Bigg Boss 9 Telugu Day 73 : బిగ్ బాస్ సీజన్ 9లో ఈ వారం ఫ్యామిలీ వీక్ నడుస్తోంది. ఇప్పటికే హౌస్ లోకి తనూజా, సుమన్ శెట్టి ఫ్యామిలీలు అడుగు పెట్టాయి. ఇక ఈరోజు ఎపిసోడ్ లో డెమోన్ పవన్ తల్లి, దివ్య తల్లి, సంజన భర్త, పిల్లలు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలో హౌస్ మేట్స్ ను బిగ్ బాస్ ఫ్రీజ్, రిలీజ్ అంటూ ఓ ఆటాడుకున్నారు.
ఈ క్రమంలోనే ‘చింటూ చింటూ’ అంటూ కాసేపు డెమోన్ ను తన తల్లి ఇంట్లోకి రాకుండానే ఆట పట్టించింది. హౌస్ లోకి తల్లి అడుగు పెట్టగానే.. ఆమెను చూసి డెమోన్ కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. ‘ఆట బాగా ఆడుతున్నావ్ అని అందరూ నిన్ను మెచ్చుకుంటున్నారు. అందరూ బాగున్నారు. బాగా నిద్రపో’ అని డెమోన్ తో చెప్పింది అతని తల్లి. ఇక రీతూని కూడా ఆమె స్పెషల్ గా ట్రీట్ చేసింది. ఇద్దరికీ సున్నుండలు తినిపించింది. ‘మొన్న రీతూ మీదకు తోశాను కదా. అది బయటకు ఎలా వెళ్ళింది? హౌస్ లో అందరూ బాగానే ఉంటారు. కానీ టాస్క్ అనేసరికి స్ట్రాంగ్ అని ఎవ్వరూ సపోర్ట్ చేయరు తను తప్ప. నన్ను బాగా చూసుకునే వాళ్ళను నేను కూడా బాగా చూసుకోవాలి కదా. అందుకే ఆ అమ్మాయితో అలా ఉంటున్నా” అని తల్లికి వివరణ ఇచ్చుకున్నాడు డెమోన్.
గత కొన్ని రోజులుగా సంజన తన ఫ్యామిలీ కోసం తల్లడిల్లిపోతోంది. అందుకేనేమో ఇన్నాళ్ళూ ఆమెను మెంటల్ టార్చర్ పెట్టిన బిగ్ బాస్ ఇప్పుడు ఆమె ఫ్యామిలీ మొత్తాన్ని హౌస్ లోకి పంపించారు. సంజన భర్త, పిల్లలను చూసి మురిసిపోయింది. నిజానికి సంజనాకు ఫ్యామిలీ వీక్ కట్ అయ్యింది. కాబట్టి, రోప్ టాస్క్ ఆడి టైమ్ గెలుచుకునే ఛాన్స్ లేకపోయింది. అందుకే బిగ్ బాస్ ఆమెను కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచి, హౌస్ మేట్స్ ను కన్విన్స్ చేసి టైమ్ ను తీసుకోమన్నారు. దీంతో సంజనా రిక్వెస్ట్ చేయగా, ఇమ్మాన్యుయేల్ 15 నిమిషాలు ఇచ్చేశాడు. అలాగే కళ్యాణ్ 5, భరణి మరో 5 నిమిషాలు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. కళ్యాణ్ ఇచ్చేశాడు కానీ భరణి మాత్రం వెనకాడాడు. అలాగే సంజన కూడా ఇప్పటికే భరణి తాను చేసిన త్యాగం గురించి నామినేషన్లలో ఎన్నో మాటలు అన్నాడు. అడగాలంటే భయం వేస్తోంది అని కన్నీళ్ళు పెట్టుకుంది. చివరికి ఇమ్మూ 15 నిమిషాలు, కళ్యాణ్ దగ్గర 1 నిమిషం.. మొత్తం 16 నిమిషాల టైమ్ ను ఫ్యామిలీ కోసం తీసుకుంది. దీంతో సంజనా తన ఫ్యామిలీతో సంతోషంగా గడిపింది. అలాగే ఆమె పిల్లలతో హౌస్ మేట్స్ కాసేపు సరదాగా టైమ్ స్పెండ్ చేశారు.
చివరగా దివ్య తల్లి ఎంట్రీతో హౌస్ లో సందడి నెలకొంది. దివ్య తల్లి రాగానే ఆమెను తప్ప అందరినీ కదలమన్నారు. దివ్యను కాసేపు ఆట పట్టించిన ఆమె తల్లి శ్రీలక్ష్మీ హౌస్ మేట్స్ అందరితో ముచ్చటించింది. ఎవరెవరు ఎలాంటి వారో కూడా చెప్పింది. చదువులో వెనకబడిపోవడంతో 25 ఏళ్ల క్రితం తన బ్రదర్ సూసైడ్ చేసుకున్నాడని, ఇప్పుడు భరణిని చూస్తే తనకు తన బ్రదర్ గుర్తొస్తున్నాడని ఎమోషనల్ అయ్యింది.
సుమన్ శెట్టి – దివ్య ఫ్రెండ్షిప్ గురించి, వాళ్ళ హైట్ గురించి సెటైర్లు వేసింది. కళ్యాణ్ పక్కింటి అబ్బాయి, ఇమ్మూ అందరివాడు, భరణి అన్నలాంటి వాడు, రీతూ – దివ్యాలదీ ఓ రకమైన ట్రాక్, డెమోన్ – దివ్య ఏమీ మాట్లాడుకోరు అంటూ ఒక్కొక్కరి గురించి చెప్పింది. చివరికి తనూజా పెద్ద కూతురు లాంటిది. నా కూతురు నాకు తెలియకుండానే అన్నీ నా చేతుల్లో నుంచి తీసేసుకుంటుంది. అలా ఆమె మీ అందరి నుంచి తీసేసుకుంది. కానీ మీకు మాత్రం తెలీదు’ అంటూ సెపరేట్ గా బాంబ్ పేల్చింది.
Read Also : ఐస్ ముక్కల మధ్య తెగిపడిన చెయ్యి… ఇంటెన్స్ తమిళ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్