E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu Day 78 : భరణికి బుర్రపాడు షాక్ ఇచ్చిన తనూజ – దివ్య… డెమోన్ వర్సెస్ కళ్యాణ్… ఈ వారం నామినేషన్లు రప్పా రప్పా

Bigg Boss 9 Telugu Day 78 : భరణికి బుర్రపాడు షాక్ ఇచ్చిన తనూజ – దివ్య… డెమోన్ వర్సెస్ కళ్యాణ్… ఈ వారం నామినేషన్లు రప్పా రప్పా

Bigg Boss 9 Telugu Day 78 : 12వ వారం నామినేషన్లతో హౌస్ లో కంటెస్టెంట్స్ రప్పా రప్పా అనిపించారు. డెమోన్, రీతూ, కళ్యాణ్, మరోవైపు భరణి – దివ్య, తనూజా – సుమన్ శెట్టి, సంజన – రీతూ… ఇలా హౌస్ మొత్తం గొడవలతో దద్దరిల్లింది.

ప్రైవేట్ నామినేషన్లు

“ఈసారి నామినేషన్ భిన్నంగా, ఆసక్తికరంగా రెండ్ దశల్లో ఉండబోతోంది. ఒకరి తరువాత ఒకరు డెన్ కు వచ్చి, వారు ఎవరి గురించి అయితే చెప్పలేకపోయారో వాళ్ళ పేరును రాసి, స్పష్టంగా పాయింట్స్ చెప్పి బాక్స్ లో వేయాలి” అనేది ఈ ప్రైవేట్ నామినేషన్ ప్రాసెస్. “కెప్టెన్ కంటెండర్ అయ్యాక వేరే వాళ్ళ కోసం ఆడాడు. గివ్ అప్ ఇచ్చేశాడు అన్పించింది” అని ఇమ్ము డెమోన్ పేరు రాశాడు. “సుమన్ అన్న కెప్టెన్సీ నుంచి ఎవరైతే గివ్ అప్ ఇచ్చేస్తున్నారో అతన్ని వదిలేసి, నేను కెప్టెన్ గా ఉండాలి అనుకుంటున్నాను. ఎట్లీస్ట్ ఈ రౌండ్ ఆపండి అని చెప్పినా సరే ఒపీనియన్ మార్చుకోలేదు” అని కళ్యాణ్ సుమన్ పేరు రాశాడు. భరణి “మళ్ళీ ఇద్దరి గొడవలోనూ వేరే వాళ్ళు పట్టించుకోకపోయినా వెంట పడుతున్నావ్ అంటూ ఇన్ డైరెక్ట్ గా నా పేరు తీసింది. దివ్య, తనూజా ఇద్దరూ చిన్నపిల్లల్లా అదే పని చేస్తున్నారు” అని తనూజను నామినేట్ చేశాడు. “నేను 7 వీక్స్ నుంచి కంటెండర్ కాలేదని చెప్పినా సరే కంటెండర్ కావొద్దని నా పేరే చెప్పాడు” అని డెమోన్ కళ్యాణ్ పేరు రాశాడు.”స్టాండ్ తీసుకోవట్లేదు. నా గేమ్ ను, మొరాలిటీని ఎఫెక్ట్ చేశాడు” అంటూ భరణి పేరు రాసింది దివ్య. తనూజా కూడా భరణి పేరుని రాసింది. సుమన్ సంజనను, సంజన భరణి నామినేట్ చేసింది. ఈ రౌండ్ లో డెమోన్ కు 2 ఓట్లు, భరణికి 2, తనూజ, సుమన్, కళ్యాణ్, సంజనలకు ఒక్కో ఓటు పడ్డాయి.

ఈ ఫైర్ కదా కావాల్సింది

ఇక సెకండ్ రౌండ్ నామినేషన్ లో ఫోటోను మంటల్లో కాల్చి నామినేట్ చేయాలి. ఇందులో ఇమ్మాన్యుయేల్ తనుజాను నామినేట్ చేసి, “ఇమ్మూ కెప్టెన్సీని త్యాగం చేశాడు అని చెప్పడం నాకు నచ్చలేదు” అని చెప్పాడు. “నువ్వు కెప్టెన్ అయ్యి త్యాగం చేసి, మళ్ళీ కెప్టెన్ అయ్యావు. మరి నేను సెకండ్ టైమ్ కెప్టెన్ అయితే నీకేంటి?” అని అడిగింది తనూజా. “నిన్ను 6 మంది నామినేట్ చేస్తే నాతో, దివ్యతో మాత్రమే గొడవ పడ్డావ్” అని సమాధానం చెప్పాడు ఇమ్మూ. “సేఫ్ గేమ్ ఆపు”‘ అంటూ ఇచ్చిపడేసింది తనూజ.

“నీవల్ల కెప్టెన్సీ పోయింది” అని సుమన్ తనూజాను నామినేట్ చేశాడు. అలాగే భరణి “మనం ఎంతమంచిగా ఉన్నా మన వాయిస్ అనేది దాన్ని కప్పేస్తుంది” అని దివ్యను నామినేట్ చేశాడు. “నన్ను నేను డిఫెండ్ చేసుకోవడానికి మాట్లాడతా. అన్నీ విషయాల్లో మీలా సాఫ్ట్ గా మాట్లాడలేను” అని చెప్పింది దివ్య. “నేను నీకు ఎన్నోసార్లు చెప్పాను. మా గురువుగారు ఒకరు నీతో అలా మాట్లాడడం నాకు నచ్చలేదు అని అన్నారు” అని వివరణ ఇచ్చాడు. దివ్య “ఎవరన్నారు?” అనగానే “రెస్పెక్ట్ దివ్య, చెయ్యి చూపించి మాట్లాడకు” అని ఫైర్ అయ్యాడు భరణి. అలాగే డెమోన్, కళ్యాణ్ మధ్య కూడా రచ్చ జరిగింది.

కళ్యాణ్ పీక పట్టుకున్న డెమోన్ 

వచ్చిన ఛాన్స్ ను వదిలేశావు అని డెమోన్ ను కళ్యాణ్ నామినేట్ చేశాడు. ముందుగా గొడవ పడిన వీళ్ళిద్దరూ చివరికి నవ్వేశారు. అయితే గొడవంతా డెమోన్ నామినేషన్ లో జరిగింది. మొన్న కంటెండర్ టాస్క్ లో సపోర్ట్ చేస్తానని చేయలేదు అంటూ డెమోన్ ఇమ్మూని నామినేట్ చేశాడు. కానీ అది టీం టాస్క్, అందరం టీం గెలవాలని ఆడాము కదా అని కళ్యాణ్ ను మధ్యలోకి లాగాడు. దీంతో కళ్యాణ్ టీం గేమ్ లో ఆపొజిట్ టీంతో ఎలా డీల్ పెట్టుకుంటావ్? నువ్వు కావాలనే వేరే వాళ్ళ కోసం గేమ్ వదులుకున్నావ్ అంటూ ఫైర్ అయ్యాడు కళ్యాణ్. ఇమ్మూ కూడా ఇదే చెప్పాడు. కానీ మధ్యలో రీతూ కల్పించుకోవడంతో గొడవ పెద్దది అయ్యింది. డెమోన్ – కళ్యాణ్ ఏకంగా కొట్టుకునే స్థాయికి వెళ్లారు.

ఇక ఆ తరువాత చెప్పుకోవాల్సిన సంజన – రీతూ గొడవ గురించి. రీతూ నామినేట్ చేసిందన్న కోపంతో సంజన టంగ్ స్లిప్ అయ్యింది. రాత్రిపూట పవన్ ను హత్తుకుని కూర్చుంటావు? అంటూ అనకూడని మాట అన్నది. దీంతో నా ఫ్రెండ్ పక్కన నేను కూర్చుంటే మీకేంటి? అని రీతూ అరిచింది. సంజన అన్న మాటకు హౌస్ మొత్తం ఒక్కసారిగా షాక్ అయ్యారు. సంజనను ఆపే ప్రయత్నం చేశారు. కానీ ఆవిడ ఆగకుండా మరింత రీతూ ని గిచ్చే ప్రయత్నం చేసింది. మరి ఈ గోడవల పర్యవసానాలు ఎలా ఉంటాయో వీకెండ్ లో చూడాలి. చివరకు ఈ వారం నామినేషన్లలో ఒక్క రీతూ తప్ప అందరూ ఉన్నారు.

Read Also : తల్లినే బురిడీ కొట్టించిన తనూజా… డెమోన్ ఫస్ట్ లవ్ రమ్యానా? గోవాకి రీతూ ఎస్కేప్… అందరూ దొంగలే

 

Related News

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

ట్రోలర్స్ ఇనయా దిమ్మతిరిగే కౌంటర్.. కాన్ఫిడెంట్ కు మెచ్చుకోవాల్సిందే..!

Bigg Boss Soniya: గిన్నీస్ బుక్ లో సోనియా కూతురికి చోటు.. ఏం చేసిందో తెలుసా..?

Demon Pawan : వివాదంలో బిగ్ బాస్ కంటెస్టెంట్ డిమాన్.. ఆగని ట్రోల్స్..!

బిగ్ బాస్ నటితో సిరాజ్ డేటింగ్.. సంచలనం సృష్టిస్తున్న వీడియో!

Big Stories

×