Trump Attack ISIS Somalia| అగ్రరాజ్యం అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూపర్ స్పీడుతో నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆయన దూకుడుతో అంతర్జాతీయ రాజకీయాలు వాటి సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. ఒకవైపు అమెరికాలో జన్మత: వారసత్వం రద్దు చేయడం, అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపడం, ప్రపంచదేశాలకు సుంకాలు ఆంక్షలతో హెచ్చరిస్తూ భయపెట్టడం చేస్తున్నారు. ఇవి కాకుండా తాజాగా ట్రంప్ తన సోషల్ మీడియాలో ఒక ప్రకటన చేశారు. ఉగ్రవాద సంస్థ ఐసిస్ సూత్రధారిని అమెరికా సైనిక బలగాలు సోమాలియాలో హత మార్చాయని.. ఆ దాడి చేయడానికి తాను కొన్ని రోజుల క్రితం ఆదేశాలు చేశానని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ లో ఉగ్రవాదులను వెలికి తీసి మరీ చంపుతామని వార్నింగ్ కూడా ఇచ్చారు.
శనివారం ప్రెసిడెంట్ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్ లో చేసిన పోస్ట్ ప్రకారం.. ఆఫ్రికా దేశమైన సోమాలియాలో అమెరికా సైన్యం వైమానిక దాడులు చేసింది. ఐసిస్ (ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ) కు చెందిన ఉగ్రవాద దాడుల సూత్రధారిని హతమార్చడమే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. సోమాలియా అడవుల్లోని గుహల్లో దాగి ఉన్న ఐసిస్ ఉగ్రవాదులే లక్ష్యంగా ఈ దాడులు జరగడంతో పౌరలెవరూ చనిపోలేదు. అమెరికా ముఖ్య టార్గెట్ అయిన ఐసిస్ సూత్రధారితో పాటు అక్కడ ఉన్న చాలా మంది ఇతర ఉగ్రవాదులు కూడా చనిపోయారని సమాచారం.
Also Read: వంద శాతం సుంకాలు.. ఇండియా సహా బ్రిక్స్ దేశాలకు ట్రంప్ వార్నింగ్..
“ఈ రోజు ఉదయమే నేను సోమాలియాలో దాగి ఉన్న సీనియర్ ఐసిస్ అటాక్ ప్లానర్ (ఉగ్రవాద దాడుల సూత్రధారి)ను, అతను శిక్షణ ఇచ్చిన ఇతర ఉగ్రవాదులను వైమానికి దాడుల ద్వారా హతమార్చడానికి ఆదేశించాను. అమెరికా దాని మిత్ర దేశాలను భయపెట్టే ఈ హంతకులను మేము గుహల్లో ఉండగా వెలికితీశాం. మేము చేసిన వైమానిక దాడుల్లో వారు నివసించే ఆ గుహలు నాశనమయ్యాయి. చాలా మంది ఉగ్రవాదులు చనిపోయారు. కానీ సామాన్య పౌరులకు ఎటువంటి హాని కలిగించలేదు. ఐసిస్ కు, అమెరికాపై దాడి చేయాలని ఆలోచించే అలాంటి ఇతర ఉగ్రవాద సంస్థలకు ఒక స్పష్టమైన సందేశం ఇవ్వదలుచుకున్నాను. మీరు ఎక్కడున్నా మేము వెలికి తీస్తాం. మేము మిమ్మల్ని హతమారుస్తాం.” అని ప్రెసిడెంట్ ట్రంప్ ట్రూత్ సోషల్‌తోపాటు ట్విట్టర్ ఎక్స్‌లో కూడా ఓ పోస్ట్ లో రాశారు.
శనివారం ఉదయం సోమాలియాలో అమెరికా చేసిన వైమానిక దాడుల గురించి అమెరికా రక్షణ సెక్రటరీ పీట్ హెగ్‌సెథ్ స్పందించారు. సోమాలియాలోని గోలిస్ పర్వతాల్లో చాలా నిర్దిష్టంగా దాడులు చేశామని ఆయన తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. చాలా మంది ఉగ్రవాదులు చనిపోయారని పౌరలెవరికీ హాని కలిగించలేదని ప్రకటించారు.
అల్ కాయిదా గ్యాంగ్ సభ్యులు ఇరాక్, సిరియా దేశాలలో ప్రారంభించిన ఐసిస్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఉగ్రవాదులు సోమాలియాలో తక్కువ సంఖ్యలోనే ఉన్నారు. కానీ అల్ కాయిదాకు చెందిన అల్ షబాబ్ అనే సంస్థ సోమాలియా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోందని.. ఇటీవలి కాలంలో దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తోందని జియోపాలిటిక్స్ నిపుణులు సూచిస్తున్నారు.
This morning I ordered precision Military air strikes on the Senior ISIS Attack Planner and other terrorists he recruited and led in Somalia. These killers, who we found hiding in caves, threatened the United States and our Allies. The strikes destroyed the caves they live in,…
— Donald J. Trump (@realDonaldTrump) February 1, 2025