BigTV English

OTT Movie : ఎంప్లాయిస్ పై ఎలుకల ప్రయోగం… ట్విస్టులతో మైండ్ బ్లాక్ చేసే రివేంజ్ సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : ఎంప్లాయిస్ పై ఎలుకల ప్రయోగం… ట్విస్టులతో మైండ్ బ్లాక్ చేసే రివేంజ్ సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : ఓటిటి ప్లాట్ ఫామ్ లోమలయాళం సినిమాలు దుమ్ముదులుతున్నాయి. వీటిలో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఎక్కువగా ఉన్నాయి. రెండు గంటలసేపు ప్రేక్షకులను కుర్చీలకు అతుక్కుపోయే విధంగా, సినిమాలను తరికెక్కిస్తున్నారు మేకర్స్. రీసెంట్ గా వచ్చిన ఒక మలయాళం సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ, ట్విస్టులతో చివరివరకు అదరగొట్టింది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

ఈ మలయాళం సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ పేరు ‘గోలం‘ (Golam). 2024లో విడుదలైన ఈ మలయాళం పోలీస్ ప్రొసీజరల్ థ్రిల్లర్ మూవీకి సంజాద్  దర్శకత్వం వహించారు. ఇందులో రంజిత్ సజీవ్, సన్నీ వేన్, దిలీష్ పోతన్, అలెన్సియర్ లే లోపెజ్, సిద్ధిక్ నటించారు. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

వి టెక్ అనే కంపెనీలో చాలామంది ఎంప్లాయిస్ పనిచేస్తుంటారు. వీళ్ళందరూ సరదాగా పనిచేస్తున్న సమయంలో, వీళ్ళ బాస్ జాన్ అక్కడికి వస్తాడు. అతడు రావడంతో అందరూ సైలెంట్ అయిపోతారు. తన రూమ్ కి వెళ్ళిన జాన్ రిసెప్షన్ తో, ఉద్యోగుల పనితీరు అడిగి తెలుసుకుంటాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి జాన్ రక్తపు మడుగులో చనిపోయి ఉంటాడు. పోలీస్ ఇన్స్పెక్టర్ ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. కంపెనీలో ఉన్న ఎంప్లాయిస్ ని ఒక్కొక్కరిని ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెడతాడు. జాన్ ప్రమాదంలో చనిపోయినట్టుగానే ఆధారాలు దొరుకుతాయి. అయితే పోలీస్ ఆఫీసర్ కి ఎక్కడో ఇది హత్య అని అనుమానం కలుగుతుంది. పోస్టుమార్టం రిపోర్ట్ మాత్రం హత్య కాదు అన్నట్టుగానే వస్తుంది. ఒక ఎంప్లాయ్ బ్యాగ్ చెక్ చేస్తే అందులో స్లీపింగ్ టాబ్లెట్స్ ఉంటాయి. వాటిని డాక్టర్ పర్మిషన్ లేకుండానే తీసుకున్నాను ఇన్స్పెక్టర్ కి చెప్తుంది. ఆ తర్వాత పోలీస్ ఇన్స్పెక్టర్ తను డాక్టర్ సహాయంతోనే, ఈ మందులు తీసుకున్నట్టు తెలుసుకుంటాడు. డాక్టర్ పేరు ను అక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులు దాస్తూ ఉంటారు. ఇది గమనించిన పోలీస్ ఆఫీసర్ డాక్టర్ దగ్గరికి వెళ్లి చాలా విషయాలు తెలుసుకుంటాడు.

నిజానికి జాన్ కి ఒక ఫార్మా కంపెనీ ఉంటుంది. అందులో ఒక రెడ్ వైరస్ ప్రాజెక్ట్ తో ఎంప్లాయిస్ మీద ప్రయోగం చేస్తారు. వాళ్లు తాగే వాటర్ లో ఆ మందును కలిపి, ఆ ప్రయోగాన్ని చేస్తూ ఉంటారు. దాంతో వీళ్ళందరూ రోగాల బారిన పడతారు. వీళ్ళందరూ కలిసి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే, ఆ డాక్టర్ ఈ విషయాలను తెలుసుకుంటాడు. ఆ తర్వాత ఎంప్లాయిస్ కి ఈ విషయం మొత్తం తెలుస్తుంది. జాన్ మీద ఎంప్లాయిస్ రివేంజ్ తీర్చుకోవానుకుంటారు. ఆ తర్వాత జాన్ ఇలా చనిపోయి ఉంటాడు. అయితే అన్నీ బాగానే ఉన్నా అతడు ఎలా చనిపోయాడు అనే విషయం మిస్టరీగా ఉంటుంది. చివరికి ఇన్స్పెక్టర్ జాన్ మర్డర్ ని వెలుగులోకి తెస్తాడా? అది నిజంగానే ఆత్మహత్య లేదా హత్య? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ‘గోలం’ (Golam) అనే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.

Related News

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

OTT Movie : స్టూడెంట్ ప్రైవేట్ ఫోటో లీక్… టీచర్ చేసే సైకో పనికి మెంటలెక్కల్సిందే

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే

OTT Movie : భార్యతో పాటు కోడలినీ వదలని మూర్ఖుడు… కొడుకు రీ ఎంట్రీతో ఫ్యామిలీ టెర్రర్… ట్విస్టులతో అదరగొట్టే సైకో థ్రిల్లర్

OTT Movie : మర్డర్ల చుట్టూ తిరిగే మైండ్ బ్లోయింగ్ స్టోరీ… హత్య కేసులో అనుకోని ట్విస్ట్… IMDbలో 7.9 రేటింగ్

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Big Stories

×