BigTV English

Bigg Boss 9: ‘బిగ్ బాస్ 9’ లోకి ప్రభాస్ బ్రదర్.. ఇది అస్సలు ఊహించి ఉండరు..

Bigg Boss 9: ‘బిగ్ బాస్ 9’ లోకి ప్రభాస్ బ్రదర్.. ఇది అస్సలు ఊహించి ఉండరు..

Bigg Boss 9: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న టాప్ రియాల్టీ షో అంటే అందరికీ టక్కును గుర్తొచ్చే ఏకైక షో బిగ్ బాస్. హిందీలో ఈ షో 18 సీజన్లు పూర్తిచేసుకుంది.. కానీ తెలుగులో మాత్రం ఎనిమిది సీజన్ అని మాత్రమే పూర్తి చేసుకుంది. ప్రస్తుతం 9వ సీజన్ కోసం మేకర్స్ సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఈ సీజన్ కి సంబంధించిన సెట్ ని తయారు చేసినట్లు తెలుస్తుంది. అయితే గత సీజన్ తో పోలిస్తే ఈ సీజన్లో ఎక్కువగా సెలబ్రిటీలు రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ, ప్రస్తుతం ఓ వార్త మాత్రం ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. ఈసారి బిగ్ బాస్ లోకి టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ సోదరుడు కంటెస్టెంట్ గా రాబోతున్నాడని ఓ వార్త చక్కర్లు కొడుతుంది. అందులో నిజం ఎంత ఉందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..


బిగ్ బాస్ లోకి ప్రభాస్ బ్రదర్.. 

తెలుగు టాప్ రియాల్టీ షో బిగ్ బాస్ లోకి ప్రభాస్ సోదరుడు రాబోతున్నట్లు గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ రూమర్స్ నిజమే అంటూ ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.. ప్రముఖ యంగ్ హీరో సుమంత్ అశ్విన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. నిర్మాత MS రాజు కొడుకు. ‘తూనీగ తూనీగ’ అనే చిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేసిన ఈయన ‘కేరింత’, ‘హ్యాపీ వెడ్డింగ్’, ‘లవర్స్’, ‘కొలంబస్’ ఇలా ఎన్నో సినిమాల్లో హీరో గా నటించాడు. కేరింత, లవర్స్ చిత్రాలు కమర్షియల్ గా సూపర్ హిట్స్ అయ్యాయి. కానీ ఎందుకో ఆ తర్వాత ఈ హీరో విజయాలను అందుకోలేకపోయాడు. ప్రస్తుతం సినిమా ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఈయన ప్రభాస్ కి సొంత తమ్ముడిలాగా ఉంటాడు. ప్రభాస్ కూడా తనని సొంత తమ్ముడు లాగా చూసుకుంటాడు. ఈమధ్య ఈ హీరో సినిమాలేవి లేకపోవడంతో బిగ్ బాస్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోడానికి ఎంట్రీ పోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. మరి బిగ్ బాస్ తర్వాత అతని జీవితం పూర్తిగా మారిపోతుంది ఏమో చూడాలి..


Also Read:మార్క్ శంకర్ పై బూతు ట్రోల్స్… అల్లు అర్జున్ ఫ్యాన్ అరెస్ట్..

బిగ్ బాస్ 8.. 

తెలుగులో మోస్ట్ వాంటెడ్ షో బిగ్ బాస్ గురించి అందరికీ తెలుసు.. 16 మంది కంటెస్టెంట్లతో 100 రోజులు సరికొత్త ఆటలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ఈ షోకు ఫ్యాన్స్ ఎక్కువే.. గ తేడాది సీరియల్ బ్యాచ్ ను దించిన యాజమాన్యం విన్నర్ విషయంలో కూడా పక్షపాతం చూపించింది అంటూ వార్తలను మూట కట్టుకుంది. ఈసారి అలాంటి పరిస్థితి ఎదురవకుండా కొత్త వాళ్ళని సినిమాల్లో కనిపించిన వాళ్ళని తీసుకురావాలని ఫిక్స్ అయ్యారట బిగ్ బాస్ యాజమాన్యం. గత సీజన్ లో కంటెస్టెంట్స్ మంచి కంటెంట్ ని ఇచ్చినప్పటికీ, నాగార్జున హోస్ట్ గా సరిగా ఆ కంటెంట్ ని ఉపయోగించుకోలేదు, అంతే కాకుండా గేమ్స్ కూడా ఆశించిన స్థాయిలో నిర్వహించలేదు. అందుకే గత సీజన్ యావరేజ్ అయ్యింది. అందుకే ఈ సీజన్ తో ఎలా అయినా భారీ హిట్ కొట్టాలనే ఉద్దేశ్యంతోనే యాజమాన్యం కొత్త వాళ్లను కాకుండా సెలెబ్రేటీలను దింపనున్నారని సమాచారం.. మరి త్వరలోనే బిగ్ బాస్ 9 గురించి పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉందని తెలుస్తుంది…

Tags

Related News

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Mallika Sherawat: బిగ్ బాస్‌లోకి హాట్ బ్యూటి మల్లికా షెరావత్.. అబ్బాయిలు ఇక టీవీ వదలరేమో!

Big Stories

×