BigTV English

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 మొదలయ్యేది అప్పుడే.. హోస్ట్ కూడా ఛేంజ్.?

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 మొదలయ్యేది అప్పుడే.. హోస్ట్ కూడా ఛేంజ్.?

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ అనే రియాలిటీ షో ముందుగా ఫారిన్ భాషల్లో మొదలయ్యి ఆ తర్వాత ఇండియన్ భాషల్లోకి కూడా వచ్చేసింది. ముందుగా హిందీలో స్టార్ట్ అయిన ఈ షోకు మంచి రెస్పాన్స్ రావడంతో సౌత్ భాషల్లో కూడా దీనిని ప్రారంభించారు. సౌత్ భాషల్లో కూడా ఇది సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ముఖ్యంగా తెలుగులో కూడా సీజన్ తర్వాత సీజన్ బిగ్ బాస్‌ను ఆదరిస్తూనే ఉన్నారు ప్రేక్షకులు. దీనిపై నెగిటివ్ కామెంట్స్ చేసేవారు ఉన్నా కూడా దీనిని ఇష్టంగా చూసేవారి సంఖ్య కూడా ఎక్కువే. అలా బిగ్ బాస్ సీజన్ 9 కోసం తెలుగు ప్రేక్షకులు ఎదురుచూస్తుండగా.. దీనికి సంబంధించిన ఆసక్తికర అప్డేట్ బయటికొచ్చింది.


అదే స్ట్రాటజీ

బిగ్ బాస్ సీజన్ 8 చాలావరకు డిశాస్టర్‌గానే నిలిచింది. ఆ సీజన్‌కు సంబంధించిన అప్డేట్స్ గురించి గానీ, కంటెస్టెంట్స్ గురించి గానీ అసలు ప్రేక్షకులు చాలావరకు మాట్లాడుకోలేదు. దాంతో పోలిస్తే బిగ్ బాస్ సీజన్ 7 చాలా పెద్ద హిట్ అయ్యింది. బిగ్ బాస్ 8ను హిట్ చేయడం కోసం పాత కంటెస్టెంట్స్‌ను వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా రంగంలోకి దించిన కూడా లాభం లేకపోయింది. కొత్త కంటెస్టెంట్స్ వల్ల కావడం లేదని, అందుకే పాత కంటెస్టెంట్స్‌నే మళ్లీ తీసుకొచ్చారని నెగిటివ్ కామెంట్స్ కూడా వినిపించాయి. అయితే బిగ్ బాస్ 9 విషయంలో కూడా మేకర్స్ మరోసారి అదే స్ట్రాటజీని ఉపయోగించనున్నారని బుల్లితెర సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది.


పాత కంటెస్టెంట్స్‌తోనే

ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 9 తెలుగులో కంటెస్టెంట్స్‌గా కొందరు సెలబ్రిటీల పేర్లు పరిగణనలోకి తీసుకుంటున్నారట మేకర్స్. అందులో యాంకర్ వర్షిణి, అనిల్ గీలా పేర్లు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఇప్పటికే యాంకర్స్ కేటగిరిలో శ్రీముఖి, విష్ణుప్రియా వంటి ఫీమేల్ యాంకర్స్ బిగ్ బాస్‌లో కంటెస్టెంట్స్‌గా వచ్చి అలరించారు. గత సీజన్‌లో తన తోటి కంటెస్టెంట్ అయిన పృథ్వితో విష్ణుప్రియా ప్రేమాయణం ప్రేక్షకుల్లో ఆసక్తి క్రియేట్ చేసింది. అలా ఇప్పుడు వర్షిణిని కూడా ఈ కేటగిరిలో కంటెస్టెంట్‌గా ఎంపిక చేశారట మేకర్స్. తనతో పాటు సీజన్ 8 నుండి ఇద్దరిని, సీజన్ 7 నుండి ముగ్గురిని, సీజన్ 6 నుండి ఒకరిని కూడా మొదటి ఎపిసోడ్ నుండే కంటెస్టెంట్స్‌గా ఎంటర్ చేయనున్నట్టు తెలుస్తోంది.

Also Read: జబర్దస్త్ అడల్ట్ కామెడీ కోసమే చూస్తున్నారు.. నాపై కూడా వల్గర్ కామెంట్స్

హోస్టింగ్‌పై నెగిటివిటీ

ఇక బిగ్ బాస్ సీజన్ 3 నుండి ఈ షోకు నాగార్జుననే హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. మొదట్లో ఆయన హోస్టింగ్ పర్వాలేదు అనిపించినా మెల్లగా ప్రేక్షకుల్లో దీనిపై నెగిటివిటీ వచ్చేసింది. తప్పు చేసిన కంటెస్టెంట్స్‌తో గట్టిగా మాట్లాడడం లేదని, అసలు ప్రేక్షకుల అభిప్రాయాల గురించి పట్టించుకోవడం లేదని నాగార్జున హోస్టింగ్‌పై నెటిజన్లు తీవ్రంగా నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. అందుకే ప్రతీ సీజన్ మొదలయ్యే ముందు నాగార్జున హోస్ట్ స్థానం నుండి తప్పుకున్నాడని, తన స్థానంలోకి వేరే హోస్ట్ వస్తాడని రూమర్స్ మొదలవుతాయి. బిగ్ బాస్ సీజన్ 9కు నాగార్జున స్థానంలో రానా లేదా చిరంజీవి హోస్ట్‌గా వచ్చే అవకాశాలు ఉన్నాయని టాక్. సెప్టెంబర్ 6న బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభం కానుందట.

Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×