Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ హౌస్ లో ఈ వారం కంటెస్టెంట్స్ ఇమ్యూనిటీ కోసం పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సమాయనుసారం బిగ్ బాస్ పెట్టే టాస్క్ లలో గెలిచి, లీడర్ బోర్డులో ఉన్న టాప్ 2 కంటెస్టెంట్స్ కు ప్రేక్షకులను కలిసి, ఓటు అప్పీల్ చేసుకుని ఛాన్స్ ఇస్తానని బిగ్ బాస్ ముందుగానే అనౌన్స్ చేశారు. ఈరోజు చెప్పినట్టుగానే ఇమ్మాన్యుయేల్ ను ఆడియన్స్ ముందుకు పంపారు. అక్కడ ఆడియన్స్ లో ఒకరు ఇమ్మూని ఇంట్రెస్టింగ్ ప్రశ్నలు అడగడంతో పాటు ఆయన బట్టతలపై కూడా కామెడీ చేశారు.
ఈరోజు టాస్క్ ఆడి టాప్ 2లో ఉన్న ఇద్దరు కంటెస్టెంట్స్ డెమోన్ పవన్, ఇమ్మాన్యుయేల్. “ప్రేక్షకులను ఎదుర్కోబోతున్నారు” అంటూ బిగ్ బాస్ ఈ ఇద్దరినీ గార్డెన్ ఏరియాకు పంపారు. ముందుగా ఆడియన్స్ కు షోను తమ భుజాలపై మోస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపిన బిగ్ బాస్ “ఈ హౌస్ లో ఏదీ ఊరికే రాదు. ఒకవేళ ఇంటి సభ్యులు అందరూ బోట్లో మునిగిపోయే ఛాన్స్ ఉంటే ఎవరిని కాపాడతారు ?” అని ఆడియన్స్ ను అడిగారు. ఎక్కువ మంది డెమోన్ పేరే చెప్పారు.
“సక్సెస్ ను ఎలా కొలుస్తారు?” అని డెమోన్ – ఇమ్మూను అడిగారు. డెమోన్ “మనిషిగా మనం మనల్ని గెలవడం. గోల్ ను సెట్ చేసుకుని స్టెప్ బై స్టెప్ రీచ్ అవ్వడానికి ట్రై చేస్తూ, కొంచం దగ్గరకు వెళ్ళినా గెలిచినట్టే” అని చెప్పాడు. ఇమ్మూ “నేను ఏదైనా సాధించాలి అనేది మైండ్ లో పడితే చాలు సక్సెస్ అయినట్టే. నేను అదే ట్రాక్ లో ఉన్నాను అనుకుంటున్నా” అని చెప్పాడు. ఆ తరువాత ఈ ఇద్దరిలో ఎవరికి ఓటు అప్పీల్ చేసుకుని ఛాన్స్ ఇవ్వాలి అనే నిర్ణయాన్ని బిగ్ బాస్ ఆడియన్స్ చేతిలో పెట్టారు. ప్రేక్షకులు ఓటు అప్పీల్ కోరుకునే ఛాన్స్ కోసం ఇమ్మూని సెలెక్ట్ చేసుకున్నారు.
“ఈసారైనా కమెడియన్ గెలవాలి అనే కసితో ఆడుతున్నా. దానికోసం 100 పర్సెంట్ ఎఫర్ట్స్ పెడుతున్నాను. టాప్ 5కి మీరు ఆశీర్వదిస్తే నేను డిజర్వ్ అనుకుంటున్నా. ప్లీజ్ నాకు ఓటు వేయండి” అని ఓటు అప్పీల్ చేసుకున్నాడు ఇమ్మూ. అనంతరం బిగ్ బాస్ ఆడియన్స్ ను ఇమ్మూకి ప్రశ్నలగిడే ఛాన్స్ ఇచ్చాడు. “కప్పు గెలవగానే గర్ల్ ఫ్రెండ్ దగ్గరకా? అమ్మ దగ్గరగా?” అనే ప్రశ్నకు ఇమ్మాన్యుయేల్ “అమ్మ స్టేజ్ మీదకు ఆమె వచ్చింది కాబట్టి అమ్మ దగ్గరకే వెళ్ళి చేతిలో పెడతా. ఇంట్లో పరిస్థితులు బాలేక 2వ తరగతి నుంచి డిగ్రీ వరకు హాస్టల్లో చదువుకున్నా. ఇప్పుడు ఫ్యామిలీ వాల్యూ బాగా తెలిసొచ్చింది. కప్పు పట్టుకెళ్ళి అమ్మకు, సక్సెస్ ను గర్ల్ ఫ్రెండ్ చేతిలో పెడతా” అని చెప్పాడు.
ఆడియన్స్ నుంచి మరో అమ్మాయి “గేమ్ బాగా ఆడుతున్నారు అందుకే జుట్టు బాగా ఊడిపోయింది” అంటూ ముందు కామెడీ చేసింది. తరువాత “తనూజాపైనే మీకు ఎందుకు సాఫ్ట్ కార్నర్ ఉంది?” అని అడిగింది. దానికి ఇమ్మూ “టెనెంట్ గా ఉన్నప్పుడు ఏర్పడ్డ జెన్యూన్ బాండ్ అది” అని చెప్పాడు. “సంజన – మీది బాండ్ హౌస్ వరకేనా? బయట కూడానా? అనే ప్రశ్నకు “బయట కూడా అదే కంటిన్యు చేస్తా” అని చెప్పాడు. చివరగా హౌస్ లో సంజనానే తన బలం అని చెప్పాడు ఇమ్మూ.
Read Also : తనూజాతో సంజన తగవు… భగ్గుమన్న భరణి… ఇమ్మూకి దక్కిన గోల్డెన్ ఛాన్స్