BigTV English

Bigg Boss: హౌస్ లోకి ముఖ్యఅతిథిగా గాడిద.. షాక్ లో ఆడియన్స్..!

Bigg Boss: హౌస్ లోకి ముఖ్యఅతిథిగా గాడిద.. షాక్ లో ఆడియన్స్..!

Bigg Boss.. బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తున్న బిగ్ బాస్ (Bigg Boss)తెలుగులో ఎనిమిదవ సీజన్ రన్ అవుతున్న విషయం తెలిసిందే. ఈరోజు వైల్డ్ కార్డ్ ద్వారా ఏకంగా 8 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ ఈవెంట్ లాంచ్ 2.0 అంటూ ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే ఎనిమిది మంది సెలబ్రిటీలు హౌస్ లోకి రావడమే కాకుండా ఏకంగా చాలామంది సెలబ్రిటీలు తమ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హౌస్ లోకి అడుగుపెట్టి సినిమా ప్రమోట్ చేసుకోబోతున్నారు. మొత్తానికైతే ఈరోజు ఎపిసోడ్ చాలా ఎంటర్టైన్ గా ఉండబోతోంది అని సమాచారం.


బిగ్ బాస్ హౌస్ లోకి ముఖ్యఅతిథిగా గాడిద..

ఇదిలా ఉండగా తాజాగా ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి ముఖ్య అతిథి రాబోతున్నారు అని తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆ ముఖ్య అతిథి ఎవరో కాదు గాడిద.. హౌస్ లోకి ఇప్పుడు కంటెస్టెంట్ గా అడుగు పెట్టబోతోందని తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు హౌస్ లోకి గాడిద అడుగుపెడితే కంటెస్టెంట్స్ ఆట ఆడుతారా? లేక గాడిద ఆట ఆడుతుందా? అంటూ రకరకాల కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.


సీజన్ 18కి సిద్ధమైన గాడిద..

అయితే ఆ గాడిద తెలుగు సీజన్లోకి కాదులేండి.. హిందీలో ప్రస్తుతం 18 వ సీజన్ కి సన్నహాలు సిద్ధమయ్యాయి. మరికొన్ని రోజుల్లో అక్కడ సీజన్ 18 ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలోనే అక్కడ కంటెస్టెంట్ గా గాడిద రాబోతోంది అని తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు అందుకు సంబంధించిన ఒక వీడియో క్లిప్ కూడా నెట్టింట వైరల్ గా మారింది. మరి అసలు విషయం ఏమిటి? అసలు ఈ గాడిద హౌస్ లోకి రావడం ఏంటి? ఎందుకు గాడిదను హౌస్ లోకి తీసుకొస్తున్నారు..? కంటెస్టెంట్స్ ను గాడిదను సమానంగా చూస్తున్నారా..? గాడిదకు కూడా పారితోషకం ఇస్తారా ? మరి ఆ గాడిద ఆ పారితోషకం తో ఏం చేస్తుంది అంటూ రకరకాల కామెంట్లతో కామెంట్ బాక్స్ నింపేస్తున్నారు. మరి అసలు సంగతేంటో ఇప్పుడు చూద్దాం.

అడ్వకేట్ గుణరత్న పెంపుడు గాడిద..

బిగ్ బాస్ సీజన్ 8లోకి ప్రముఖ అడ్వకేట్ గుణరత్న సదావర్తే కంటెస్టెంట్ గా రాబోతున్నారు. ఇప్పుడు ఈయనతో పాటు ఈయన పెంపుడు గాడిద కూడా హౌస్ లోకి అడుగుపెట్టబోతోంది అని సమాచారం. ముఖ్యంగా బిగ్ బాస్ సీజన్ 18 కి సంబంధించిన కంటెస్టెంట్ల లిస్టు తాజాగా బయటకి రావడంతో అందుకు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు వైరల్ గా మారుతోంది.ముఖ్యంగా అడ్వకేట్ తన పెంపుడు గాడిద మాక్స్ తో కలిసి స్టేజ్ పైకి అడుగుపెట్టినట్లు సమాచారం. మొత్తానికైతే కంటెస్టెంట్ తో పాటు ఈ గాడిద కూడా అక్కడే హౌస్ లో ఉండబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి షో ప్రారంభమైన తర్వాత అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి అనే విషయం ఇప్పుడు వైరల్ గా మారింది.

Tags

Related News

Bigg Boss 9: అమ్మ బాబోయ్ ఎంతకు తెగించార్రా? మోసం చేసి కెప్టెన్ అయ్యాడు, షాకింగ్ వీడియో

Bigg Boss 9 : భరణి తనూజ బాండింగ్ కు బ్రేక్ పడినట్లేనా? సంచాలక్ గా ఇమ్ము ఫెయిల్? దుమ్ము లేపిన మాస్

Bigg Boss 9 Promo: మైండ్ దొబ్బిందా.. రీతూకి హోస్ట్ స్ట్రాంగ్ కౌంటర్!

Bigg Boss 9 Promo : భరణి గెట్ అవుట్ ఫ్రం హౌస్… హీటెక్కిన వీకెండ్ ఎపిసోడ్

Bigg Boss 9: సుమన్ శెట్టి ఫైర్, కొత్త కెప్టెన్ గా కామనర్, హౌస్ మేట్స్ పై రెచ్చిపోయిన తనూజ

Bigg Boss 9 Wildcard Entry: 6 గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్… యాడ దొరికిన సంతరా ఇది.. అంతా స్క్రాపే

Bigg Boss 9 New Captain: భరణికి చెక్ పెట్టిన కళ్యాణ్.. హౌజ్‌ కొత్త కెప్టెన్‌ అతడే!

Bigg Boss 9 Promo: అదిరిపోయిన కెప్టెన్సీ టాస్క్.. అతి నమ్మకం పనికిరాదు పాపా!

Big Stories

×