BigTV English

Secunderabad Crime News: పెళ్లి కావట్లేదని మనస్థాపంతో.. అక్కా చెల్లెళ్లు సూసైడ్

Secunderabad Crime News: పెళ్లి కావట్లేదని మనస్థాపంతో.. అక్కా చెల్లెళ్లు సూసైడ్

Secunderabad Crime News: సికింద్రాబాద్‌లో ఆత్మహత్యకు పాల్పడిన అక్కచెల్లెళ్లకు ఎలాంటి కష్టం వచ్చింది? ఎందుకు చనిపోవాలని నిర్ణయించుకున్నారు? వారి బంధువుల మాటేంటి? వారికి సంబంధించి కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. వీణా-మీనా ఆత్మహత్యకు కారణాలు చాలానే ఉన్నాయి. కష్టాలు ఎవరితో చెప్పకుండా చావులోనూ ఈ లోకాన్ని విడిచిపెట్టేశారు. స్టోరీ లోతుల్లోకి వెళ్తే..


సికింద్రాబాద్‌ కార్జాన పోలీసుస్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. శ్రీనిధి అపార్ట్‌మెంట్‌లో దుర్వాసన రావడంతో అపార్ట్‌మెంట్‌వాసులు డయల్ 100కు ఫోన్ చేసి చెప్పారు. దీంతో వీణా-మీనా విషయం వెలుగులోకి వచ్చింది. సకాలంలో వివాహం కాకపోవడం ఒక కారణం. దీనికితోడు మానసిక స్థితి సరిగా లేకపోవడంతో పురుగుల మందు తాగినట్టు చుట్టుపక్కల వాళ్లు చెబుతున్నమాట.

అసలు స్టోరీ ఏంటి?


వీణా-మీనా గురించి తెలిసిన ఓ పాఠశాల టీచర్ కీలక విషయాలు బయటపెట్టంది. పాతికేళ్ల నుంచి వీరిద్దరు ఈ అపార్టుమెంటులో ఉంటున్నారు.  అప్పుడే వారి వయస్సు పాతికేళ్లు పైనే ఉండేది. వీణా-మీనాలు తల్లిదండ్రులకు ఏడుగురు అమ్మాయి. ఒక అబ్బాయి.  వారి తండ్రి ఆర్మీలో పని చేశారు, ఆ తర్వాత రిటైర్ అయ్యారు.

వారి ఇద్దరు అక్కలు మరణించారు. మరో ముగ్గురు వివాహం చేసుకుని వేర్వేరుగా ఉంటున్నారు. తమ్ముడు ఎక్కడ ఉంటున్నాడో తెలీదు.  వీణ-మీనా పాతికేళ్ల నుంచి ఈ అపార్ట్‌మెంట్‌లో కలిసి జీవిస్తున్నారు. వీరిద్దరు నిరుద్యోగులు. మానసికంగా అనారోగ్యంతో ఉంటారు. ఇప్పుడు వీణా వయస్సు 59 ఏళ్లుకాగా, మీనా వయస్సు 60 ఏళ్లు. వీరిని స్థానికంగా ఉండే ఓ టీచర్ అప్పుడప్పుడు వెళ్ల చూసేది. వీలైతే ఫోన్‌లో వారితో ఆమె మాట్లాడేది.

ALSO READ: భర్త గొంతు కోసిన మహిళా యూట్యూబర్, ప్రియుడితో కలిసి శవాన్ని

పది రోజుల తర్వాత 

పది రోజుల కిందట అక్కచెల్లెళ్లతో చివరగా మాట్లాడింది. అపార్టుమెంట్ నుంచి దుర్వాసన వస్తుందని తెలియగానే పోలీసులు ఆ టీచర్‌కు సమాచారం ఇచ్చారు.  వెంటనే పోలీసులతో కలిసి ఆమె అక్కడికి వెళ్లింది. ప్రధాన తలుపు లోపల తాళం వేసి ఉంది. పదే పదే డోర్‌ బెల్ మోగినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదు. వెంటనే పోలీసులు తలుపులు ఓపెన్ చేసినవారిని తీసుకొచ్చారు. అప్పుడు అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించారు.

వీణా-మీనా ఇద్దరు అక్కాచెల్లెళ్లు హాలులో మంచం మీద పడి ఉన్నారు. ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. వీరి మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. నివేదిక కోసం ఎదురు చూస్తున్నామని, దర్యాప్తు కొనసాగుతుందన్నారు పోలీసులు. మిగతా సోదరుల ఆచూకీ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Related News

Bengaluru News: బెంగుళూరులో దారుణం.. 12 ఏళ్ల కూతురి కళ్ల మందు.. భార్యని చంపిన భర్త

Robbery In Khammam: దొంగల బీభత్సం.. ఒకే రాత్రి ఆరు ఇళ్లల్లో చోరీ

kolkata: కోల్‌క‌తాలో భారీ వ‌ర్షం.. ఐదుగురు మృతి!

Building Collapse: కుప్పకూలిన మూడంతస్తుల భవనం.. ఇద్దరు సజీవ సమాధి

Khammam: ఖానాపురంలో దారుణం.. కూర వేయలేదని మహిళపై గొడ్డలితో దాడి

Kerala News: భార్యని చంపిన భర్త.. ఆ తర్వాత ఫేస్‌బుక్‌లో లైవ్, అసలు మేటర్ ఇదీ?

Instagram love: ప్రియురాలిని చంపి.. సూట్‌కేస్‌లో బాడీని కుక్కి.. సెల్పీ తీసుకున్న ప్రియుడు.. ఆ తర్వాత ఏం చేశాడంటే?

Heart Attack: పుట్టినరోజు నాడే చావు.. బతుకమ్మ ఆడుతూ కుప్పకూలి మహిళ

Big Stories

×