E-Paper
Advertisement

OTT Movie : కిట్టి పార్టీలో ఖిలాడీ లేడీస్… కితకితలు పెట్టే పంజాబీ క్రైమ్ కామెడీ డ్రామా

OTT Movie : కిట్టి పార్టీలో ఖిలాడీ లేడీస్… కితకితలు పెట్టే పంజాబీ క్రైమ్ కామెడీ డ్రామా
Advertisement

OTT Movie : ఎట్టకేలకు నీరు బజ్వా, తానియా జంటగా నటించిన పంజాబీ చిత్రం ‘ఫాఫే కుట్నియన్’ చివరకు ఓటీటీలోకి అడుగు పెట్టింది. థియేటర్లలో విడుదలైన మూడు నెలలకు డిజిటల్ ఆడియన్స్ ను పలకరిస్తోంది. ఈ సినిమా కథ పంజాబ్ కిట్టీ పార్టీలలో మోసాలు చేస్తూ లైఫ్ ని లీడ్ చేసే ఇద్దరు మహిళల చుట్టూ తిరుగుతుంది. బాక్సాఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది. ఇది ఏ ఓటీటీలో ఉంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

ప్రేమ్ సింగ్ సిద్ధు దర్శకత్వం వహించిన ఈ పంజాబీ కామెడీ చిత్రం ‘ఫాఫే కుట్నియన్’ (Phaphey Kuttniyan). ఇందులో నీరు బజ్వా, తానియా లీడ్ రోల్స్ లో నటించగా, అమృత్ అంబి, నిషా బానో, ప్రభ్ బెయిన్స్, గుర్బాజ్ సింగ్, అనితా మీట్, జగ్తార్ బెనిపాల్ సహాయక పాత్రల్లో నటించారు.
ఈ పంజాబీ డ్రామా 2025 ఆగస్ట్ 22న థియేటర్లకి వచ్చింది.ఇప్పుడు చౌపాల్, ఓటీటీ ప్లే ప్రీమియంలో నవంబర్ 13 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

పంజాబ్‌లోని ఒక మిడిల్ క్లాస్ ఏరియాలో సిమ్రన్, గులాబో అనే ఇద్దరు హౌస్‌వైవ్స్ ఉంటారు. వీళ్ళ ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేనందున ఒక ఐడియా తో కలసి ముందుకు వెళతారు. ప్రతి నెలా కిట్టీ పార్టీలు పెట్టి, చిన్న చిన్న గేమ్స్ ఆడి, డబ్బులు గెలుస్తుంటారు. నిజానికి వాళ్లు చీటింగ్ చేసి ఈ డబ్బులు సంపాదిస్తుంటారు. ఇలా గెలిచిన డబ్బుతో వాళ్లు గ్లామరస్ లైఫ్ లీడ్ చేస్తుంటారు. ఒక రోజు పోలీస్ ఇన్‌స్పెక్టర్ రణజీత్ వీళ్ళ మీద అనుమానంతో సీక్రెట్‌గా ఇన్వెస్టిగేట్ చేయడం మొదలెడతాడు. సిమ్రన్ భర్త ఒక చిన్న జాబ్‌ చేస్తుండటంతో డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో అని అనుమానం ఎక్కువ అవుతుంది. గులాబోకి ఒక బాబు ఉంటాడు. ఆమె డబ్బును ఎక్కువగా అతని స్టడీస్ కోసం యూజ్ చేస్తుంటుంది. కానీ ఒక బిగ్ కిట్టీ పార్టీలో వాళ్ల ట్రిక్ బయట పడుతుంది. ఒక రిచ్ లేడీ వాళ్లను బ్లాక్‌మెయిల్ చేస్తుంది. నాకు భారీ మొత్తంలో డబ్బు ఇవ్వకపోతే పోలీసులకు చెప్తానాని బెదిరిస్తుంది.

Read Also : స్మశానంలో శవాలు తవ్వే సైకో… ఆ ఊళ్ళో ఆడపిల్లలు పుడితే అంతే సంగతులు… క్రేజీ కన్నడ మిస్టరీ థ్రిల్లర్

సిమ్రన్, గులాబో భయపడి, ఆ రిచ్ లేడీకి డబ్బు ఇవ్వడానికి మరో బిగ్ స్కీమ్ కి ప్లాన్ చేస్తారు. ఒక ఫేక్ జ్యువెలరీ షాప్ ఓపెన్ చేసి, కిట్టీ మహిళలను ఇన్వెస్ట్ చేయమంటారు. కానీ పోలీస్ రణజీత్ వాళ్లను ఫాలో అవుతాడు. సీక్రెట్ కెమెరాలు పెట్టి ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తాడు. మధ్యలో సిమ్రన్ భర్తకు సందేహం వస్తుంది. గులాబో బాబు స్కూల్ ఫీజు పెండింగ్ అవుతుంది. ఇక ఇద్దరూ ఒత్తిడిలో పడతారు. క్లైమాక్స్‌లో బిగ్ కిట్టీ పార్టీలో పెద్ద ట్విస్ట్ వస్తుంది. ఆ ట్విస్ట్ ఏమిటి ? పోలీసులకు వీళ్ళు దొరికి పోతారా ? ఆ పార్టీలో అసలేం జరుగుతుంది ? ఈ కథ ఎలా ఎండ్ అవుతుంది ? అనే విషయాలను, ఈ పంజాబీ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Related News

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×