BigTV English

Pawan Kalyan : మార్క్ శంకర్ పై బూతు ట్రోల్స్… అల్లు అర్జున్ ఫ్యాన్ అరెస్ట్..

Pawan Kalyan : మార్క్ శంకర్ పై బూతు ట్రోల్స్… అల్లు అర్జున్ ఫ్యాన్ అరెస్ట్..

Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఏం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ స్కూల్ అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. ఇటీవలే కోలుకున్న మార్క్ ను పవన్ కళ్యాణ్ తిరిగి హైదరాబాద్ కు తీసుకొని వచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ కుమారుడికి ప్రమాదం జరిగినందుకు చాలా మంది బాధ పడితే, అల్లు అర్జున్ అభిమాని మాత్రం దారుణంగా బూతులు తిడితూ ట్వీట్ చేశారు. అది కాస్త సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వార్ గా మారింది. దీనిపై పవన్ కళ్యాణ్ అభిమానులు ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. దీని గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..


పవన్ కుమారుడు పై కామెంట్స్ చేసిన వ్యక్తి అరెస్ట్..

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుటుంబంపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారు.. అల్లు అర్జున్ ఆర్మీ వ్యక్తి పనే అని పోలీసులు ఆ కోణంలో విచారణ చేపట్టారు. సోషల్ మీడియాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో పాటు భార్య అన్నా లెజినోవా.. కుమారుడు మార్క్‌ శంకర్‌పై కూడా సోషల్‌ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురు యువకులపై కేసు నమోదు చేశారు.. కర్నూలు జిల్లా గూడూరులో ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ కుటుంబంపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గుంటూరు సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం.. పుష్పరాజ్, ఉదయ్ కిరణ్, ఫయాజ్‌గా గుర్తించారు. అయితే వీళ్లు అల్లు అర్జున్ అభిమానులుగా తెలుస్తోంది.. ప్రస్తుతం వీరి విచారణ గొప్యంగా ఉంచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీని పై పూర్తి వివరాలను పోలీసులు తెలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.


Also Read : ఈరోజు టీవి ఛానెల్లో వచ్చే సినిమాలు.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు పండగే..

డిప్యూటీ సీఏం పవన్ కళ్యాణ్ కొడుకు మార్క్ శంకర్..

సమ్మర్ వెకేషన్ నిమిత్తం సింగపూర్ వెళ్లిన  అక్కడి ఓ పాఠశాలలో సమ్మర్ కోర్సుల్లో చేరాడు. అతడి కోసం లెజినోవా కూడా సింగపూర్ వెళ్లారు. ఓ వైపు పార్టీ, మరో వైపు ప్రభుత్వ పాలన నేపథ్యంలో పవన్ మాత్రం సింగపూర్ వెళ్లలేదు. తన భార్య  కొడుకు వెళ్లారు. ఈ నెల 8న పవన్ అరకు పరిధిలోని గిరిజన గ్రామాల పర్యటనలో ఉండగా… సింగపూర్ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడం, ఆ ప్రమాదంలో మార్క్ శంకర్ గాయపడటం తెలిసిందే. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న పవన్ కళ్యాణ్ వెంటనే సింగపూర్ కు బయలు దేరారు. అక్కడ కొడుకు ఆరోగ్యం బాగా అయిన తరువాత తిరిగి మళ్లీ ఇండియకు వచ్చేసారు. మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు గాయాలు కాగా.. శ్వాస సంబంధిత సమస్యతో ఒకింత ఇబ్బంది పడ్డారు. ఈ క్రమంలో మూడు రోజుల పాటు సింగపూర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న మార్క్ ఇండియాకు తీసుకొని వచ్చారు పవన్ దంపతులు.. సింగపూర్ లో మార్క్ ట్రీట్మెంట్ కు కేవలం 30 వేల వరకు ఖర్చు అయ్యిందని సమాచారం.. ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగా ఉన్న మార్క్ శంకర్ కోసం అన్నా లెజ్నోవా తిరుమలలో తలనీలాలు సమర్పించి భారీగా విరాళాన్ని అందించారు..

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×