E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu Day 87 : కళ్యాణ్ కు ఇచ్చిపడేసిన తనూజ… సుమన్ శెట్టి ప్రభంజనం… చివరి టాస్క్ లో గెలిచింది ఎవరంటే?

Bigg Boss 9 Telugu Day 87 : కళ్యాణ్ కు ఇచ్చిపడేసిన తనూజ… సుమన్ శెట్టి ప్రభంజనం… చివరి టాస్క్ లో గెలిచింది ఎవరంటే?
Advertisement

Bigg Boss 9 Telugu Day 87 : బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం టికెట్ టు ఫినాలే టాస్క్ నడుస్తోంది. ఈరోజు ఎపిసోడ్ లో మరో మూడు టాస్కులు జరిగాయి. నిన్నటి టాస్క్ లో చివరగా మిగిలిన తనూజా – సుమన్ శెట్టిలకు ఈరోజు టాస్క్ స్టార్ట్ అయ్యింది.

తనూజకు ఝలక్ ఇచ్చిన సుమన్

“ఇద్దరు పోటీదారులకు పెడుతున్న టాస్క్ బ్యారెల్ బ్యాలెన్స్ బ్యాటిల్. బ్యారెల్ కింద నిలబడి, రోప్ ను రెండు చేతులతో పట్టుకుని , గ్రిప్ వదలకుండా బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. మిగిలిన వాళ్ళు బజర్ మోగినప్పుడు, సంచాలక్ ఎవరిని పిలిస్తే వాళ్ళు వచ్చి ఫైనలిస్ట్ గా చూడకూడదు అనుకుంటున్న కంటెస్టెంట్ బ్యారెల్ లో ట్యాపును తిప్పి నీళ్ళు నింపాలి” అన్నది టాస్క్. దీనికి సంజన సంచాలక్ గా వ్యవహరించగా, కళ్యాణ్, రీతూ, ఇమ్మాన్యుయేల్ తనుజాకు సపోర్ట్ చేశారు. అలాగే భరణి, డెమోన్… సుమన్ కు సపోర్ట్ చేశారు. ఫైనల్ గా ఈ టాస్క్ లో సుమన్ శెట్టి విన్ అవ్వగా, తనూజా రేసు నుంచి తప్పుకుంది. ఈ ఊహించని ఫలితంతో తనూజా గుక్కపెట్టి ఏడ్చింది. దీంతో “గెలిచామా ఓడామా అన్నది కాదు. ఎంత ఎఫర్ట్స్ పెట్టాను అన్నదే ముఖ్యం” అంటూ సముదాయించాడు డెమోన్.

Advertisement

అయితే భరణి మాత్రం సుమన్ ను ఎవ్వరూ సపోర్ట్ చేయరని, తనను సపోర్ట్ అడిగాడని తనూజ దగ్గర చెప్పుకున్నాడు. మరోవైపు ఏదేమైనా ఇద్దరూ కలిసే ఆడాలని, సంచాలక్ గా ఇద్దరిలో ఎవరు చిక్కుకున్నా, ఇద్దరికీ సమస్యలు తప్పవని డీల్ కుదుర్చుకున్నారు.

“మూడో టాస్క్ లో పాల్గొనే ముగ్గురు కంటెస్టెంట్స్ ను ఎంచుకునే సమయం వచ్చింది. ప్రతీ ఛాలెంజ్ ను ఎలా ఎదుర్కొంటారు? ఎలా పోరాడతారు ? అనేది మీరు తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది” అంటూ హౌస్ మేట్స్ ను ఉసిగొల్పారు బిగ్ బాస్. అందరూ సీరియస్ గా డిస్కస్ చేసుకుని ముగ్గురిని ఎన్నుకున్నారు. ఈ గ్యాప్ లో హౌస్ మేట్స్ మధ్య మాటల యుద్ధం నడిచింది. మార్నింగ్ వెళ్ళిన వాళ్ళలో ఒకరు, సాయంత్రం వెళ్ళిన వాళ్ళలో ఒకరు, వెళ్ళని వాళ్ళలో ఒకరు వెళ్ళాలని తనూజా సూచించింది. కానీ కళ్యాణ్ అడ్డుపడ్డాడు. “మేము ఎవ్వరికీ ఓటు వేయడం లేదు. మీకు మీరే మాట్లాడుకోండి. అలా చెప్తే ఇలా అంటావ్, ఇలా అంటే అలా చెప్తావ్” అని ఫైర్ అయ్యింది తనూజ. చివరకు సుమన్, డెమోన్, కళ్యాణ్ ఆడడానికి సిద్ధమయ్యారు. వీళ్లకు “పవర్ బాక్స్” అనే ఛాలెంజ్ ఇచ్చారు. ఇందులో సెంటర్ లో ఉన్న బ్లాక్స్ ను తీసుకెళ్లి తమ బాక్సుల్లో పెట్టుకోవాలి. ఈ టాస్క్ లో గట్టి ఫైట్ జరగ్గా… డెమోన్ విన్ అయ్యాడు. దీంతో సుమన్ శెట్టి గడులను స్వాధీనం చేసుకున్నాడు. ఆ తరువాత “గత టాస్క్ ఆడి ఓడిన, భరణితోనే నెక్స్ట్  టాస్క్ ఆడి గెలవాలని అనుకుంటున్నా” అంటూ డెమోన్ భరణిని సెలెక్ట్ చేసుకున్నాడు.

భరణి వర్సెస్ డెమోన్

Advertisement

“ఫస్ట్ ఫైనలిస్ట్ అవ్వడానికి ఇద్దరు పోటీదారులకు ఇస్తున్న టాస్క్ “వారధి కట్టు విజయం పట్టు”. మీ బాక్స్ ను డిస్మాంటెల్ చేసి, ఒక్కో బ్లాక్ ను తీసుకెళ్లి బ్రిడ్జి లో కరెక్ట్ గా ఉండేలా అమర్చాలి. బ్రిడ్జి పూర్తయ్యాక దాని మీద నుంచి నడుచుకుంటూ వెళ్లి బ్యాగులను టేబుల్ పై పడేలా చేయాలి” అని చెప్పారు బిగ్ బాస్. ఈ టాస్క్ కు సంచాలక్ తనూజా కాగా, డెమోన్ – భరణి మధ్య వార్ నడిచింది. ఫైనల్ గా భరణి విన్ అయ్యాడు. ఇక  విషయాన్ని చెప్పేటప్పుడు సంచాలక్ తనుజా బిహేవియర్ ను చూసి కళ్యాణ్ సైతం షాకయ్యాడు.

Read Also : రీతూ పీత బ్రెయిన్ పై బిగ్ బాస్ సెటైర్లు… పాప బైపీసీ అంట పాపం

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×