Kissik Talks: బిగ్ టీవీ నిర్వహిస్తున్న “కిస్సిక్ టాక్స్” (Kissik Talks) కార్యక్రమానికి ఎంతో మంచి ఆదరణ లభిస్తున్న సంగతి తెలిసింది. ఈ కార్యక్రమానికి జబర్దస్త్ వర్ష (Jabardasth Varsha)యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఎంతో మంది సినీ సెలెబ్రెటీలు బుల్లితెర నటీనటులు హాజరవుతూ సందడి చేస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా వచ్చిన సెలబ్రిటీలను వర్ష ఎన్నో రకాల ప్రశ్నలు వేస్తూ వారి నుంచి ఆసక్తికరమైన సమాధానాలను రాబట్టారు. ఇకపోతే తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఒక ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా ఈ కార్యక్రమానికి బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 విన్నర్ నిఖిల్ మలియక్కల్ (Nikhil Maliyakkal )హాజరయ్యారని తెలుస్తోంది.
బిగ్ బాస్ 8 విన్నర్..
ఇక ఈ ప్రోమోలో భాగంగా నిఖిల్ ఎన్నో విషయాల గురించి స్పందించారు. ముఖ్యంగా తన గురించి వస్తున్నటువంటి రూమర్ల గురించి అలాగే లవ్, బ్రేకప్, తన ఫ్యామిలీ సిచువేషన్ అలాగే తనకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల గురించి కూడా ముచ్చటించారని తెలుస్తోంది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా వర్ష నిఖిల్ ను ప్రశ్నిస్తూ… ఒక గదిలో మిమ్మల్ని ఉంచి అందులో వర్ష, యశ్మీ(Yashmi) ఎవరుండాలని కోరుకుంటారు అంటూ ప్రశ్నించడంతో ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటాను అంటూ కౌంటర్ ఇచ్చారు.
యశ్మీ మంచి స్నేహితురాలు…
ఇకపోతే బిగ్ బాస్ (Bigg Boss)కార్యక్రమంలో భాగంగా నిఖిల్, యశ్మీ చాలా మంచి స్నేహితులుగా ఉండేవారు అయితే వీరిద్దరూ చాలా క్లోజ్ గా ఉండటంతో వీరి మధ్య ఏదో ఉంది అంటూ కొంతమంది వీరి మధ్య లవ్ రూమర్లను క్రియేట్ చేశారు. అయితే ఈ రూమర్లపై కూడా తాజాగా నిఖిల్ స్పందించారని తెలుస్తోంది. మేమిద్దరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయితే కొంతమంది అభిమానులు కావాలనే మమ్మల్నిద్దర్నీ ఫ్రేమ్ చేస్తున్నారు. ఇలా చేయటం వల్ల భవిష్యత్తులో తనకు ఎంతో సమస్య అవుతుంది. ఆ విషయాన్ని గుర్తించాలి కదా అంటూ ఆయన మాట్లాడారు. యశ్మీ ఎవరినైనా పెళ్లి చేసుకోవాలనుకున్న లేదా ఎవరితో అయినా రిలేషన్ లో ఉండాలనుకున్న ఇలాంటి వార్తలు ఇబ్బందికరంగా మారుతాయని ఆయన తెలిపారు.
ఇకపోతే తనకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు గురించి కూడా మాట్లాడుతూ… ఒక కోటి రూపాయలు దొరికితే తాను తన అప్పులన్నీ కూడా తీర్చుకుంటానని వెల్లడించారు. అదే విధంగా తన తండ్రి తనకోసం ఎంతలా కష్టపడ్డారనే విషయాలు తాను సంపాదించడం మొదలుపెట్టిన తర్వాతే తెలిసింది అంటూ తన ఫ్యామిలీ గురించి కూడా చెబుతూ ఎమోషనల్ అయ్యారు. ఇలా తాజాగా విడుదల చేసిన ఈ ప్రోమో ఎంతో ఆసక్తిని కలిగిస్తుంది. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా నిఖిల్ ఇంకా ఎలాంటి విషయాలను పంచుకున్నారు ఏంటి అనేది తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఎదురు చూడాలి. ఈ పూర్తి వీడియో శనివారం రాత్రి ఏడు గంటలకు బిగ్ టీవీ ప్లస్ యూట్యూబ్ ఛానల్ లో ప్రసారం కానుంది. ఇక నిఖిల్ బిగ్ బాస్ తర్వాత బుల్లితెర సీరియల్స్ కు కాస్త దూరంగా ఉన్న సినిమాలు అలాగే బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు.
Also Read: రాధా జడ్జిగా కొత్త షో.. కుకింగ్‌లో కామెడీ మిక్స్.. ప్రోమో చాలా తేడాగా ఉందే!