E-Paper
Advertisement

Road Accident: చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఘోర ప్ర‌మాదం.. రెండు కార్లు ఢీ, ఆపై బోల్తా, స్పాట్‌లో ఏడుగురు టీచ‌ర్స్

Road Accident: చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఘోర ప్ర‌మాదం.. రెండు కార్లు ఢీ, ఆపై బోల్తా, స్పాట్‌లో ఏడుగురు టీచ‌ర్స్
Advertisement

Road Accident: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.  ఎదురెదురుగా వేగంగా వస్తున్న రెండు కార్లు ఢీ కొన్నాయి. ఈ రెండు కార్లు లోయలోకి వెళ్లిపోయాయి. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. అందులో ఐదుగురు ప్రభుత్వం ఉపాధ్యాయులు ఉన్నారు. అసలు ఘటన ఎలా జరిగింది?

Advertisement

నెల్లూరులో ఘోర ప్ర‌మాదం

మంగళవారం ఉదయం నెల్లూరు జిల్లాలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వల్లేటిపాలెం సమీపంలో ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీ కొన్నాయి.  ఈ ఘటనలో రోడ్డు పక్కనున్న లోయలోకి వెళ్లిపోయారు. ఈ ఘటనలో మొత్తం ఏడుగురు వ్యక్తులు గాయపడ్డారు. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది.

Advertisement

వెంటనే స్థానికులు అంబులెన్స్‌కి సమాచారం ఇచ్చారు. అక్కడి రాగానే గాయపడిన టీచర్లు, కారులో నుంచి బయటకు తీసి, ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం గాయపడిన వారంతా ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పారు.

రెండు కార్లు ఢీ, ఆపై బోల్తా

మరొక టీచర్‌ని మెరుగైన వైద్యం కోసం కావలి ఆసుపత్రికి తరలించారు. ఒక కారులో కందుకూరు నుంచి వల్లేటిపాలెం జెడ్సీ పాఠశాలకు వెళ్తున్నారు ఐదుగురు ఉపాధ్యాయులు. మరొక కారులో ఇద్దరు వ్యక్తులున్నారు. ఈ ప్రమాదానికి ప్రధాన కారణం మూల మలుపు కావడమేనని చెబుతున్నారు.

ALSO READ: డ్రైవర్ డ్రంకెన్ డ్రైవింగ్.. లారీని ఢీ కొట్టిన స్కూల్ బస్సు

ఎదురుగా వచ్చే వాహనం కనిపించకపోవడంతో ఘటన జరిగిందని చెబుతున్నారు. ఉపాధ్యాయులు ప్రయాణిస్తున్న కారు,  వేగంగా వెళ్లలేదని అంటున్నారు. ఎదురుగా వస్తున్న కారు వేగంగా రావడమే ఈ ప్రమాదానికి కారణమని అంటున్నారు. రీసెంట్‌గా జాతీయ రహదారి నిర్మాణం జరిగింది. దాని తర్వాత ఇదే తొలి ఘటన అని చెబుతున్నారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సివుంది. 

మరోవైపు  చిత్తూరు జిల్లాలో రెండు కార్లు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. నగరి మండలం తడుకుపేట వద్ద ఈ ప్రమాదం జరిగింది. తిరుచానూరు నుంచి తిరుత్తని వైపు వెళ్తున్న కారు.. ఎదురుగా వస్తున్న మరో కారుని ఢీ కొంది. ఆ కారు చెన్నై నుంచి తిరుమల వైపు వెళ్తోంది.

ఈ ప్రమాదంలో తిరుచానూరుకు చెందిన శంకర్, సంతానం, అరుణ్ మృతి చెందారు. తమిళనాడుకు చెందిన మరో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయాలయ్యాయి. అంబులెన్సులో మృతదేహాలు, క్షతగాత్రులను నగరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో పోటు కార్మికులుగా సంతానం, శంకర్‌ పని చేస్తున్నారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×