Indraja: సీనియర్ నటి ఇంద్రజ ప్రస్తుతం వరుస సినిమాలతో, షోస్ తో బిజీగా మారింది. యమలీల సినిమాతో కెరీర్ మొదలుపెట్టిన ఆమె స్టార్ హీరోలందరితో నటించి మెప్పించింది. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే వివాహం చేసుకొని ఇండస్ట్రీకి దూరమైన ఇంద్రజ ఆ తరువాత జబర్దస్త్ షోతో రీఎంట్రీ ఇచ్చింది. జబర్దస్త్ లో జడ్జిగా రోజా వెళ్ళిపోగానే ఆమె ప్లేస్ లో ఎవరు వస్తారో అని ఎదురుచూసిన అభిమానులకు ఇంద్రజ ఒక కొత్త హోప్ ఇచ్చింది. ఎక్కడ వల్గర్ లేకుండా పద్దతిగా డ్రెస్ వేసుకోవడం దగ్గరనుంచి నెమ్మదిగా మాట్లాడుతూ కంటెస్టెంట్స్ ను మంచిగా పిలుస్తూ మరింత ఫేమస్ అయ్యింది.
ఇక జబర్దస్త్ తరువాత శ్రీదేవి డ్రామా కంపెనీకి ఆస్థాన జడ్జిగా మారిపోయింది ఇంద్రజ. ఇక ఈ షోస్ వలన ఆమెకు సినిమా అవకాశాలు కూడా మరింత పెరిగాయి. మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం, రజాకార్ సినిమాల్లో ఇంద్రజ నటనకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇంద్రజ ఇంటర్వ్యూలు ఇవ్వడం చాలా రేర్. తాజాగా యూట్యూబర్ నిఖిల్ పాడ్ కాస్ట్ అయిన నిఖిల్ తో నాటకాలు అనే షోలో ఆమె సందడి చేసింది. ఈ షోలో ఆమె తన మనోగతాన్ని చెప్పుకొచ్చింది.
అందరి హీరోయిన్స్ లానే తాను కూడా కుటుంబం కోసమే ఇండస్ట్రీకి వచ్చానని, తన చెల్లిని చదివించడానికి, కుటుంబానికి సపోర్ట్ గా నిలవడానికి హీరోయిన్ గా మారినట్లు చెప్పుకొచ్చింది. ఇక పెళ్లి అనేది ప్రతి అమ్మాయికి ఎలానో తనకు కూడా అలానే అని.. పెళ్లి తరువాత చాలా మారిపోయినట్లు ఇంద్రజ తెలిపింది. ఇలా మళ్లీ బుల్లితెరపై తనకు ఇంత మంచి పేరు రావడం ఎంతో ఆనందంగా ఉందని ఆమె చెప్పుకొచ్చింది.
ఇకపోతే ఆమె చేస్తున్న షోస్ లలో అడల్ట్ కామెడీ ఉంటుంది. దానిపై ఆమె ఎలా ఫీల్ అవుతుంది. . ? ఆ కామెడీకి ఇంద్రజ నవ్వితే బయట నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఫ్యాన్స్ మీరు కూడా అడల్ట్ కామెడీని ఎంకరేజ్ చేస్తున్నారు అని అంటున్నారు.. దీనిపై మీరేమంటారు అన్న ప్రశ్నకు ఇంద్రజ మాట్లాడుతూ.. ” అలా నన్ను అనేవారందరికీ చెప్పాలనుకుంటుంది ఒక్కటే.. అక్కడ నేను వర్క్ చేస్తున్నాను. అది నా షో కాదు.. నేను అక్కడ పని చేస్తున్నాను.
Padmanabham: స్టార్ కమెడియన్.. చిల్లర కోసం అంధుడి కంచంలో డబ్బులు దొంగిలించి.. నరకం అనుభవించి
ఎంటర్ టైన్మెంట్ అని వచ్చినప్పుడు కొన్ని విషయాలను రిస్టిక్ట్ చేయలేము. దాన్ని అలా వదిలేయాలి. ఎందుకంటే.. దాన్ని చూసేవాళ్లు.. దాన్ని ఎంటర్ టైన్ అయ్యేవాళ్ళు.. దాని కోసమే షో చూసేవాళ్లు కూడా ఉన్నారు. చూసి చూడనట్లు వెళ్లిపోవడం తప్ప మనం చేసేది ఏమి లేదు. ఎందుకంటే.. డబుల్ మీనింగ్ డైలాగ్ లు, అడల్ట్ కంటెంట్ లాంటివి.. నా షో అనే కాదు టోటల్ ఇండస్ట్రీపరంగా చూసుకుంటే.. దీని గురించి ఎంత నెగిటివిటీ ఉందో.. దానికి మించి వ్యూస్ ఉన్నాయి.
ఒకవేళ నెగిటివిటీ ఉంటే.. వ్యూస్ ఉండకూడదు. మరి వ్యూస్ ఎందుకు వస్తున్నాయి. బ్యాడ్ అన్నప్పుడు.. ఆ బ్యాడ్ కు సపోర్ట్ ఉండకూడదు కదా. ఇటు పక్క అసలు ఏంటి ఇది.. కుటుంబం కూర్చొని చూసేలా ఉందా ఇది అని మాట్లాడుకుంటున్నారు. ఇంకోపక్క ఫ్యామిలీ కంటెంట్ తో మంచి మంచి షోస్ చేస్తుంటే.. వాటికన్నా ఈ అడల్ట్ కంటెంట్ పదిరెట్లు చూస్తున్నారు. అప్పుడు ఎంటర్ టైన్మెంట్ బిజినెస్ చేసేవాళ్ళు ఏం చూస్తారు. మనకు దేని మీద వ్యూస్ వస్తున్నాయో అదే చూస్తారు. అలాంటప్పుడు డబ్బులు దేనికి ఎక్కువ వస్తున్నాయో దాన్నే కోరుకుంటారు.
పబ్లిక్ ఒక విషయాన్నీ ఛీ అంటున్నారు అంటే ఆ ఛీ అన్న విషయానికి వ్యూస్ కూడా ఉండకూడదు.నేనెప్పుడైనా ఫీల్ అయ్యానా అంటే అయ్యాను. కొన్నిసార్లు నా మీద కూడా డబుల్ మీనింగ్ డైలాగ్స్ వస్తాయి. అది జోక్ కాబట్టి జోక్ లానే తీసుకుంటాను. కానీ, కొన్ని మాటలు బాధకలిగిస్తాయి. అక్కడ అవసరం లేకపోయినా కొంతమంది మాట అనేస్తారు. ఆ స్టేజిమీద చెప్పే విషయం అయితే చెప్పేస్తా.. లేకపోతే తరువాత పిలిచి చెప్తా .. నువ్వు మాట్లాడింది కరెక్ట్ కాదు. ఇంకోసారి అలా అనొద్దు అని చెప్పేస్తా” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.