BigTV English

IPL 2025 Revenue: ఐపీఎల్‌లో బంతులు కాదు..యాడ్స్‌తో కోట్ల వర్షం, ఎంత వస్తుందో తెలిస్తే షాక్ అవుతారు!

IPL 2025 Revenue: ఐపీఎల్‌లో బంతులు కాదు..యాడ్స్‌తో కోట్ల వర్షం, ఎంత వస్తుందో తెలిస్తే షాక్ అవుతారు!

IPL 2025 Revenue: ఒకప్పుడు క్రికెట్ అంటే కేవలం ఆట మాత్రమే. అభిమానులు స్టేడియానికి వెళ్లి ఎంజాయ్ చేస్తూ చూసే గేమ్. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు క్రికెట్ అంటే వ్యాపార రంగానికి గోల్డెన్ ఛాన్స్. అదేనండి ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్). ఈ టోర్నమెంట్ ప్రపంచంలోనే అత్యంత పాపులర్ లీగ్‌గా మారిపోయింది. కేవలం ఆటగాళ్లు మాత్రమే కాదు, కోటీశ్వర కంపెనీలు కూడా దీనిపై కన్నేశాయి. ఎందుకంటే ఇది బ్రాండ్లకు ఒక అద్భుతమైన ప్రచార రథంగా మారిపోయింది. అసలు ఐపీఎల్ యాడ్స్ నుంచి వచ్చే రెవిన్యూ ఎంత ఉంటుందో తెలుసా మీకు. తెలిస్తే తప్పక ఆశ్చర్యపోతారు. 2025లో IPL ప్రకటనల ఆదాయం రూ. 6,000 నుంచి 7,000 కోట్ల వరకూ ఉంటుందని అంచనా.


IPL అంటే ఒక బిలియన్ డాలర్ బ్రాండ్!
ప్రస్తుతం ఐపీఎల్ విలువ ఏకంగా $12 బిలియన్లు (రూ.10,27,66,38,00,000). ఇది క్రమంగా ఊహించలేని స్థాయిలో పెరిగిందని చెప్పవచ్చు. ఈ లీగ్‌కి వచ్చిన ఆదాయంలో ప్రధాన భాగం ప్రకటనల నుంచి వస్తోంది. టీవీ, డిజిటల్, స్టేడియం ప్రకటనలు, టీమ్ స్పాన్సర్‌షిప్‌లు ఇలా ఎన్నో మార్గాల్లో బ్రాండ్లు డబ్బును అందిస్తున్నాయి. అంతర్జాతీయ బ్రాండ్లకు భారత్‌లో అడుగుపెట్టడానికి ఇది మంచి అవకాశం. ఎందుకంటే భారతదేశం లాంటి భారీ జనాభా ఉన్న ప్రాంతాల్లో వారి బ్రాండ్‌ గురిచి ప్రచారం చేసుకోవచ్చు.

దుబాయ్ రియల్ ఎస్టేట్ కంపెనీ కూడా
‘డాన్యూబ్ ప్రాపర్టీస్’ అనే దుబాయ్‌కు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ ఇప్పుడు IPL‌లో స్పాన్సర్‌షిప్ ఇచ్చింది. స్టార్ స్పోర్ట్స్‌లో ‘సహ శక్తితో’ అనే క్యాంపెయిన్‌ ద్వారా ఇది కొత్తగా తన మార్కెటింగ్ చేయడం మొదలుపెట్టింది. ఈ కంపెనీ యజమాని రిజ్వాన్ సాజన్ మాట్లాడుతూ, “భారతదేశం మా బిజినెస్‌కి చాలా ముఖ్యమైన మార్కెట్. IPL లాంటి పెద్ద వేదికలో పాల్గొనడం వలన మాకు మంచి లీడ్స్ వస్తున్నాయని చెప్పారు. IPL చూసే అనేక మంది NRIలు కూడా తమ టార్గెట్ కస్టమర్లు అని ఆయన అన్నారు.


Read Also: Bluetooth Earbuds: బ్లూటూత్ ఇయర్‌బడ్ లింక్ కాలేదా..ఈ …

డిజిటల్ IPL స్పాన్సర్‌గా చరిత్ర
ఇంకో అరబ్ కంపెనీ అయిన లట్టాఫా పెర్ఫ్యూమ్స్ కూడా ముందుకు వచ్చింది. ఈ బ్రాండ్ జియోసినిమా (JioCinema) డిజిటల్ IPL కవరేజ్‌లో స్పాన్సర్‌గా మారింది. ఇది జియో IPL డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై ప్రకటన ఇచ్చిన మొదటి అంతర్జాతీయ రిటైల్ బ్రాండ్ కావడం విశేషం.

విమానయాన కంపెనీలు కూడా
ఎమిరేట్స్, ఎతిహాద్, టర్కిష్ ఎయిర్‌లైన్స్, ఖతార్ ఎయిర్‌వేస్ లాంటి విమానయాన సంస్థలు కూడా IPLని బ్రాండ్ ప్రమోషన్ వేదికగా ఉపయోగించుకుంటున్నాయి. టూరిజం బోర్డులు, ప్రత్యేకంగా సౌదీ అరేబియా, మలేషియా వంటి దేశాల నుంచి వచ్చినవి ఈ లీగ్ ద్వారా తమ దేశాన్ని ప్రమోట్ చేస్తున్నాయి.

ఇది బ్రాండ్ హవా
2025 IPL సీజన్ మొదటి 13 మ్యాచులలోనే ప్రకటనల వాల్యూమ్ 12% పెరిగింది. అదే సమయంలో బ్రాండ్ వర్గాల సంఖ్యలో 13% గ్రోత్ వచ్చింది. అంతేకాదు, ప్రకటనదారుల సంఖ్య ఏకంగా 31% పెరిగింది, అంటే మొత్తం 65 బ్రాండ్‌లు రంగంలో ఉన్నాయి!

రికార్డు వీక్షకులు
IPL ఇప్పుడు కేవలం ఆట కాదని జియోస్టార్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ఎహ్సాన్ ఛటర్జీ అన్నారు. ఇది ఒక అంతర్జాతీయ వాణిజ్య వేదికగా మారిందన్నారు. బ్రాండ్లకు ఇది లీడ్ జనరేషన్, బ్రాండ్ లాయల్టీ కోసం అద్భుతమైన అవకాశాన్ని ఇస్తోందని చెప్పారు. ఈ సీజన్‌లో 800 మిలియన్లకు పైగా వీక్షకులు IPL చూడడం మొదలుపెట్టారు. ఇందులో చాలా మంది 25-45 సంవత్సరాల మధ్యవారు ఉన్నారు. ఈ వయస్సు సమూహం ఏ బ్రాండ్‌కైనా అత్యంత విలువైన టార్గెట్ ఆడియన్స్ అని చెప్పవచ్చు.

చిన్న పట్టణాల నుంచే పెద్ద మార్కెట్
ఇంటర్నెట్ రీచ్ పెరగడంతో చిన్న పట్టణాల యువత కూడా IPL ఫ్యాన్స్ అయిపోయారు. వాళ్లలో చాలా మంది ఇప్పుడే బ్రాండెడ్ ఉత్పత్తులు ఉపయోగించడం మొదలుపెట్టారు. ఈ వీక్షకుల మైండ్‌షేర్‌కి చేరాలంటే IPL లాంటి ప్లాట్‌ఫారమ్‌లో ప్రకటన ఇవ్వడమే బెస్ట్ మార్గం అని అంతర్జాతీయ కంపెనీలు అర్థం చేసుకున్నాయి. దీంతో IPL ఇప్పుడు భారతదేశంలో మాత్రమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా బ్రాండ్‌లకు పరిచయ వేదికగా మారింది.

Related News

Asia Cup 2025: దరిద్రం అంటే ఇదే.. ఆసియా కప్ 2025 లో ఈ తోపు క్రికెటర్లను మిస్ కాబోతున్నాం

Umpire Injured: ఎంతకు తెగించార్రా… ఏకంగా అంపైర్ ప్రైవేట్ పార్ట్స్ పైనే దాడి చేసిన బంగ్లా ప్లేయర్లు

Mohammed Siraj: మహమ్మద్ సిరాజ్ కారు నెంబర్ సీక్రెట్ ఇదే.. లక్షలు పెట్టి మరి కొన్నాడా!

Pujara on Ashwin: టీమ్ ఇండియా హెడ్ కోచ్ గా అశ్విన్ ?

Asia Cup 2025: ఆసియా కప్ నుంచి గిల్, సిరాజ్ ఔట్… టీమిండియా తుది జట్టు ఇదే !

Samantha: సమంతకు దగ్గరైన టీమిండియా ప్లేయర్.. షాకింగ్ పోస్ట్ వైరల్ !

Big Stories

×