BigTV English

Ghaati Release Date: లేడీ డాన్ ఈజ్ బ్యాక్.. అనుష్క కొత్త సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది

Ghaati Release Date: లేడీ డాన్ ఈజ్ బ్యాక్.. అనుష్క కొత్త సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది

Ghaati Movie Release Date: టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న అనుష్క శెట్టి చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ప్ర‌ధాన పాత్ర‌లో నటిస్తున్న చిత్రం ‘ఘాటి’ (Ghaati). గ‌తంలో ఈ మూవీ నుంచి విడుద‌లైన గ్లింప్స్ అదిరిపోయేలా ఉండ‌డంతో పాటు ఈ చిత్రాన్ని దర్శకుడు క్రిష్ జాగర్లమూడి డైరెక్ట్ చెయ్యడంతో దీనిపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మ‌రో ప‌క్క జేజ‌మ్మ ఫ్యాన్స్ కూడా త‌మ అభిమాన న‌టిని వెండితెరపై చూసేంందుకు ఎంతో ఆతుర‌త‌గా ఎదురు చూస్తున్న వేళ తాజాగా చిత్ర‌ యూనిట్ రిలీజ్ డేట్ ప్ర‌క‌టించింది. అనుష్క లీడ్ రోల్ లో నటించ‌డంతో పాటు ఊర మాస్ లుక్‌లో ఘాటి మూవీలో క‌నిపించ‌నున్న‌ట్లు తెలుస్తుంది.


జేజమ్మగా గుర్తింపు

అరుంధ‌తి మూవీలో జేజమ్మ పాత్ర త‌ర్వాత ఆ రేంజ్ క్యారెక్ట‌ర్‌లో అనుష్క ఆడియ‌న్స్ క‌నిపించ‌లేదు. అంతేకాకుండా సైజ్ జీరో త‌ర్వాత కొన్ని కార‌ణాల వ‌ల్ల ఈ భామ సినిమాల‌కు దూరంగా ఉంటూ వ‌చ్చింది. మ‌ధ్య మ‌ధ్య‌లో ఒక‌టో రెండో చిత్రాలు చేసినా త‌న మూవీ మూవీకి గ్యాప్ మాత్రం తీసుకుంటూ వ‌చ్చింది. అయితే ఈ సారి ఘాటి మూవీతో మ‌రో సారి త‌నేంటో ఇండ‌స్ట్రీకి చూపించాల‌ని గ‌ట్టిగానే అనుకున్న‌ట్లు ఉంది అనుష్క‌.. అందుకే మాస్ పాత్ర ఉన్న స్టోరీని ఎంచుకుని ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్ర యూనిట్ ఘాటి రిలీజ్ డేట్ అధికారికంగా ప్ర‌క‌టించారు.


Also Read: తొలిప్రేమ పై స్పందించిన రాజమౌళి.. ఒక్కసారి మాత్రమే అంటూ.!

పాన్ ఇండియా మూవీ

వచ్చే ఏడాది ఏప్రిల్ 18న ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చెయ్యబోతున్నట్టు ప్రకటించారు మేకర్స్. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన చేస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు. ప్ర‌ముఖ సంస్థ‌ UV క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మిస్తోన్న ఈ మూవీకి సంబంధించిన‌ రిలీజ్ డేట్ వీడియోని మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. దీని ప్ర‌కారం ఏప్రిల్ 18 ప్యాన్ ఇండియా వైడ్‌గా ఘాటి థియేటర్లలో విడుదల కానుంది.ఇదిలా ఉండ‌గా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న‌ వీరమల్లు మూవీ నుంచి పక్కకు వచ్చాక క్రిష్ ప్రత్యేక శ్రద్ధతో ఎక్కువ సమయం తీసుకొని ఘాటీని రూపొందించారు.

గ్యాప్ తర్వాత

చాలా గ్యాప్ తర్వాత అనుష్కని సోలో రోల్ లో చూడబోయే మూవీ ఇది. పైగా ఈ మూవీ గ్యాంగ్ స్టర్ డ్రామాలో స్వీటీ ఎప్పుడూ చూడనంత వయొలెంట్ పాత్రలో క‌నిపించ‌డంతో అనుష్క‌ విశ్వరూపం చూడ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. ఇదంతా స్వీటి అభిమానులకు గుడ్ న్యూసే అనే చెప్పాలి. అనుష్క (Anushka) హీరోయిన్‌గా నటించిన చివరి చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సూపర్ సక్సెస్‌ఫుల్ అయ్యింది. ఆ మూవీలో అనుష్క యాక్టింగ్‌తో పాటు అప్పీయరెన్స్‌కు కూడా మంచి మార్కులు పడ్డాయి. అప్పటినుండి తన నుండి వచ్చే మరో సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తూనే ఉన్నారు. కానీ ‘ఘాటీ’ లాంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రంతో వస్తుందని ఎవరూ ఊహించలేదు. మొత్తానికి వచ్చే ఏడాది అనుష్క నుండి ఒక సెన్సేషనల్ మూవీ రాబోతుంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×