BigTV English

BRS Party: హరీష్‌ రావును దూరం పెడుతోన్న కేటీఆర్, కవిత.. మామ మంత్రం పఠిస్తున్న మేనల్లుడు!

BRS Party: హరీష్‌ రావును దూరం పెడుతోన్న కేటీఆర్, కవిత.. మామ మంత్రం పఠిస్తున్న మేనల్లుడు!

కేసీఆర్ మా అధినాయకుడు అంటున్న హరీష్ రావు మాటలతో బీఆర్ఎస్‌లో ఆధిపత్యపోరు స్పష్టం అవుతుందంటున్నారు.. పార్టీలో కేటీఆర్, కవిత దూకుడుకు కళ్లెం వేయడానికే హరీష్ మేనమామ మంత్రం పఠిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. పార్టీలో తన ప్రాధ్యాన్యత తగ్గుతుండటం వల్లే ఆయ అలెర్ట్ అవుతున్నారని… అందుకే ఫాంహౌస్ కే పరిమితమైన కేసీఆర్ జపం మొదలు పెట్టారంటున్నారు. పార్టీని తమ భుజాల మీదేసుకొని నడిపిస్తున్నామని కేటీఆర్, కవిత భావిస్తుంటే.. మధ్యలో హరీష్ వ్యాఖ్యలతో నాయకత్వ పోరు బహిర్గతమవుతుండటం కేడర్‌ని గందరగోళంలోకి నెడుతోందంట.


కేసీఆర్ మా నాయకుడు … ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మా సీఎం అభ్యర్థి కేసీఆర్ అని మాజీ మంత్రి హరీష్‌రావు తాజాగా నొక్కినొక్కి చెప్తున్నారు.. ఎప్పుడో జరగబోయే ఎన్నికల గురించి హరీష్ ప్రత్యేకంగా మాట్లాడుతూ… తన మేనమామ భజన చేస్తుండటం వెనుక లెక్కలు వేరే ఉన్నాయని బీఆర్ఎస్ క్యాడర్ లో వినిపిస్తున్న వాదన. ఫాం హౌజ్ వదిలి బయటకు రాని కేసీఆర్‌పై సొంత పార్టీ నేతలే విమర్శలు గుప్పిస్తుంటే .. హరీష్ రావు మాత్రం కాబోయే సీఎం కేసీఆర్ అన్నట్లు మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది.

ఉద్యమ సమయం నుంచి గులాబీ పార్టీలో హరీష్‌రావు యాక్టివ్‌గా ఉన్నారు. ఉద్యమ నాయుకుడిగా హరీష్‌రావుకి ఉన్నంత ఇమేజ్ కేటీఆర్‌కు లేదనే చెప్పాలి. అయితే బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక మారిన పరిస్థితుల్లో … పార్టీ పరంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత ఫోకస్ అవుతున్నారు. అది సహజంగానే ఉద్యమ నాయకుడిని అని చెప్పుకునే హరీష్ రావుకి మింగుడు పడటం లేదని, పార్టీలో కేటీఆర్ డామినేషన్‌ని ఆయన వ్యతిరేకిస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తుంది. పార్టీ నిర్ణయాల విషయంలో కేటీఆర్, కవిత ఎవరికివారే కార్యచరణ రూపొందించుకొని హరీష్‌రావుని సంప్రదించకపోగా.. కనీసం కలుపుకుని పోయే ప్రయత్నం చేయలేదు.. కాబట్టే హరీష్ అసంతృప్తి తో రగలిపోతున్నారంట.


పార్టీలో రాష్ట్ర స్థాయి నాయకుడైన తనను కేవలం సొంత జిల్లాకే పరిమితం చేస్తున్నారనే అసంతృప్తి హరీష్ లో కనిపిస్తుంది. తెలంగాణ భవన్ లో జరిగే కార్యక్రమాలకు తప్ప బహిరంగంగా జరిగే బీఆర్ఎస్ సభలు, సమావేశాలకు హరీష్‌రావుని పెద్దగా ఆహ్వానించడం లేదన్నది కళ్ల ముందే కనిపిస్తున్న వాస్తవమే.. కవిత జైలు కు వెళ్లి వచ్చి కొద్దిరోజులు సైలెంట్ గా ఉండి ఇప్పుడు జాగృతి పేరుతో ఏదో ఒక కార్యక్రమం చేపడుతూ ప్రజల్లోకి ఒంటరిగా వెళ్లి నాయకురాలుగా ఎదగాలనే ఉత్సాహం చూపుతున్నారు. అది కూడా హరీష్‌కు మింగుడు పడటం లేదంటున్నారు. ఒక పక్క కేటీఆర్, మరో పక్క కవిత ఎవరి సొంత అజెండాలు వారు అమలు చేస్తుంటే కేసీఆర్ మౌనంగా చూస్తుండటంతో తన పరిస్థితి ఏంటనేది హరీష్ ఆవేదనగా కనిపిస్తుంది. కేటీఆర్, కవిత దూకుడుకు అడ్డు కట్ట వేసే క్రమంలోనే కేసీఆరే తమ బాస్ అని హరీష్ స్పష్టం చేస్తున్నారంటున్నారు.

Also Read:  హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీలు పెరగనున్నాయా? ఈ సమస్యలే కారణమా?

టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అని పేరు మార్చుకున్నాక గులాబీ పార్టీకి ఏదీ కలిసి రావడం లేదు. కేసీఆర్ జాతీయ స్థాయి రాజకీయాల కలలను కల్లలు చేస్తూ.. పార్టీ రాష్ట్రంలో కూడా అధికారం కోల్పోయింది. లోక్‌సభ ఎన్నికల్లో దారుణ పరాభవం ఎదురైంది. ప్రస్తుతం జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో గులాబీ పార్టీకి అభ్యర్థులను సైతం నిలిపే పరిస్థితి లేకుండా పోయింది .. స్థానిక ఎన్నికల సమరం ఆ పార్టీ శ్రేణుల్లో ఇప్పటి నుంచే గుబులు రేపుతుంది .. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్‌ నాయకత్వం కోసం జరుగుతున్న ముక్కోణపు పోటీ పార్టీ క్యాడర్‌లో అసంతృప్తి, అయోమయం, ఆశ్చర్యానికి గురిచేస్తుందంట.

Related News

AP Politics: గుంతకల్లు టీడీపీలో కుర్చీలాట..

TDP Politics: యనమలను పక్కన పెట్టేశారా? అసలేం జరిగింది..!

Putin, Trump Deals: యూరప్ చీలబోతుందా.? ట్రంప్ , పుతిన్ చర్చలో ఇది జరిగితే మనకి జరిగే లాభం ఇదే.!

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Big Stories

×