BigTV English
Advertisement

Bigg Boss Nikhil: సోనియా పెళ్లికి అందుకే వెళ్ళలేదు.. క్లారిటీ ఇచ్చిన నిఖిల్..!

Bigg Boss Nikhil: సోనియా పెళ్లికి అందుకే వెళ్ళలేదు.. క్లారిటీ ఇచ్చిన నిఖిల్..!

Bigg Boss Nikhil:తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ (Bigg Boss) ఎట్టకేలకు తెలుగులో 8 సీజన్ లు పూర్తి చేసుకుంది. ఇక 8వ సీజన్ విన్నర్ గా నిఖిల్ నిలిచారు.అయితే అదే సమయంలో కన్నడ నటుడికి టైటిల్ ఎందుకు ఇచ్చారు అనే విమర్శలు వచ్చినా.. చాలామంది అతడి ఆట తీరు మెచ్చి, ఆయనకే టైటిల్ రావాలని కోరుకున్న వారు ఎంతోమంది ఉన్నారు. అలా హౌస్ లో 15 వారాలపాటు కొనసాగి, తనను తాను ప్రూవ్ చేసుకున్న నిఖిల్ (Nikhil) బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ గా నిలిచారు. ఇదిలా ఉండగా అదే సీజన్లో కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేసిన సోనియా ఆకుల (Sonia akula) ఇటీవల తన ప్రియుడు యష్ పాల్ వీరగోని తో ఆమె వివాహం జరిగింది. ఈ పెళ్లికి బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్స్ అందరూ కూడా హాజరయ్యారు.. కానీ విన్నర్ గా నిలిచిన నిఖిల్ మలియక్కల్ మాత్రం ఎక్కడ కనిపించలేదు.


సోనియా పెళ్లికి డుమ్మా కొట్టిన నిఖిల్..

నిజానికీ నిఖిల్ , సోనియా మధ్య హౌస్ లో ఉన్నప్పుడు బాండింగ్ ఎంతలా ఉందో అందరికీ తెలుసు. ముఖ్యంగా నిఖిల్ ని సోనియా ముందుండి నడిపింది. దీంతో ఇద్దరి మధ్య ఏవేవో రూమర్స్ వైరల్ అయ్యాయి. అంతేకాదు ఈమె వల్లే అతడి గేమ్ కూడా స్పాయిల్ అవుతోందని వార్తలు కూడా వినిపించాయి. చివరికి మధ్యలోనే సోనియా ఎలిమినేట్ అయ్యింది. దీంతో నిఖిల్ కూడా చాలా ఎమోషనల్ అయ్యారు. అలాంటి నిఖిల్.. సోనియా పెళ్లికి వెళ్లకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ క్రమంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నిఖిల్ సోనియా పెళ్లికి వెళ్లకపోవడానికి గల కారణాన్ని వెల్లడించారు.


అవుట్ ఆఫ్ స్టేషన్ అంటున్న నిఖిల్..

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నిఖిల్ తో బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత సోనియాతో మీ బాండింగ్ ఎలా ఉంది? అంటూ అడగగా.. నిఖిల్ మాట్లాడుతూ.. “అప్పుడప్పుడు మాట్లాడుతూనే ఉంటాము. అయితే సోనియా పెళ్లికి వెళ్లకపోవడానికి ఒక కారణం ఉంది. ఆ సమయంలో నేను అవుట్ ఆఫ్ స్టేషన్. అందుకే ఆమె పెళ్లికి వెళ్లలేకపోయాను. కానీ వేరే ఇంటర్వ్యూలో కూడా సోనియాకి ఏమైనా ఇవ్వాలా అని అడిగితే అవును ఇవ్వాలి. మ్యారేజ్ గిఫ్ట్..తప్పకుండా ఆమెను కలిసి ఆ గిఫ్ట్ ఇస్తాను అని చెప్పాను. ఇక నేను కొంచెం ఫ్రీ అయ్యాక ఖచ్చితంగా వెళ్లి కలుస్తాను” అంటూ నిఖిల్ తెలిపాడు. ప్రస్తుతం నిఖిల్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

రెండు రోజులు బాగా నిద్రపోయా..

ఇక అదే ఇంటర్వ్యూలో బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత మీరు చేసిన మొదటి పని ఏంటి? అని అడగ్గా.. “దాదాపు రెండు రోజులు ఎవరినీ కలవకుండా బయటకు రాకుండా నిద్రపోయాను. ఇక హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత జనాలను చూసేసరికి దూరంగా ఉండాలనిపించింది. అన్ని రోజులు అక్కడ అలవాటు పడిపోయాను కదా.. జనాల్ని చూసేసరికి ఏదోలా అయిపోయింది. అందుకే ఎవరు వచ్చినా కూడా ఎందుకు వీళ్లంతా వచ్చారు అని అనిపించేది. పాపం అది వాళ్ళ తప్పు కాదు కానీ అది నాకు అలవాటైపోయింది అంతే” అంటూ నిఖిల్ తెలిపారు.

Related News

Bigg Boss 9: ఏడుపుగొట్టు చెత్తను బయటకు తోసేయండి, లైవ్ చూడలేకపోతున్నాం

Bigg Boss 9: ఇన్ సెక్యూరిటీ లోకి పోయి గేమ్ పాడు చేసుకుంటున్నా ఇమ్మానియేల్

Bigg Boss 9 Telugu Day 61 : రీతూ బంగారంరా… తనూజాపై అంత కక్షగట్టేశావ్ ఏంటి దివ్య? నక్కతోక తొక్కిన ఇమ్మూ

Bigg Boss 9 Telugu : ఇమ్మూనా మజాకా? బిగ్ బాస్ చరిత్రలోనే బిగ్గెస్ట్ రికార్డ్… కానీ ఆ బుర్ర తక్కువ పనే మైనస్ మావా

Bigg Boss 9: చివరిలో చేజారిన తనూజ కెప్టెన్సీ.. అతడే కొత్త కెప్టెన్!

Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ లో ఉండటం ఆ కంటెస్టెంట్ కు ఇష్టం లేదా..? ఈ వారం ఇతనే ఎలిమినేట్..?

Bigg Boss 9 Promo: రీతూ Vs దివ్య.. చిచ్చుపెట్టిన సాయి!

Bigg Boss 9 Telugu : గౌరవ్ కు గట్టిదెబ్బ… ఇదేందయ్యా ఇదీ… కట్టప్ప కన్నా తనూజా – ఇమ్మాన్యుయేల్ వెన్నుపోటే దారుణం

Big Stories

×