తెలుగువారి వంటల్లో మసాలా దినుసులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. కేవలం తెలుగువారే కాదు దక్షిణ భారతదేశము మసాలా దినుసులకు నిలయం. ఇవి వంటకాల రుచిని పెంచుతాయి. దోశల నుండి సాంబార్ వరకు అన్నింటిలోనే కొన్ని రకాల మసాలా దినుసులు వేస్తూ ఉంటారు. అయితే మాంసాహారం నుంచి శాఖాహారం వరకు అన్ని రకాల కూరలు పులావులు, బిర్యానీలలో కచ్చితంగా వేయాల్సిన ఐదు దినుసులు ఉన్నాయి. ఇవి వేస్తే రుచి అద్భుతంగా ఉంటాయి.
ఎర్ర కారం
దక్షిణ భారత వంటకాల్లో కారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. కొంతమంది రకరకాల కారాలను ఉపయోగిస్తారు. ముఖ్యంగా ఎరుపు రంగులో ఉండే కాశ్మీరీ కారం కూరకు మంచి ఆకృతిని అందిస్తుంది. రుచిని కూడా ఇస్తుంది. గుంటూరు కారంపొడి కూడా వంటకాలకు రుచిని కారాన్ని ఇస్తుంది. పొడి కూరలు, చట్నీలు చేసేటప్పుడు ఎర్ర కారాన్ని వాడడం వల్ల మంచి రుచితో పాటు ఆకృతి కూడా వస్తుంది.
ఆవాలు
ఆవాలును చాలా వంటల్లో తప్పించేస్తారు. కానీ ఆవాలను కచ్చితంగా అన్ని కూరల్లోనూ వాడాల్సిందే. మాంసాహారాల్లో ఆవాలను వేసేవారి సంఖ్య చాలా తక్కువ. ఒకసారి ఆవాలను ఆవపిండి రూపంలో మాంసాహారంలో కలిపి చూడండి.. ఎంత రుచిగా ఉంటుందో. వేడి నూనెలో ఈ ఆవాలు చిటపటలాడాక కూరను వండడం మొదలుపెడితే మంచి రుచి వస్తుంది. వెజ్ కర్రీలలో ఆవాలను వాడతారు. కానీ మాంసాహారాలలో ఆవాలను వాడరు. కానీ మాంసాహారాల్లో ఒక స్పూను ఆవపిండిని కలపడం వల్ల మంచి ఆకృతి, రుచి వస్తుంది. సాంబారు వంటి వాటిలో కచ్చితంగా ఆవాలు లేదా పిండిని వేయాల్సిందే.
జీలకర్ర
జీలకర్రలో ఉండే పోషకాలు అన్నీ ఇన్నీ కావు. కూరలు, రసము, సాంబారు అన్నింట్లో జీలకర్రను వేస్తారు. కానీ మాంసాహారాలు, బిర్యానీల జోలికి వచ్చేసరికి మాత్రం ఆ జీలకర్రను పూర్తిగా వాడరు. నిజానికి జీలకర్ర వేయడం వల్ల వాటి రుచి కూడా అద్భుతంగా పెరుగుతుంది. మీకు జీలకర్రను వేయడం ఇష్టం లేకపోతే జీలకర్రను పొడి రూపంలోకి మార్చి బిర్యాని, పులావ్, మాంసాహారాలలో కలిపి వేసి చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో. జీలకర్ర ప్రతి రోజు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. ఇవి మీకు కచ్చితంగా ఎన్నో పోషకాలను అందిస్తుంది.
పసుపు
పసుపు ఒక శక్తివంతమైన మసాలా దినుసు. సాంబార్ నుండి కూరల వరకు అన్నింటిలోనూ పసుపును వేస్తారు. కొన్ని రకాల పులావుల్లో మాత్రం వేసేందుకు ఇష్టపడతారు. నిజానికి స్వీట్ రెసిపీలు తప్ప మిగతా అన్నింటిలో కూడా పసుపును వాడవచ్చు. ఎందుకంటే పసుపు రుచిని ఇవ్వడమే కాదు. శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఆరోగ్యకరమైన వంటలలో కచ్చితంగా పసుపు ఉండాల్సిందే. పసుపు వేస్తే అది ఆరోగ్యకరమైన వంటకంగా మారిపోతుంది.
ఇంగువ
ఇంగువను చాలా తక్కువ మంది వాడుతూ ఉంటారు. ఇప్పుడు ఎంతోమంది ఇళ్లల్లో ఇంగువ కనిపించడం లేదు కూడా. ఇంగువను అన్ని కూరల్లోనూ వేసుకోవచ్చు. సాంబార్ నుంచి చికెన్ వరకు ఇంగువ పొడిని వేయడం వల్ల దానికి ప్రత్యేకమైన రుచి వస్తుంది. ముఖ్యంగా పప్పులు వండేటప్పుడు కచ్చితంగా ఇంగువ వాడేందుకు ప్రయత్నించండి. ఇది ఒక బలమైన వాసనను వెదజల్లుతుంది. ఆ వాసన కూరకు లేదా ఆ పులుసుకు, సాంబార్ కు ఒక ప్రత్యేకమైన రుచిని అందిస్తుంది. సున్నితమైన జీర్ణ వ్యవస్థ ఉన్నవారికి ఇంగువ ఎంతో సహాయపడుతుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్టిక్ సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది.
Also Read: మటన్ గ్రేవీని మెంతికూరతో చేసి చూడండి, ఎంత తిన్నా తనివి తీరదు.. రెసిపి ఇదిగో