BigTV English

BB Telugu 8: నక్క తెలివి చూపిస్తున్న టేస్టీ తేజ.. ఇరుక్కుపోయాడుగా..?

BB Telugu 8: నక్క తెలివి చూపిస్తున్న టేస్టీ తేజ.. ఇరుక్కుపోయాడుగా..?

BB Telugu 8.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 మరో రెండు వారాలు గడిస్తే ముగుస్తుంది. టికెట్ టు ఫినాలే గెలిచి ఫైనల్ చేరిపోయి తొలి కంటెస్టెంట్ గా నిలిచాడు అవినాష్. అయితే ఈ ప్రాసెస్ లో చాలా హంగామా జరిగింది సాధారణంగా టికెట్ టు ఫినాలే రేస్ లో కంటెస్టెంట్స్ ఫైనల్ కి చేరాలంటే ఎంతో కష్టపడాలి. కానీ ఈసారి మాత్రం సులభంగా ఫైనల్ చేరే అవకాశం రావడంతో ప్రతి ఒక్కరు కూడా తమ స్ట్రాటజీ ఉపయోగించారు. టేస్టీ తేజ కూడా గట్టిగానే ప్రయత్నించారు కానీ చివరికి నాలగవ కంటెండర్ గానే మిగిలిపోయాడు.


ఇకపోతే టికెట్ టు ఫినాలే కోసం నిఖిల్, అవినాష్, రోహిణి పోటీ పడగా చివరికి అవినాష్ విజయం సాధించాడు. ఫినాలే విషయంలో టేస్టీ తేజకు అవకాశం ఇవ్వడానికి గౌతమ్ అంగీకరించకపోవడంతో బాగా హర్ట్ అయ్యారు అని చెప్పవచ్చు. ఒకవైపు హర్ట్ అయినా.. మరొకవైపు తన మాటలతో నక్క బుద్ధి చూపించి అందరిని ఆశ్చర్యపరిచారు. తేజ , గౌతమ్ మధ్య జరిగిన సంభాషణ చాలా హాట్ టాపిక్ గా మారింది. ఒకవైపు గౌతమ్ తప్పు లేదు, అతడి నిర్ణయం అతడి ఇష్టం అంటూనే.. టేస్టీ తేజ గౌతమ్ పై నెగిటివ్ కామెంట్స్ చేశాడు. గౌతమ్ తనకు ఫ్రెండ్ అని , అయినా అతడు తనకు సపోర్ట్ చేయలేదు అని, తేజ తన మాటలతో బాధ వ్యక్తం చేసి, మళ్లీ నీ తప్పు లేదులే.. నీకు అనిపించింది చెప్పావు.. కానీ నువ్వు చెప్పిన రీజన్ మాత్రం నాకు నచ్చలేదు అంటూ గౌతమ్ తో అన్నాడు. కానీ గౌతం మాత్రం చాలా క్లియర్ గా ఆ టైంకి ఎవరి వైపు న్యాయం ఉంటుందో వారికే సపోర్ట్ చేస్తా అంటూ తెలిపారు.

అయితే టేస్టీ తేజ మాత్రం నేనేమీ ఫీల్ కాలేదు.. అంటూనే మరొకవైపు తనకు అనిపించింది చెప్పాను అంటూ తెలిపాడు. ఇలా తేజ ద్వంద్వ వైఖరితో నెటిజన్లు అలాగే గౌతమ్ ఫ్యాన్స్ కూడా తేజాను దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. తేజవి నక్క తెలివితేటలు అంటూ అభివర్ణిస్తున్నారు కూడా.. నార్మల్గా చెబుతున్నట్టు మాట్లాడుతూనే ఎదుటివారి గురించి ఆడియన్స్లో నెగిటివ్ ఫీలింగ్ వచ్చేలా చేయడంలో తేజ బాగా ఆరితేరిపోయాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు మరికొంతమంది టేస్టీ తేజ మాట తీరుపై తీవ్రమైన అసహనం వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే ఆల్రెడీ వైల్డ్ కార్డ్స్ లో ఉన్న వారిలో అవినాష్ కాస్త ఫైనల్ కి చేరుకున్నాడు. మిగిలిన వారిలో ఇంకెంత మంది వైల్డ్ కార్డ్స్ ఫైనల్ కి చేరుకుంటారో చూడాలి. మొత్తానికైతే గౌతమ్ రన్నర్ లేదా విన్నర్ గా నిలవాలని అభిమానులు కోరుకుంటున్నారు. అలాగే ఓటింగ్ పరంగా కూడా అదే సాగుతోంది. మరి ఏం జరుగుతుందో తెలియాలి అంటే గ్రాండ్ ఫినాలే వరకు ఎదురు చూడాల్సిందే.


Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×