E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu : తనూజా వల్ల కళ్యాణ్ కి కునుకు కరువు… అక్కడ నువ్వు చెప్పిందేంటి చేసిందేంటి భయ్యా?

Bigg Boss 9 Telugu : తనూజా వల్ల కళ్యాణ్ కి కునుకు కరువు… అక్కడ నువ్వు చెప్పిందేంటి చేసిందేంటి భయ్యా?
Advertisement

Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ సీజన్ 9 డే 65 ఎపిసోడ్ లో సుమన్ శెట్టికి తీరని అన్యాయం జరిగింది. హీరో హీరోయిన్ కొట్టుకుని కమెడియన్ మీద పడ్డట్టు… తనూజ – కళ్యాణ్ ఫైట్ చేసుకుని సుమన్ ను బలిచ్చారు. అసలు ఈ గొడవంతా దేని గురించి? నిన్న మొన్నటిదాకా ఒకరికి ఒకరు అన్నట్టుగా ఉన్న కళ్యాణ్, తనూజా ఎందుకు ఇంత గొడవ పడ్డారు ? అసలు ఇందులో తప్పేవరిది? అనే వివరాల్లోకి వెళ్తే…

అసలేం జరిగిందంటే ?

కమాండర్స్ కు పెట్టిన టాస్క్ లో సంజన ఓడిపోయింది. రూల్స్ ప్రకారం ఆమె సామాన్యులలో ఒకరిని సెలెక్ట్ చేసుకుని ‘బిల్డ్ ఇట్ టు విన్ ఇట్’ టాస్క్ ఆడాలి. సుమన్ – సంజన ఈ గేమ్ ను ఆడగా… ఈ టాస్క్ లో స్క్వేర్ బాక్స్ లను ఒకదానిపై ఒకటి టవర్ గా పేర్చారు. అయితే ఇద్దరి టవర్ లలో సంజన పర్ఫెక్ట్ గా చేసింది. ఆమెకు హైట్ అడ్వాంటేజ్ అయ్యింది. అయితే సుమన్ శెట్టి ముందుగా టవర్ ను కట్టాడు. కానీ సంచాలక్ కళ్యాణ్ సంజన విన్ అయ్యిందని నిర్ణయించడం తనూజాతో గొడవకు దారి తీసింది. “నువ్వు ముందు ఎలాగైనా టవర్ నిర్మిస్తే చాలన్నావు. ఆయన హైట్ లేకపోయినా తన సామర్థ్యానికి మించి కట్టాడు. పైగా ముందే చెప్పాడు. పర్ఫెక్ట్ గా ఉండాలని ముందే చెప్పాలి కదా” అంటూ కళ్యాణ్ ను ఓ రేంజ్ లో ఫైర్ అయ్యింది. కానీ కళ్యాణ్ మాత్రం “తప్పుగా పోట్రెయిట్ చేస్తే పడడానికి ఎవ్వడూ రెడీగా లేడు. ఇద్దరి టవర్స్ సేమ్ హైట్ ఉన్నాయి. నువ్వైతే ఎవరికి ఇస్తావు?” అని అడిగాడు. “ముందు పెట్టాడు కాబట్టి నేను సుమన్ కు ఇస్తాను” అని తేల్చేసింది తనూజా. “సరే నేను ఇవ్వను. సంచాలక్ గా నా నిర్ణయం నేను తీసుకుంటాను” అంటూ ఎక్కువ హైపర్ అవ్వకుండా రిప్లై ఇచ్చాడు.

ఇది పక్కా పర్సనల్ భయ్యా 

Advertisement

ఎపిసోడ్ ప్రకారం చూసుకుంటే ఇందులో తప్పు కళ్యాణ్ దే. టాస్క్ స్టార్ట్ అయ్యేముందు ఆయన క్లియర్ గా ప్లేయర్స్ కు ఎలాగైనా సరే టవర్ కడితే చాలని స్వయంగా చెప్పాడు. తీరా టాస్క్ అయ్యాక సంజన కంటే ముందే టవర్ కట్టిన సుమన్ ను గాలికొదిలి సంజనకు ఫేవర్ గా తీర్పు ఇచ్చాడు. ఇదంతా చూస్తుంటే నిజంగానే తనూజా అన్నట్టు కళ్యాణ్ ‘ఫెయిల్డ్ సంచాలక్’. అన్నట్టుగా ఈ మాటే.. అది కూడా తనూజా నోటి వెంట రావడాన్ని కళ్యాణ్ ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నాడు. అర్దరాత్రి దాకా మెలకువగా ఉండి మరీ బాధపడ్డాడు. అయితే ఈ వాదన జరుగుతున్నప్పుడు గతంలో సుమన్ – కళ్యాణ్ సంచాలక్ లుగా చేసిన టాస్క్ ను మధ్యలోకి లాగాడు. అందులో కూడా అలాగే చేశారు అంటూ ఎప్పటి విషయాన్నో మైండ్ లో పెట్టుకుని, తనూజా అన్న మాటలకు తన్నుకొచ్చిన ఈగోతోనే సుమన్ శెట్టిని పక్కన పెట్టాడు కళ్యాణ్. అతడిపై దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో చూడాలి.

Read also : పక్కకెళ్లి ఆడుకోపో తనూజా… ఇచ్చిపడేసిన కళ్యాణ్… రీతూ ఫౌల్ గేమ్ పై సంజన రచ్చ రంబోలా

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×