OTT Movie : మలయాళం థ్రిల్లర్లను ఈ మధ్య వదిలి పెట్టకుండా ఓ లుక్ వేస్తున్నారు ఆడియన్స్. రియలిస్టిక్ గా తెరకెక్కించడం వల్ల ఆడియన్స్ కి ఈ సినిమాలు బాగా కనెక్ట్ అవుతున్నాయి. అందుకే డిజిటల్ స్ట్రీమింగ్ కి రావడమే ఆలస్యం వదిలి పెట్టడంలేదు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా కూడా థ్రిల్లర్ జానర్లో వచ్చిందే. ఈ కథ 48 గంటల్లో ఓ కేసును కొలిక్కి తెచ్చే ప్రయత్నంలో నడుస్తుంది. ఇందులో ఊహించని ట్విస్ట్లు వస్తూనే ఉంటాయి. ఇది డైరక్ట్ గా ఓటీటీలో స్ట్రీమింగ్ అయింది. థియేటర్ల గడప ఎక్కలేదు. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ?అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
ఈ మలయాళం క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ పేరు ‘The Last Two Days’ సంతోష్ లక్ష్మణ్ దర్శకత్వంలో దీపక్ పరంబోల్, ధర్మజన్ బోల్గట్టి, మేజర్ రవి, విజయ్ బాబు లీడ్ రోల్స్ లో నటించారు. ఈ సినిమా 2021 మే 27 నుంచి NeeStream లో డైరెక్ట్ స్ట్రీమింగ్ కి వచ్చింది.
1 గంట 16 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా ఐయండిబిలో 5.8/10 రేటింగ్ పొందింది.
సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీకాంత్ శర్మ చేతికి, రిటైర్‌మెంట్‌కు రెండు రోజుల ముందు ఒక క్రిటికల్ కేసు వస్తుంది. ఒక రాజకీయ పార్టీకి చెందిన ముగ్గురు యువ నాయకులు రెండు నెలల క్రితం మిస్సింగ్ అయిన కేసు అతని మీద పడుతుంది. రాజకీయ నాయకులు, మీడియా ఒత్తిడి ఎక్కువగా ఉండటంతో ఈ కేసును వీలైనంత తొందరగా క్లోస్ చేయమని చెప్తారు. శ్రీకాంత్ తన లాస్ట్ స్టాండ్‌గా కానిస్టేబుల్ అబీ తో కలిసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. క్లూస్ ఏమీ లేవు, కానీ ఒక చిన్న CCTV ఫుటేజ్, ఒక ఫోన్ కాల్ రికార్డు, మిస్సింగ్ అయిన ముగ్గురిలో ఒకడి గర్ల్‌ఫ్రెండ్ స్టేట్‌మెంట్ ద్వారా అతను నెమ్మదిగా రహస్యం దగ్గరకు చేరుకుంటాడు. మొదట అందరూ రాజకీయ హత్య అని అనుకుంటారు, కానీ నిజం బయటపడుతుంది.
Read Also : మర్డర్ డీల్ తో మతిపోగొట్టే క్రైమ్ థ్రిల్లర్… చంపాల్సిన అమ్మాయితోనే పాడుపని… నెవర్ బిఫోర్ క్లైమాక్స్
ఈ మిస్సింగ్ కేసు వెనుక ఉన్న అసలు కారణం, నేరస్థులు ఎవరో బయట పడుతుంది. ఈ సినిమా ప్రేక్షకులు అస్సలు ఊహించని ఒక పెద్ద ట్విస్ట్‌తో ముగుస్తుంది. సమాజంలో మహిళలు, పిల్లలు ఎదుర్కొనే సమస్యలకు వ్యతిరేకంగా సాగే ఈ కథ ఇది. ఆ ట్విస్టు ఏమిటి ? శ్రీకాంత్ శర్మ ఈ కేసును ఎలా ముగిస్తాడు ? అనే విషయాలను, ఈ మలయాళం క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమాని చూసి తెలుసుకోవాల్సిందే.