E-Paper
Advertisement

Bigg Boss: ఏకంగా 3 ఖరీదైన ఫ్లాట్స్ కొన్న బిగ్ బాస్ బ్యూటీ.. ఎన్ని కోట్లంటే..?

Bigg Boss: ఏకంగా 3 ఖరీదైన ఫ్లాట్స్ కొన్న బిగ్ బాస్ బ్యూటీ.. ఎన్ని కోట్లంటే..?
Advertisement

Bigg Boss:చాలామంది నటీనటులు సినిమాల్లో కొనసాగుతున్న సమయంలోనే లగ్జరీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే లగ్జరీ లైఫ్ తో పాటు కొన్ని ఆస్తిపాస్తులు కూడా వెనకేసుకుంటారు. అలా ఎంతోమంది నటీనటులు సినిమాల్లో నటించగా వచ్చిన డబ్బులతో స్థిర చరాస్తులను కొనుగోలు చేస్తూ ఉంటారు.అయితే తాజాగా ఈ హీరోయిన్ మాత్రం ఒకేసారి మూడు లగ్జరీ అపార్ట్మెంట్స్ కొని బీటౌన్ లో ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది. మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు..? ఒకేసారి మూడు లగ్జరీ ఫ్లాట్ లు ఎందుకు కొనుగోలు చేసింది ..? వాటి ఖరీదు ఎంత? అనేది ఇప్పుడు చూద్దాం..

ముంబైలో రూ. 10 కోట్ల విలువ చేసి 3 లగ్జరీ ఫ్లాట్స్ కొనుగోలు..

Advertisement

ఆమె ఎవరో కాదు ప్రముఖ బాలీవుడ్ నటి గౌహర్ ఖాన్(Gauhar Khan).తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఎందుకంటే గౌహర్ ఖాన్ తెలుగులో చిరంజీవి (Chiranjeevi) హీరోగా చేసిన శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో “నా పేరే కాంచనమాలా.. నా వయసే గరం మసాలా” అంటూ వచ్చే స్పెషల్ సాంగ్ లో ఆడిపడింది. ఇక ఈ ఒక్క పాటతో గౌహర్ ఖాన్ అప్పటి కుర్రాళ్ళ మనసు కొల్లగొట్టింది. అయితే అలాంటి ఈ బ్యూటీ తెలుగులో చేసింది ఈ ఒక్క సినిమానే.కానీ బాలీవుడ్ లో మాత్రం స్టార్ నటిగా చాలా సంవత్సరాలు కొనసాగింది. కేవలం హీరోయిన్ గానే కాకుండా యాంకర్ గా..సీరియల్ ఆర్టిస్ట్ గా.. మోడల్ గా.. రాణించింది. అయితే అలాంటి గౌహర్ ఖాన్ కి కేవలం సీరియల్స్ సినిమాలు మాత్రమే కాదు. 2013లో హిందీ బిగ్ బాస్ 7 (Bigg Boss7) లోకి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి బిగ్ బాస్ 7 టైటిల్ ని కూడా అందుకుంది. అయితే అలాంటి గౌహర్ ఖాన్ (Gauhar Khan) పేరు తాజాగా బాలీవుడ్ లో మార్మోగిపోతుంది. దానికి ప్రధాన కారణం.. ఒకేసారి గౌహర్ ఖాన్ మూడు లగ్జరీ అపార్ట్మెంట్ లను కొనుగోలు చేయడమే.. తాజాగా గౌహర్ ఖాన్ దాదాపు రూ.10 కోట్లకి పైగా విలువ చేసే మూడు లగ్జరీ అపార్ట్మెంట్ లను ఒకేసారి కొనుగోలు చేసింది. ముంబైలోని వర్సోవా ప్రాంతంలో ఉండే మూడు లగ్జరీ అపార్ట్మెంట్లను కొనుగోలు చేయడంతో గౌహర్ ఖాన్ పేరు నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఈ విషయం తెలిసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. అధునాతన సౌకర్యాలు ఉన్న ఆ అపార్ట్మెంట్ లను గౌహర్ ఖాన్ కొనుగోలు చేయడంతో బీటౌన్ లో ఈమె పేరు వైరల్ అవుతుంది.

గౌహార్ ఖాన్ కెరియర్..

Advertisement

ఇక గౌహర్ ఖాన్ కేవలం 18 ఏళ్ల వయసులోనే మోడలింగ్ రంగంలోకి ప్రవేశించి , ఆ తర్వాత యాంకర్ గా కెరీర్ ని స్టార్ట్ చేసింది. అలా సీరియల్స్, సినిమాల్లో అవకాశాలు కూడా అందుకుంది. అలాగే కొన్ని వెబ్ సిరీస్ లలో కూడా గౌహర్ ఖాన్ నటించింది. 2020లో ప్రముఖ కొరియోగ్రాఫర్ అయినటువంటి జైన్ దర్బార్ (Jain Darbar) ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.అయితే వీరి పెళ్లి జరిగిన సమయంలో చాలా విమర్శలు వచ్చాయి. దానికి కారణం గౌహర్ ఖాన్ (Gauhar Khan) వయసులో చిన్న వాడిని పెళ్లి చేసుకోవడంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి కూడా గురైంది.

Related News

బిగ్ బాస్10 హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ తనేనా?

బిగ్ బాస్ హౌస్ లోకి గుండెనిండా గుడి గంటలు హీరో.. ఈ ట్విస్ట్ ఏందీ బాలు..వీడియో వైరల్!

బిగ్ బాస్ 10 లాంచింగ్ ఎపిసోడ్… చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో!

న్యూ చాప్టర్ బిగిన్స్.. బిగ్ బాస్ 10 ఎంట్రీ పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

Big Stories

Advertisement
×