Bigg Boss8 Telugu : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో 13 వ వారం నామినేషన్స్ ఆసక్తిగా మారాయి. సీజన్ ఎండ్ అవ్వడానికి కేవలం రెండు వారాలు మాత్రమే ఉండటంతో ఫ్యాన్స్ విన్నర్ ఎవరు అనే క్యూరియాసిటితో ఎదురు చూస్తున్నారు. ఈ వారం హౌస్ లోకి మాజీ కంటెస్టెంట్స్ వచ్చి సందడి చేస్తున్నారు. హౌస్ నుంచి ఈ వారం ఎవరు బయటకు వెళ్తారో అనేది ఆసక్తిగా మారింది. అయితే హౌస్ లోకి వచ్చిన వాళ్ళు విష్ణు ప్రియ సరిగ్గా ఆడటం లేదు. వెనకడుగు వేస్తుందని అంటున్నారు. ఇక పృథ్వితో విష్ణు ప్రియా క్లోజ్ గా ఉంటుంది. గతంలో కన్నడ బ్యాచ్ ఇచ్చిన క్లాస్ తో విష్ణును దూరం పెట్టాడు. అయిన ఆమె అతన్ని వదల్లేదు. ఏమైనా తీసుకో అంటూ ఓపెన్ ఆఫర్స్ ఇస్తూ అతన్ని వేదిస్తూనే ఉంది. తాజాగా అతను కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేశాడు. దీనిపై సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా వినిపిస్తున్నాయి.
అతను సెట్ అవ్వదు అని చెప్పినా కూడా విష్ణు వదల్లేదు. ఇక చేసేదేమి లేక అతను ఆమెతో కంటిన్యూ అయ్యినట్లు తెలుస్తుంది. ఇక మొన్న ఫ్యామిలీ వీక్‌లో తన తండ్రి వచ్చి చెప్పినా సరే అదెదో నామినేషన్స్ అన్నట్లుగా వాదించింది విష్ణుప్రియ. నా అన్న వాళ్లు చెబితేనే వినని విష్ణు.. బిగ్‌బాస్ రెండు సీజన్ల రన్నర్ చెబితే వింటుందా? అయినా కానీ చెప్పి మరీ పరువు తీసుకున్నాడు అఖిల్.. ఎవరెన్ని చెప్పినా విష్ణు తీరు మాత్రం మారలేదు.. ఈ వారం టిక్కెట్ టు ఫినాలే టాస్క్ లో భాగంగా హౌస్ లోకి వచ్చిన హారిక, అఖిల్ విష్ణు మనసు మార్చేందుకు ప్రయత్నం చేశారు. ఇక ఈ క్రమంలో అస్సలు నిజాన్ని బయట పెట్టాడు పృథ్వీ..
ఇక హౌస్ లోకి ఇండైరెక్ట్‌గా విష్ణుపై కౌంటర్ వేశాడు అఖిల్. లైఫ్ అంటే అంతే కదా.. కొంతమంది మనల్ని ఫోర్స్ చేస్తున్నా ఫోర్స్ ఫుల్ రిలేషన్‌లో ఉండేద్దేమో మనం.. కొంతమందిని అక్కడే వదిలేసి ముందుకెళ్తే ప్రయాణం ఇంకా బాలా బాగా వెళ్తుందేమో.. అని నాకు అనిపిస్తూ ఉంటుంది.. విష్ణు ప్రియకు ఇండైరెక్ట్ గా చెప్పేశాడు. ఈ రిలేషన్‌షిప్‌లో నాకు ఇది రైట్ అనిపించలేదు.. అది మార్చుకుంటే బావుంటుందేమోనని నాకు అనిపించింది.. విష్ణు నీ గురించే నేను చెబుతున్నానని అఖిల్ చెప్పాడు. దీనికి విష్ణు స్ట్రాంగ్ రిప్లయ్ ఇచ్చింది. నేను అయితే ఎవరిని ఏం ఫోర్స్ చేయట్లేదు.. ఇది ఒక పర్సన్ మీద ఇష్టం మాత్రమే అని అంటుంది. దానికి హారిక పృథ్విని అడుగుతుంది. తనకి చాలా సార్లు క్లారిటీ ఇచ్చా.. ఈ రిలేషన్‌షిప్ ఇవన్నీ నాకు సెట్ కాదు.. ఎందుకంటే నేను చాలా కెరీర్ ఫోకస్డ్‌గా ఉంటా.. నాకు అలాంటి ఫీలింగ్స్ రాదు.. కానీ తను నాకు ఒక మంచి ఫ్రెండ్.. అంటూ పృథ్వీ అన్నాడు.. తనకు విష్ణు అంటే ఇష్టం లేదని పబ్లిక్ గా చెప్పేసిన కూడా విష్ణు మారలేదు. ఇక విష్ణు ఈ వారం ఎలిమిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. మరి ఏమౌతుందో చూడాలి..