BigTV English

Nagavamsi: ఆ ఇద్దరు హీరోయిన్లు కొట్టించుకోవడానికి ఒప్పుకోలేదు.. ఊర్వశీ ఒప్పుకుంది..

Nagavamsi: ఆ ఇద్దరు హీరోయిన్లు కొట్టించుకోవడానికి ఒప్పుకోలేదు.. ఊర్వశీ ఒప్పుకుంది..

Nagavamsi:  ఒకప్పటి ప్రేక్షకులకు నిర్మాతలు ఎలా ఉంటారో తెలిసేది కాదు. వాళ్లు సినిమాను నిర్మించి, లాభాలు వస్తే తీసుకోవడం.. నష్టాలు వస్తే బాధపడడం తప్ప బయట ఎక్కువగా కనిపించేవారు కాదు. ఉన్నాకొద్దీ ఇండస్ట్రీలో మార్పులు వచ్చాయి. కొద్దికొద్దిగా నిర్మాతలు కూడా మీడియా ముందుకు రావడం మొదలుపెట్టారు. అయితే వారెప్పుడు ప్రమోషన్స్ లో పాల్గొన్నది లేదు. ఇక ప్రమోషన్స్ లో నిర్మాత కూడా ఒక భాగం అని నిరుపించాడు ప్రొడ్యూసర్  సూర్యదేవర నాగవంశీ.


ఇంటర్వ్యూలకు స్టార్ హీరోలు లేకపోయినా పర్లేదు కానీ, నాగవంశీ మాత్రం ఉండాల్సిందే. వారి బ్యానర్ నుంచి సినిమా రిలీజ్  అవుతుంది అంటే  నాగవంశీ ప్రతి ప్రెస్ మీట్, ఈవెంట్, షో, ఇంటర్వ్యూ ఇలా అన్నిటిలో ఉండాల్సిందే. ఇక ఈ మధ్యనే ఆయనకు అభిమానులు ఒక ముద్దుపేరు కూడా పెట్టుకొచ్చారు. అదే  యాటిట్యూడ్ చింటూ.  మొన్న ప్రొడ్యూసర్స్  రౌండ్ టేబుల్ సమావేశంలో బాలీవుడ్ నిర్మాతలకు వంశీ చెమటలు పట్టించాడు. అప్పటి నుంచి ఆయనను అలా పిలుస్తున్నారు.

Bigg Boss Nikhil: సోనియా పెళ్లికి అందుకే వెళ్ళలేదు.. క్లారిటీ ఇచ్చిన నిఖిల్..!


ఈవెంట్ ఏంటి.. ? ఎవరి గురించి మాట్లాడుతున్నాం.. ? ఎవరి ముందు మాట్లాడుతున్నాం.. ? అనేది అసలు నాగవంశీ లెక్కలోకి తీసుకోడు. మనసుకు ఏది అనిపిస్తే అది నిర్మొహమాటంగా  చెప్పుకొచ్చేస్తాడు. తాజాగా నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం డాకు మహారాజ్.  నందమూరి బాలకృష్ణ – బాబీ కాంబోలో వస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. ఇప్పటికే ఈ సినిమా  నుంచి రిలీజైన  పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్  ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ముఖ్యంగా  దబిడి దిబిడి సాంగ్  చాలా ట్రోల్స్ గురైన విషయం తెల్సిందే. ముఖ్యంగా  బాలయ్య స్టెప్స్.. వల్గర్  గా ఊర్వశీని కొట్టడం.. ఇవన్నీ చాలామందికి నచ్చలేదు. అసలు ఇవేమి స్టెప్స్  అని విమర్శించారు. శేఖర్ మాస్టర్ ను  ఆడేసుకున్నారు. తాజాగా ఈ సాంగ్ ట్రోల్స్ పై  నాగవంశీ స్పందించాడు. ఈరోజు జరిగిన ప్రెస్ మీట్ లో ఆయనకు ఈ సాంగ్ కు సంబంధించిన ప్రశ్నలే ఎదురయ్యాయి.

AP High Court: రామ్ చరణ్, బాలయ్య సినిమాలపై హైకోర్ట్ లో పిటీషన్.. ఏమైందంటే..?

దబిడి దిబిడి సాంగ్ స్టెప్స్ శేఖర్ మాస్టర్ ఇంట్రెస్టా ..? మీ ఇంట్రెస్టా ..? అన్న ప్రశ్నకు ఆయన మాట్లాడుతూ.. ” ఏవండీ ఊర్వశీని కొట్టింది నేనా.. బాలయ్య గారు. నేను కొడితే  నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది అనుకుంటాను. ఆయన కొడితే నా ఇంట్రెస్ట్ ఏముంటుంది ” అని చెప్పుకొచ్చాడు.

ఇక ఇంకొక రిపోర్టర్ సినిమాలో  ప్రగ్యా, శ్రద్దా శ్రీనాధ్ ఉండగా.. ఊర్వశీని ఎంతు తీసుకున్నారు అని అడగ్గా.. ” ఆ ఇద్దరు హీరోయిన్లు కొట్టించుకోవడానికి ఒప్పుకోలేదు. అందుకే ఊర్వశీని కాస్ట్ చేసాం” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×