BigTV English

hairball in stomach: 2 కేజీల తల వెంట్రుకలను మింగిన మహిళ.. ఆమెకు అది అలవాటేనంటా!

hairball in stomach: 2 కేజీల తల వెంట్రుకలను మింగిన మహిళ.. ఆమెకు అది అలవాటేనంటా!

Doctors removed 2 kg hairball from UP Woman’s stomach: ఒక్కోసారి కొన్ని వింతైన ఘటనల గురించి వినప్పుడు ఆశ్చర్యమేస్తుంటుంది. అటువంటి మరో వింత ఘటన గురించి మీకు తెలిస్తే ఆశ్చర్యపోవడమే కాదు.. ఏకంగా మీరు నివ్వెరపోతారు. అవును. ఇది అక్షరాల నిజం. ఆసుపత్రికి వచ్చిన ఓ మహిళను పరీక్షించారు వైద్యులు. తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతున్నట్లు సదరు మహిళ ఆ వైద్యులతో పేర్కొన్నది. దీంతో ఆమె పరీక్షించిన డాక్టర్లు అసలు విషయం తెలిసి ఆశ్చర్యపోయారు. అదేమంటే.. ఏదో జబ్బు చేస్తేనో, ఇతర ఏదైనా తినకూడని ఆహారం తినో ఆమె కడుపు నొప్పితో బాధపడుతలేదు. ఆ మహిళకు వింతైన అలవాటు ఉంది. అందుకు కారణం ఓ వింతైన వ్యాధితో ఆమె బాధపడుతుంది. ఈ క్రమంలో ఆమెకు జుట్టు తినాలనే కోరిక బలంగా ఏర్పడింది. దీంతో తల వెంట్రుకలను తినడాన్ని ఆమె అలవాటుగా చేసుకుంది. అలా తింటూ తింటూ ఏకంగా 2 కేజీల వరకు తల వెంట్రుకలను మింగేసింది. వైద్యులు ఆపరేషన్ చేసి కడుపులో నుంచి ఆ వెంట్రుకలను తొలగించారు.


Also Read: మటన్ బిర్యానీ, చికెన్ కర్రీ – ఖైదీలకు స్పెషల్ మెనూ.. 4 రోజులు పండగే పండుగ!

ఇందుకు సంబంధించి ఇతర మీడియా కథనాల్లో వస్తున్న వివరాల ప్రకారం.. ఉత్తర ప్రదేశ్ లోని బరేలీలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. ఆ ప్రాంతానికి చెందిన ఓ మహిళ అరుదైన వ్యాధితో బాధపడుతూ ఉంది. ఈ వ్యాధితో బాధపడుతున్న సదరు మహిళ గత 15 ఏళ్ల నుంచి తల వెంట్రుకలను తింటుంది. ప్రస్తుతం ఆమె వయస్సు 25 ఏళ్లు. అయితే, ఇలా చాలా కాలంగా ఆమె తల వెంట్రుకలను తింటుడంతో ఆమెకు కడుపు నొప్పి సమస్య ఏర్పడింది. దీంతో ఆ మహిళ గత కొన్నాళ్ల నుంచి ఆసుపత్రుల చుట్టూ తిరుగుతుంది. అయినా కూడా ఆ మహిళకు కడుపు నొప్పి తగ్గడంలేదు. కడుపు నొప్పి తీవ్ర తరమైంది. సెప్టెంబర్ 22న బరేలీలోని మహారాణా ప్రతాప్ జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. వెంటనే ఆమెకు వైద్యులు పరీక్షలు జరిపారు. ఆ పరీక్షల్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.


Also Read: బీజేపీకి షాక్.. ఆ రెండు రాష్ట్రాలూ కాంగ్రెస్‌కే, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలివే!

బాధిత మహిళ ట్రైకోలోటోమేనియా అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఈ వ్యాధి సోకినవారికి జట్టును తినాలనే కోరిక బలంగా ఉంటుందని చెప్పారు. ఈ కారణంగానే ఆమె తల వెంట్రుకలను తిన్నదని, అలా తింటూ తింటూ ఆమెకు అది అలవాటుగా మారిపోయిందన్నారు. ఈ క్రమంలో ఆ మహిళకు తీవ్రంగా కడుపు నొప్పి సమస్య ఏర్పడిందన్నారు. ప్రస్తుతం ఆమె కడుపులో 2 కేజీల తల వెంట్రుకలు ఉన్నట్లు పేర్కొన్నారు. అవన్నీ కూడా కడుపులో పేరుకుపోయి పెద్ద బంతిలా తయారయ్యాయని వైద్యులు చెప్పారు. అవి పేగులు, ఇతర అవయవాల పనితీరును దెబ్బతీశాయని వివరించారు. ఆ తరువాత ఆమె కడుపులోంచి ఆ వెంట్రుకలను శస్త్ర చికిత్స చేసి తొలగించారు. కొద్ది రోజుల తరువాత ఆమెను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారని, అయితే, ఆమెకు సైకలాజికల్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు వైద్యులు చెప్పారు. కాగా, యూపీలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం గత 25 ఏళ్లలో ఇదే తొలిసారి అంటూ సదరు వైద్యులు పేర్కొన్నారు.

Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×