BigTV English

Bigg Boss : దారుణంగా బిగ్ బాస్ కంటెస్టెంట్ పరిస్థితి..తినడానికి తిండి లేక..

Bigg Boss : దారుణంగా బిగ్ బాస్ కంటెస్టెంట్ పరిస్థితి..తినడానికి తిండి లేక..

Bigg Boss : బుల్లితెర టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులను అలాగే బుల్లితెర నటులను, సామాన్యులు అంటూ అందరినీ ఒక హౌస్ లోకి తీసుకొచ్చి జనాలను తమ యాటిట్యూడ్ తో ఆటలతో పాటలతో ఎంటర్టైన్ చేస్తారు.. దాదాపు 100 రోజులకు పైగా ఉండే ఈ షోకు చాలా మంది ఫ్యాన్స్ అవుతున్నారు. తెలుగులో ఎనిమిది సీజన్లను పూర్తి చేసుకుంది. ఇప్పుడు తొమ్మిదో సీజన్ కోసం ప్రణాళికలు చేస్తుందని సమాచారం. అయితే ఈ షోలో పాల్గొన్న కంటెస్టెంట్స్ కొందరు వరుసగా సినిమా అవకాశాలను అందుకుంటున్నారు. మరికొందరు మాత్రం సోషల్ మీడియాకే పరిమితం అయ్యారు. తాజాగా బిగ్ బాస్ బ్యూటి పరిస్థితి దారుణంగా మారిందని వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇంతకీ ఆ కంటెస్టెంట్ ఎవరు? ఏ సీజన్లో పాల్గొంది? ప్రస్తుతం ఆమె ఏం చేస్తుంది? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..


బిగ్‌బాస్ ద్వారా జీవితంలో నిలదొక్కుకున్న వారెందరో ఉన్నారు. అందులో బిగ్ బాస్ బ్యూటీ ఇనయా సుల్తానా ఒకరు.. బిగ్‌బాస్ హౌస్‌లో ఆడపులి అన్నట్లుగా ఆడి ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సినిమాలలో దూసుకెళ్తున్నారు. సినిమాల్లో ఒకవైపు బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం ఈమె చేస్తే ఫోటోషూట్లకు ఫ్యాన్స్ ఎక్కువే.. హాట్ ఫోటోలతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది దాంతో సోషల్ మీడియాలో అమ్మకు స్టార్ హీరోయిన్ రేంజ్ ఫాలోవర్స్ ను పెంచుకుంటుంది. అయితే నిత్యం ఏదో ఒక యాంగిల్ లో ఫోటోలను దింపే ఇనయా ఇప్పుడు ఓ వీడియోను షేర్ చేసింది ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..

చిన్నప్పటి నుంచే నటి కావాలన్న కోరిక ఉండేది. కానీ పేరెంట్స్ మాత్రం చాలా స్ట్రిక్ట్ గా ఉండేవాళ్ళు. దాంతో ఆమె ఆశలు ఆవిరి అయిపోయాయి. కేవలం 100 రూపాయలు తీసుకుని ఇంట్లో నుంచి పారిపోయి నగరి నుంచి తిరుపతి వెళ్లే బస్ ఎక్కింది. తన మిత్రులు, తెలిసిన వాళ్ల సాయంతో కొన్నాళ్లు తిరుపతిలోనే ఉన్న ఆమె చిన్న ఉద్యోగం చేసి తన కలను నెరవేర్చుకోవడానికి హైదరాబాద్‌ బస్సు ఎక్కేసింది.. చాలా కష్టాలు పడి ఇండస్ట్రీలో చోటు సంపాదించుకుంది. చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ హాస్టల్లో ఉంటూ ఆమె జీవితాన్ని ముందుకు సాగించింది. ఇక పలు సినిమాల్లో నటించింది. ఈ నేపథ్యంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో కలిసి ఓ పార్టీలో ఆమె చేసిన హడావుడి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అంతా ఇంతా కాదు. దాంతో ఆమె లైఫ్ పూర్తిగా టర్న్ అయిపోయింది..


వర్మ పుణ్యమా అంటూ మంచి క్రేజీ నుఅందుకున్న ఆమె బిగ్ బాస్ లో పాల్గొన్న ఛాన్స్ కొట్టేసింది.. ఫినాలే ముందు ఎలిమినేట్ అయినప్పటికీ మంచి రెమ్యునరేషన్‌తో పాటు క్రేజ్‌ను సంపాదించారు ఇనయా. ఇక బయటికొచ్చాక సినిమాలు, వెబ్ సిరీస్‌లలో నటిస్తున్న ఇనయా ఈ మధ్య ఓ వ్యక్తితో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతోంది. వాళ్ళిద్దరు వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దాంతో ఇద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు కూడా వినిపించాయి.. అయితే తాజాగా తన ఇన్స్టాగ్రామ్ లో మరో వీడియోను షేర్ చేసింది. జీన్స్ ప్యాంట్, బ్లాక్ కలర్ టీ షర్ట్ ధరించిన ఆమె కారులో డ్రైవింగ్ చేస్తూ కనిపించింది. అలాగే ఈ పోస్ట్‌లో జీవితం బాగా కష్టంగా ఉందని.. కానీ నేను ధైర్యంగా ఉన్నానని, జనవరి నెలను పూర్తి చేశాను అలాగే ఇక ఫిబ్రవరి నెలలో కూడా పూర్తి చేస్తానని నేను నమ్ముతున్నాను అంటూ అందులో ఉంది. అసలు ఇనయాకు ఏమైంది ఎందుకు ఇలా వీడియో పెట్టింది అనేది అర్థం కాక నెటిజన్లు జుట్లు పీక్కుకుంటున్నారు.. మరి దీనిపై క్లారిటీ ఇస్తుందేమో చూడాలి..

Related News

Bigg Boss 9 Telugu: డబుల్ హౌస్.. డబుల్ డోస్..బిగ్ ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్

Monal Gajjar : బిగ్ బాస్ బ్యూటీ మోనాల్ గుర్తుందా.? ఇప్పుడేం చేస్తుందో తెలుసా..?

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Big Stories

×