు. ఒకసారి జెండే ఇంటికి కూడా థ్రెట్ ఇస్తాడు. కార్ల్ ఎప్పుడూ ఫైవ్ స్టార్ హోటల్స్ దగ్గరే తిరుగుతాడని గుర్తుచేసుకుని, ఒక ఫేక్ అమెరికన్ టూరిస్ట్ (పోలీస్ ఏజెంట్)ని పెట్టి ట్రాప్ వేస్తాడు. కార్ల్ మళ్లీ ఎస్కేప్ అవుతాననుకుంటాడు, కానీ జెండే స్మార్ట్‌గా హోటల్ రూమ్‌లోనే పట్టుకుని బేడీలు వేస్తాడు. రెండోసారి కూడా జెండేనే గెలిచాడని చూపిస్తూ, నిజాయితీ ఉన్న పోలీసు ముందు క్రిమినల్స్ ఓడిపోతారనే మెసేజ్‌తో ఈ సినిమా ఇన్‌స్పైరింగ్‌గా ముగుస్తుంది.

 

 

Related News

తెలుగు నుంచి హిందీ వరకు… ఈ వీకెండ్ మిస్ అవ్వకుండా చూడాల్సిన 11 సినిమాలు

థియేటర్లలో డిజాస్టర్ ఈ తెలుగు మూవీ… ఓటీటీలో ట్రెండింగ్ లోకి ఎలాగబ్బా ?

ఎట్టకేలకు హాట్ స్టార్ మోస్ట్ అవైటింగ్ క్రైమ్ సిరీస్‌ రిలీజ్ డేట్ ఫిక్స్

ఈ వారం OTTలో చూడాల్సిన మలయాళ తమిళ సినిమాల లిస్ట్

ఈ వీకెండ్ ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడాల్సిన తెలుగు కన్నడ సినిమాలు ఇవే

ట్రంకు పెట్టెలో శవం… భోజనానికి ఆహ్వానిస్తే బుర్రపాడు ట్విస్ట్

17 ఏళ్ల అమ్మాయి హత్య… ఓటీటీని ఊపేస్తున్న 6 ఎపిసోడ్‌ల మిస్టరీ థ్రిల్లర్

IMDbలో 7.5 రేటింగ్… మలయాళం మర్డర్ మిస్టరీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫ్లిక్స్

Big Stories

×