BigTV English

Subhashree Rayaguru: బిగ్ బాస్ బ్యూటీకి యాక్సిడెంట్.. తుక్కుతుక్కయిన కారు

Subhashree Rayaguru: బిగ్ బాస్ బ్యూటీకి యాక్సిడెంట్.. తుక్కుతుక్కయిన కారు

Bigg Boss Subhashree Rayaguru: బిగ్ బాస్‌లోకి రాకముందు చాలామంది కంటెస్టెంట్స్ గురించి ప్రేక్షకులకు అసలు తెలియదు. సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టులుగా నటించేవారిని, చిన్న సినిమాల్లో యాక్టర్లుగా కనిపించేవారిని కంటెస్టెంట్స్‌గా తీసుకొస్తారు బిగ్ బాస్ మేకర్స్. అదే విధంగా బిగ్ బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్‌గా కనిపించి అందరి మనసులను దోచేసింది శుభశ్రీ రాయగురు. తనను కంటెస్టెంట్స్ మాత్రమే కాదు.. ప్రేక్షకులు కూడా ప్రేమగా సుబ్బు అని పిలుచుకునేవారు. తాజాగా శుభశ్రీకి యాక్సిడెంట్ అయ్యిందనే వార్త ఫ్యాన్స్‌లో కలకలం రేపుతోంది. ఈ యాక్సిడెంట్ సంబంధించిన ఫోటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


సేఫ్‌గా ఉంది

బిగ్ బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్‌గా రాకముందు శుభశ్రీ అంటే ఎవరో కూడా ప్రేక్షకులకు తెలియదు. సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టులగా చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఇండస్ట్రీలో భాగమయ్యింది ఈ భామ. అదే సమయంలో తనకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. ఆ ఆఫర్ తన జీవితాన్ని మలుపు తిప్పింది. అసలు తను ఎవరో ప్రేక్షకులకు తెలిసేలా చేసింది. ఎంతోమంది ఫ్యాన్స్‌ను తెచ్చిపెట్టింది. ఇప్పుడు తనకు యాక్సిడెంట్ జరిగింది అనే విషయం బయటికి రాగానే తన ఫ్యాన్స్, ఫాలోవర్స్‌ కంగారుపడుతున్నారు. కానీ బిగ్ టీవీకి అందిన సమాచారం ప్రకారం.. శుభశ్రీ వెళ్తున్న కారు బాగా డ్యామేజ్ అయినా తను మాత్రం సేఫ్‌గానే ఉందని తెలుస్తోంది.


Also Read: మణికంఠ అసలు నువ్వు మనిషివేనా? ఆదిత్య ఓం ఆగ్రహం.. అదేంటి ఆమెను అంత మాట అనేశాడు?

తప్పంతా వారిదే

నాగార్జున సాగర్ రోడ్డులో శుభశ్రీ వెళ్తున్న కారును ఒక బైక్ ఢీకొట్టింది. బైక్ మీద వెళ్తున్న వ్యక్తులు తాగేసి ఉన్నట్టు సమాచారం. వారికి హెల్మెట్ ఉండడంతో చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. శుభశ్రీకి కూడా ఏమీ కాలేదు. కానీ తను వెళ్తున్న కారు ముందు భాగం మాత్రం తుక్కుతుక్కయ్యింది. తను ప్రయాణిస్తున్న కారు తనది కాదని.. ప్రొడక్షన్ వారిదే అని సమాచారం. మొత్తానికి ఈ బిగ్ బాస్ బ్యూటీ పెద్ద యాక్సిడెంట్ నుండి బయటపడిందని ఫ్యాన్స్ ఊపిరిపీల్చుకుంటున్నారు. తను ప్రయాణిస్తున్న కారు సరిగ్గానే వెళ్తున్నా అవతలి వైపు నుండి వచ్చిన బైక్ వల్లే ఈ యాక్సిడెంట్ జరిగిందని తెలుస్తోంది. చిన్న చిన్న గాయాలతో బయటపడినవారిని ఆసుపత్రికి తరలించారు.

బిగ్ బాస్ తర్వాత బిజీ

బిగ్ బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్‌గా వచ్చినప్పుడు ఆటల్లోనూ, గొడవల్లోనూ, అందరితో సన్నిహితంగా ఉండడంలోనూ శుభశ్రీ మంచి మార్కులు కొట్టేసింది. కానీ అనూహ్యంగా తను కొంతకాలానికే ఎలిమినేట్ అయ్యి వెళ్లిపోయింది. అప్పట్లో శుభశ్రీ ఎలిమినేషన్ చాలా అన్‌ఫెయిర్ అని ప్రేక్షకులు భావించారు. తిరిగి కంటెస్టెంట్‌గా రావడం కోసం బిగ్ బాస్ తనకు మరొక అవకాశం ఇచ్చినా.. అది కూడా సక్సెస్ కాలేదు. అయినా బిగ్ బాస్ తర్వాత వెంటనే చాలా బిజీ అయిపోయింది శుభశ్రీ. తనకంటూ ఒక యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించి వీడియోలతో సబ్‌స్క్రైబర్లను అలరించడం మొదలుపెట్టింది. అప్పుడప్పుడు ఈవెంట్స్‌లో కూడా కనిపిస్తూ ఎంటర్‌టైన్ చేస్తోంది.

Related News

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Mallika Sherawat: బిగ్ బాస్‌లోకి హాట్ బ్యూటి మల్లికా షెరావత్.. అబ్బాయిలు ఇక టీవీ వదలరేమో!

Soniya Akula : యష్ ను అందుకే పెళ్లి చేసుకున్నా.. ఇన్నాళ్లకు బయటపెట్టిన సోనియా..

Bigg Boss Siri: పెళ్లి కాకుండానే వరలక్ష్మి వ్రతం.. బిగ్ బాస్ సిరిని తిట్టిపోస్తున్న జనం

Big Stories

×