E-Paper
Advertisement

IPL 2026-Tirumala: తిరుమ‌ల శ్రీవారికి CSK భారీ విరాళం..ఐపీఎల్ 2026 టైటిల్ ప‌క్కా !

IPL 2026-Tirumala: తిరుమ‌ల శ్రీవారికి CSK భారీ విరాళం..ఐపీఎల్ 2026 టైటిల్ ప‌క్కా !
Advertisement

IPL 2026-Tirumala:  ఐపీఎల్ 2026 టోర్నమెంట్ ( IPL 2026) దగ్గర పడుతున్న నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ( Chennai Super Kings ) సంచలన నిర్ణయం తీసుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానానికి ( Tirumala) భారీ విరాళం ప్రకటించింది చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం. రెండేళ్ల ఒకసారి తిరుమల శ్రీవారికి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యాజమాన్యం ఇలా విరాళం ప్రకటించడం చాలా కామన్. ఇందులో భాగంగానే ఈ సారి కూడా తిరుమల శ్రీవారి ఆశీస్సులు ఉండేలా భారీ విరాళం ప్రకటించింది చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం.

Also Read: T20 World Cup 2026: ఆ రోజునే పాకిస్తాన్ వ‌ర్సెస్ ఇండియా మ‌ధ్య మ‌రోసారి మ్యాచ్‌… ఏ గ్రూపులో ఏ జట్లు ఉంటాయంటే?

తిరుమల శ్రీవారికి చెన్నై సూపర్ కింగ్స్ భారీ విరాళం

Advertisement

రూ. 3.2 కోట్లు తిరుమల శ్రీవారి ( TTD) సన్నిధికి విరాళంగా ప్రకటించింది చెన్నై సూపర్ కింగ్స్ ( CSK) యాజమాన్యం. ఈ విరాళంతో కొత్తగా నాలుగు నెయ్యి స్టోరేజీల ట్యాంకులను నిర్మించ‌బోతున్నార‌ట‌. తిరుమల శ్రీవారి సన్నిధిలో నెయ్యి స్టోరేజీల ట్యాంకులు చాలా అత్యవసరమని సమాచారం. అయితే ఈ విషయం తెలుసుకున్న చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం, ఆ నాలుగు నెయ్యి స్టోరేజ్ ట్యాంకులకు అయ్యే ఖర్చు రూ. 3.2 కోట్లను విరాళంగా ప్రకటించింది. అయితే ఈ విషయం గోప్యంగా ఉంచినప్పటికీ సోషల్ మీడియా ద్వారా వైర‌ల్ గా మారింది. గతంలో తిరుమల శ్రీవారికి రూ.12 కోట్ల విరాళం ప్రకటించింది చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం. 2021 లో బూందీ పోటు అంటే లడ్డు తయారీ కేంద్రం కోసం రూ. 12 కోట్ల విరాళం ఇచ్చింది. ఇలా ప్రతిసారి తిరుమల శ్రీవారికి ఏ అవసరం ఉన్నా, చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం విరాళం ప్రకటిస్తోంది. దానికి తగ్గట్టుగానే చెన్నై సూపర్ కింగ్స్ 5 టైటిల్స్ గెలిచిన సంగతి తెలిసిందే.

ఐపీఎల్ 2026 లో బలంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు

ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ అత్యంత దారుణంగా విఫలమైన సంగతి తెలిసిందే. అయితే ఈసారి ఎలాగైనా టైటిల్ గెలవాలన్న లక్ష్యంతో రాజస్థాన్ రాయల్స్ కు చెందిన సంజు శాంసన్ ట్రేడ్ ప్రక్రియ ద్వారా కొనుగోలు చేసింది చెన్నై. అలాగే బేబీ ABD బ్రేవిస్, రుతురాజు, ధోని, ఆయుష్ మాత్రే , ఉర్జిల్ పటేల్ లాంటి వాళ్లతో ఈ సారి చాలా బలంగా కనిపిస్తోంది చెన్నై సూపర్ కింగ్స్. అంతేకాదు ఐపిఎల్ 20026 మినీ వేలంలో 43.40 కోట్లతో పాల్గొన‌నుంది చెన్నై సూపర్ కింగ్స్. ఆ డబ్బుతో మంచి ఆల్రౌండర్లను కొనుగోలు చేసే ప్లాన్ చేస్తోంది. కాగా మొన్నటి ట్రేడింగ్ ప్రక్రియలో భాగంగా ఆల్రౌండర్ రవీంద్ర జడేజాను చెన్నై సూపర్ కింగ్స్ వదులుకుంది.  జ‌డేజాతో పాటు సామ్ క‌ర‌ణ్ ను రాజస్థాన్ రాయ‌ల్స్ కు ఇచ్చేసి, సంజు శాంస‌న్ ను తీసుకుంది చెన్నై.

Advertisement

Also Read: Aus vs Eng Ashes 2025-26 : సెంచరీతో రెచ్చిపోయిన హెడ్.. మొదటి టెస్ట్ లో ఆస్ట్రేలియా విజయం.. 2 రోజుల్లోనే మ్యాచ్ ఫినిష్

 

Related News

ఈ ద‌ద్ద‌మ్మకు టీమిండియాపై ఆడ‌టం చేత‌కాదు…స‌ల్మాన్ సెంచ‌రీపై బాజిద్ ఖాన్ ఫైర్‌

శ‌భాష్ స‌ల్మాన్‌…నీ దెబ్బ‌కు న‌ఖ్వీ గాడి రెండు చెంప‌లు వాచిపోయింటాయ్ ?

అస‌లు నీకు బుర్ర ఉందా ? ష‌న‌కా బ్యాటింగ్ పై గ్యారీ కిర్‌స్టెన్ సీరియ‌స్‌

ఆ పాట‌లు పెట్టి ధోని న‌న్ను రెచ్చ‌గొట్టేవాడు…వీరూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

బాబ‌ర్‌, షాహీన్‌, షాబాద్, హారిస్ రోజులు లెక్క‌బెట్టుకోవాల్సిందే…పాకిస్తాన్ నుంచి త‌రిమేసే టైమ్ వ‌చ్చింది!

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ పాకిస్తాన్ కు అందిస్తా..లేక‌పోతే త‌ల న‌రుక్కుంటా ?

డ‌బుల్ సెంచ‌రీ చేయ‌కుండా ద్రవిడ్ అడ్డుకున్నాడు..స‌చిన్ సంచ‌ల‌నం !

కావ్య పాప‌ పెళ్లికి పాకిస్తాన్ క్రికెట‌ర్లు…SRHను బ్యాన్ చేయాలంటూ మ‌ళ్లీ పోస్టులు ?

Big Stories

Advertisement
×