Balayya VS Chiru : మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కారణంగా తాజాగా నందమూరి బాలయ్య (Nandamuri Balakrishna)కు కొత్త తలనొప్పి వచ్చి పడింది. అడ్డంగా దొరికిపోయిన బాలకృష్ణ అంటూ నెట్టింట్లో కొన్నాళ్ళ క్రితం బాలయ్య చేసిన కామెంట్స్ ని వైరల్ చేస్తూ ఆటాడుకుంటున్నారు. మరి ఇంతకీ చిరు బాలయ్యని ఎలా ఇరికించారు? అసలేం జరిగింది? బాలయ్యకు వచ్చిన ఈ కొత్త చిక్కులు ఏంటి? అనే వివరాల్లోకి వెళ్తే…
బాలయ్యకు తలనొప్పి తెచ్చిన చిరు
నిన్నటి నుంచి మెగాస్టార్ చిరంజీవి వారసత్వం గురించి చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఆయనపై, ఆయన చేసిన వారసత్వం కామెంట్స్ పై జాతీయ స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గతంలో నందమూరి బాలకృష్ణ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. కొన్ని రోజుల క్రితం బాలయ్య ఐఫా ఉత్సవం అవార్డ్స్ సందర్భంగా వారసత్వంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.
“బాలకృష్ణ వారసులు ఎవరు?” అని ఓ రిపోర్టర్ ప్రశ్నించగా, బాలయ్య స్పందిస్తూ “నా కొడుకు, నా మనవడు ఇంకెవరున్నారు?” అని తిరిగి ప్రశ్నించారు. దీంతో “ఏం కూతుర్లు లేరా? వాళ్ళకి వారసత్వం రాకూడదా?” అంటూ బాలయ్యపై విరుచుకు పడుతున్నారు నెటిజన్లు. ఇద్దరి మధ్య విబేధాలు ఉన్నాయో లేదో గానీ, వారసత్వం విషయంలో మాత్రం అటు చిరు, ఇటు బాలయ్య ఇద్దరూ ఒకే మాట మీద ఉన్నారు అంటూ ట్రోలింగ్ తో ఆడుకుంటున్నారు.
వారసత్వంపై చిరంజీవి కామెంట్స్…
‘బ్రహ్మా ఆనందం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా ఫిబ్రవరి 11న చిరంజీవి వారసత్వంపై చేసిన కామెంట్స్ వివాదాస్పదం అవుతున్నాయి. కామెడీ బ్రహ్మ బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్ ప్రధానపాత్రలు పోషించిన మూవీ ‘బ్రహ్మా ఆనందం’. ఈ కామెడీ మూవీ ఫిబ్రవరి 14న థియేటర్లలోకి రాబోతోంది. సినిమా రిలీజ్ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈవెంట్లో చిరంజీవికి రామ్ చరణ్ కూతురు క్లీంకారతో పాటు తన ఇంట్లో ఉన్న ఇతర మనవరాళ్లు ఉన్న ఫోటోను స్క్రీన్ మీద చూపించారు. ఆ ఫోటోపై యాంకర్ సుమ ఓ ప్రశ్న అడిగింది. ఆ ప్రశ్నకి రియాక్ట్ అవుతూ చిరంజీవి “ఇంట్లో ఎక్కువ మంది అమ్మాయిలు ఉండడంతో ఒక లేడీస్ హాస్టల్ లా ఉంది. నేను వార్డెన్ లో మారాను” అని ఫన్నీగా చెప్పారు. ఇక అదే ఫ్లోలో “రామ్ చరణ్ కు కూతురు ఉంది, అతనికి కూతురు అంటేనే ఇష్టం. అందుకే మళ్ళీ కూతురు పుడుతుందేమోనని నేను భయపడుతున్నాను. రామ్ చరణ్ కి కొడుకు పుట్టాలని నాకు కోరికగా ఉంది. వారసత్వం కోసం మగపిల్లాడిని కనాలని రామ్ చరణ్ కి సలహా ఇచ్చాను” అంటూ చేసిన కామెంట్స్ ఆయనను కొత్త వివాదంలోకి నెట్టాయి. చిరంజీవి స్థాయికి ఉన్న వ్యక్తులు ఇలా అనడం కరెక్ట్ కాదని, ఆడపిల్లలు వారసులు కాదా అని ఏకిపారేస్తున్నారు నెటిజన్లు. ఈ నేపథ్యంలోనే గతంలో బాలయ్య చేసిన వ్యాఖ్యలను బయటకు తీస్తూ, ఆయనను కూడా ట్రోల్ చేస్తున్నారు.