Bigg Boss 9:బిగ్ బాస్(Bigg boss) .. తెలుగు బుల్లితెర ప్రేక్షకులను మరొకసారి ఆకట్టుకోవడానికి సిద్ధమయింది. ఇప్పటికే 8 సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో.. ఇప్పుడు 9వ సీజన్ కి సన్నహాలు చేసుకుంటోంది. అందులో భాగంగానే ఈరోజు రాత్రి 7 గంటలకు స్టార్ మా వేదికగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కార్యక్రమం చాలా గ్రాండ్ గా అట్టహాసంగా ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ షోకి సంబంధించిన పలు విషయాలు షోపై అంచనాలు పెంచేస్తున్నాయి. ఇప్పటికే డబుల్ హౌస్.. డబుల్ డోస్.. డబుల్ ఎంటర్టైన్మెంట్ అంటూ హోస్ట్ నాగార్జున (Nagarjuna ) అంచనాలు పెంచేశారు.
దీనికి తోడు తాజాగా గ్రాండ్ రిలీజ్ కి సంబంధించిన ప్రోమోని ఇప్పుడు నిర్వాహకులు విడుదల చేయగా.. ఇందులో ఇంకా హౌస్ లోకి అడుగుపెట్టనే లేదు అప్పుడే ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వడం చూపించారు. ఇప్పుడు తొమ్మిది మంది సెలబ్రిటీలతో 6 మంది కామన్ పీపుల్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు ఇక వీరంతా కూడా తమ పర్ఫామెన్స్ తో ఎలా మెప్పించబోతున్నారు అనే విషయం మరింత వైరల్ గా మారింది. ఇదిలా ఉండగా మరి కాసేపట్లో ప్రారంభం కాబోతున్న ఈ సీజన్లోకి కామన్ మ్యాన్ క్యాటగిరి లో 6 మంది ఎవరెవరు ఎంట్రీ ఇస్తున్నారో తెలిసిపోయింది. ఇప్పుడు సెలబ్రిటీలు ఎవరెవరు అడుగుపెట్టబోతున్నారు అనే జాబితా కూడా వచ్చేసింది.
హౌస్ లోకి వెళ్లబోయే తొమ్మిది మంది సెలబ్రిటీస్ వీరే..
ప్రస్తుతం హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోయే ఆ జాబితా విషయానికి వస్తే.. ఆశా షైనీ, కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మ, నటుడు సుమన్ శెట్టి, జబర్దస్త్ కమెడియన్ ఇమ్మానుయేల్, జబర్దస్త్ లేడీ కమెడియన్ రీతూ చౌదరి, తనూజ, రాము రాథోడ్, హీరోయిన్ సంజన గర్లాని, భరణి ఇలా మొత్తం 9 మంది సెలబ్రిటీలు హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నారు. ఇక కామన్ మ్యాన్ క్యాటగిరీలో..దమ్ము శ్రీజ, మాస్క్ మ్యాన్ హరీశ్, మర్యాద మనీశ్, ఆర్మీ పవన్ కల్యాణ్, ప్రియాశెట్టి, హీమ్యాన్ పవన్.. మొత్తం 15 మంది కంటెస్టెంట్స్ తో సీజన్ 9 ఘనంగా ప్రారంభం కాబోతోంది.
also read:Teja sajja: ఐఫాలో చిరు, బాలయ్య పై తేజ సజ్జా సెటైర్స్.. దెబ్బకు క్లారిటీ!
అగ్ని పరీక్షతో ఆరుగురి సత్తా చూసేసిన ఆడియన్స్..
ఇకపోతే కామన్ మ్యాన్ క్యాటగిరీలో భాగంగా సెలెక్ట్ అయిన 6 మంది అగ్నిపరీక్ష షోలో తమ బలాబలాలను నిరూపించుకున్నారు. ముఖ్యంగా హౌస్ లో కి వెళ్ళబోయే వీరు ఎలాంటి అర్హతలు కావాలో అన్ని సొంతం చేసుకున్నారు. తమ ఆట, పాట పెర్ఫార్మెన్స్ తో అందరినీ మెప్పించారు. చివరికి ఫైనల్ గా నిలిచిన ఈ ఆరుగురు గట్టిపిండాలే.. మరి వీరితో సెలబ్రిటీలు ఎలా పోటీ పడబోతున్నారు. వీరి దాడికి వారు తట్టుకుంటారా అనే విషయం కూడా ఇప్పుడు వైరల్ గా మారింది. ఏది ఏమైనా ఆద్యంతం ఉత్కంఠ పెంచుతూ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్న ఈ రణరంగం ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.
#BiggBossTelugu9 Launch Shoot started:
5 Commoners:
👉Harish, Srija, Manish, Priya and Soldier Kalyan.
9 Celebrities:
👉Tanuja, Bharani, Emmanuel, Asha Saini, Rithu Suman shetty, Shresti Varma, Ramu Rathod, Sanjana #BiggBossTelugu #biggbossagnipariksha #NagarjunaAkkineni pic.twitter.com/r7gNrKRQIN
— DarshXplorer. (@diligentdarshan) September 6, 2025