BigTV English
Advertisement

Bigg Boss Buzz: ఈవారం కచ్చితంగా తననే నామినేట్ చేసేవాడిని.. ఎలిమినేట్ అయిన తర్వాత మెహబూబ్ స్టేట్‌మెంట్

Bigg Boss Buzz: ఈవారం కచ్చితంగా తననే నామినేట్ చేసేవాడిని.. ఎలిమినేట్ అయిన తర్వాత మెహబూబ్ స్టేట్‌మెంట్

Bigg Boss Buzz Promo: బిగ్ బాస్ 8 నుండి ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చేసిన తర్వాత బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు మెహబూబ్ దిల్‌సే. ఆ ఇంటర్వ్యూకు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలయ్యింది. అయితే ఇందులో తాను తొందరగా బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయిపోయి బయటికి వచ్చేశాననే ఫ్రస్ట్రేషన్ మెహబూబ్‌లో స్పష్టంగా కనిపించింది. అయినా కూడా ఏ కంటెస్టెంట్ గురించి పెద్దగా నెగిటివ్‌గా చెప్పకుండా పాజిటివ్‌గానే ఉండడానికి ప్రయత్నించాడు మెహబూబ్. కానీ ఈవారం బిగ్ బాస్ హౌస్‌లోనే ఉండుంటే కచ్చితంగా ఆ కంటెస్టెంట్‌ను నామినేట్ చేసేవాడిని అని కారణంతో సహా బయటపెట్టాడు.


మంచి అవకాశం

‘‘నీకు దీపావళి అచ్చురాలేదు అనుకుంటా. ముందు సీజన్‌లో కూడా దీపావళి రోజే బయటికొచ్చావు. ఈ సీజన్‌లో కూడా దీపావళి రోజే బయటికొచ్చావు. దీపావళి నాకు అచ్చురాలేదు అని నీకు అనిపిస్తుందా?’’ అని అర్జున్ అడగడంతో బిగ్ బాస్ బజ్ ప్రోమో ప్రారంభవుతుంది. అది విన్న ప్రేక్షకులు కూడా అరే.. నిజమే కదా అని ఒక్కసారిగా ఫ్లాష్‌బ్యాక్ గుర్తుచేసుకున్నారు. ‘‘సీజన్ 4లో 10 వారాలు ఉన్నావు. చాలా ఫేమ్ వచ్చింది. మళ్లీ ఎందుకు సీజన్ 8కు రావాలనుకున్నావు?’’ అని అడిగాడు అర్జున్. ‘‘నేను దీనిని ఒక అవకాశంలాగా చూశాను. ఇంకా ఎక్కువ ప్రేక్షకులకు తెలియొచ్చు అనుకున్నాను. తన నామినేషన్స్ గురించి అడిగాడు అర్జున్.


Also Read: అయ్యబాబోయ్.. నాగార్జున వేసుకున్న టీ షర్ట్ ధర అన్ని వేలా ?

తననే నామినేట్

‘‘నామినేషన్స్‌లో అవతలవాడు ఏదో వాగుతున్నాడని మనం డిఫెండ్ చేసుకోవడం కరెక్ట్ కాదేమో అనిపించింది’’ అని స్టేట్‌మెంట్ ఇచ్చాడు మెహబూబ్. ఆడియన్స్‌కు ఫైర్ మిస్ అయ్యిందని బయటపెట్టాడు అర్జున్. నబీల్‌తో కనెక్షన్ గురించి మాట్లాడుతూ.. ‘‘నాకు నిజంగా ఎవరితో కనెక్షన్ అనిపించిందో వారితోనే ఉన్నాను’’ అని అన్నాడు మెహబూబ్. ‘‘మీరు ఈ వీక్ సేఫ్ అయ్యింటే వచ్చేవారం ఎవరిని నామినేట్ చేసేవారు’’ అని అడిగాడు అర్జున్. ‘‘నయని ప్రతీ గేమ్ నేను ఆడతాను అనేది’’ అని కారణంతో సహా తననే నామినేట్ చేసేవాడిని అని చెప్పుకొచ్చాడు మెహబూబ్. నయని పావని, హరితేజ కలిసి టీమ్‌కు మెహబూబ్ ద్రోహం చేశాడనే కారణం చెప్పి తనను నామినేట్ చేశారు. ఆ విషయంపై తను స్పందించాడు.

ఎందుకలా చెప్తున్నావు?

‘‘టీమ్‌కు కావాల్సిన పాయింట్స్ నేను తెప్పిస్తున్నాను’’ అని గర్వంగా చెప్పాడు మెహబూబ్. ఏ కంటెస్టెంట్ గురించి అడిగినా పాజిటివ్‌గానే ఎందుకు చెప్తున్నావని అడిగాడు అర్జున్. ‘‘పాజిటివ్, నెగిటివ్ రెండూ చూస్తాను’’ అని అన్నాడు మెహబూబ్. దీంతో మెహబూబ్ ఆట ఎలా ఉందని ఒక సామెత రూపంలో చెప్పాడు అర్జున్. ‘‘అవకాశం వచ్చాక ఆరుబయట కూర్చున్నాడంట. అవకాశం రాలేదని చెప్పి మంచమెక్కి కూర్చుంటా అన్నాడంట’’ అని అర్జున్ అనగానే అది మెహబూబ్‌కు నచ్చలేదని స్పష్టంగా కనిపించేలా ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు. మొత్తానికి మెహబూబ్ వెళ్లిపోయినందుకు ఫీల్ అయ్యే ప్రేక్షకులుకంటే మంచే జరిగింది అనుకునే ప్రేక్షకులే ఎక్కువ ఉన్నట్టు తెలుస్తోంది.

Related News

Bigg Boss 9: ఈవారం నామినేషన్స్ లోకి వచ్చింది ఎవరంటే?

Bigg Boss 9 Promo : ఫుడ్‌పై ఉన్న ఫోకస్ గేమ్‌పై లేదు… గౌరవ్‌ను గజగజ వణికించారు.!

Bigg Boss 9 Promo: ఇదెక్కడి గోలరా.. ఆమె మాట వింటారంటున్న రీతూ!

Bigg Boss : బిగ్ బాస్ ఫైనల్ విజేత ఆమె.. ప్రైజ్ మనీ భారీగా కట్.. ఎందుకంటే?

Bigg Boss 9 Telugu: జాక్ పాట్ కొట్టేసాడే.. అందరికంటే ఎక్కువ రెమ్యూనరేషన్..?

Bigg Boss Buzzz Promo: హౌస్ మొత్తం కట్టప్పలే.. వెన్నుపోటు పొడిచారు.. శివాజీ స్ట్రాంగ్ కౌంటర్..

Bigg Boss 9 Telugu : భరణిని బయటకు గెంటే గోల్డెన్ ఛాన్స్ మిస్… ఇంకా నాన్న మీద హోప్స్ ఉన్నాయా పాపా?

Bigg Boss 9 : తనుజ దొంగ గేమ్, అదే తప్పు ఇంకొకరు చేస్తే వదిలేస్తారా? 

Big Stories

×