Bigg Boss Goutham: 2024 సెప్టెంబర్ ఒకటవ తేదీన అత్యంత ఘనంగా ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 8 కార్యక్రమం నిన్నటితో ముగిసింది. 2024 డిసెంబర్ 15వ తేదీన చాలా గ్రాండ్ గా నిర్వహించిన ఈ కార్యక్రమంలో నిఖిల్ మలయక్కల్ విజేతగా నిలిచారు. 105 రోజులపాటు హౌస్ లో నిర్విరామంగా కష్టపడి తన స్ట్రాటజీతో, లీడర్షిప్ క్వాలిటీస్ తో అప్పుడప్పుడు విమర్శలు ఎదుర్కొని, అన్నింటిని నిలదొక్కుకొని నేడు విజేతగా నిలిచారు నిఖిల్. ముఖ్యంగా అమ్మాయిలను ట్రాప్ చేసి వారి గేమ్ ను స్పాయిల్ చేస్తున్నారు అనే నింద కూడా మోసారు. మొదటి వరకు వ్యత్యాసం చూపించకుండా గేమ్ ఆడిన నిఖిల్, చివర్లో కొంతమంది వల్ల ప్రేరేపితం అయ్యి ఫౌల్ గేమ్ కూడా ఆడి హోస్ట్ నాగార్జున చేత చివాట్లు కూడా పడ్డారు. ఇక తన ఆట తీరుతో అందరినీ మెప్పించి టాప్ ఫైవ్ వరకు చేరుకున్న నిఖిల్, చివర్లో ఇక తన కష్టాలను చెప్పుకొని అందర్నీ కంటతడి పెట్టించారు. ఇక ఎట్టకేలకు బిగ్ బాస్ సీజన్ 8 విజేతగా నిలిచి, రూ.55 లక్షల ప్రైజ్ మనీతో పాటు మారుతి డిజైర్ కార్ కూడా సొంతం చేసుకున్నారు. అలాగే ఇన్ఫినిటీ టైటిల్ కూడా ఈయన సొంతమయ్యింది.
ఇకపోతే ఈ సీజన్ కి రన్నర్ గా నిలిచారు గౌతమ్ కృష్ణ. గత సీజన్లో పాల్గొని అనూహ్యంగా 13వ వారం ఎలిమినేట్ అయ్యి అందరినీ ఆశ్చర్యపరిచిన గౌతమ్ .. ఈ సీజన్లోకి వైల్డ్ కార్డు ద్వారా అడుగు పెట్టారు.గత సీజన్ లో చేసిన తప్పులను మళ్లీ పునరావృతం చెయ్యకుండా తన అద్భుతమైన ఆట తీరుతో మెప్పించాడు. సింగిల్ గా ఉంటూ తాను ఒక్కడినే అని నిరూపించుకుంటూ గేమ్ తో అందరిని అబ్బురపరిచారు. అదే ఆయనను అభిమానులకు దగ్గర చేసింది. ఇక దాదాపు ఈ సీజన్ కి విన్నర్ అవుతాడని అందరూ అనుకున్నారు. కానీ ఒక్క వైల్డ్ కార్డు ఎంట్రీ ఆయనకు మైనస్ గా మారింది. మొదటినుంచి గనుక గౌతమ్ హౌస్ లో ఉండి ఉంటే కచ్చితంగా గౌతమ్ కి ట్రోఫీ లభించేది. కానీ వైల్డ్ కార్డు మెంబర్స్ కి ఇప్పటివరకు బిగ్ బాస్ చరిత్రలో టైటిల్ ఇవ్వలేదు. దీనికి తోడు ఐదు వారాల గేమ్ చూసి వచ్చారనే నెగిటివ్ కూడా ఉంటుంది. కాబట్టి గౌతమ్ ఈసారి టైటిల్ ని చేజార్చుకున్నారు అని చెప్పవచ్చు.
ఇకపోతే ఎపిసోడ్ చివర్లో బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున సూట్ కేస్ ఆఫర్ చేశారు. అందులో రూ.40 లక్షలకు పైగా ప్రైజ్ మనీ కూడా ఉంది. కానీ దానిని ఆయన తీసుకోలేదు.ముఖ్యంగా అభిమానుల నమ్మకాన్ని ఒమ్ము చేయలేనని తాను ట్రోఫీ గెలిచే అవకాశం ఉందని చెబుతూ వచ్చాడు. అయితే చివరికి నిఖిల్ ను విజేతగా ప్రకటించారు హోస్ట్ నాగార్జున. ఇకపోతే దాదాపు 10 వారాలపాటు హౌస్ లో కొనసాగారు గౌతమ్వారానికి రూ.1.75 లక్షల చొప్పున రెమ్యునరేషన్ అందుకున్న గౌతమ్, 10 వారాలకు గానూ కేవలం రూ.17.5 లక్షల రెమ్యునరేషన్ తోనే సరిపెట్టుకున్నారు.