Bigg Boss 9 Promo : తెలుగు బిగ్ బాస్ ఈరోజు ఎపిసోడ్ లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమో చేస్తుంటే నేటి ఎపిసోడ్ కొంచెం ఆసక్తికరంగా జరగబోతుంది అని అర్థమవుతుంది. అయితే కెప్టెన్సీ కోసం ఒక సర్కిల్ లో నలుగురు వ్యక్తులు నిలబడ్డారు. పవన్, మనీష్, భరణి, ఇమ్మానుయేల్ పాల్గొన్నారు. దీనిలో టాస్క్ ఏంటి అంటే ఎవరి టీ షర్ట్ కి కూడా రంగు అంటించుకోకుండా కాపాడుకోవాలి.
ఈ పోటీలో మనీష్ ఓడిపోయి పక్కకు వెళ్లిపోయాడు. ఈ తరుణంలో సంచాలక్ గా వ్యవహరించిన రీతు మాట్లాడుతూ అది నీ ప్రాబ్లం మీ వాళ్ళలో నుంచి ఒకరు బయటకు వెళ్లిపోవడం అని అంది. అలా అని వెంటనే శ్రీజా దమ్ము ప్రియా శెట్టి ఇద్దరూ కలిసి రీతు చౌదరిపై రెచ్చిపోయారు. మీ వాళ్ళు ఏంటి ఇక్కడ అందరూ సమానమే కామనర్స్ కి హౌస్ మేట్స్ కి మీరు తేడా చూపిస్తున్నారు అంటూ ఆర్గ్యుమెంట్ మొదలుపెట్టారు.
మొత్తానికి షో మొదలైనప్పటి నుంచి కూడా సెలబ్రిటీలు కామనర్స్ తో మాట్లాడుతూ.. మేము సెలబ్రిటీస్ అంటూ ఫీలింగ్ ఏమీ లేదు బిగ్బాస్ హౌస్లో అందరమూ ఒకటే. ప్రస్తుతానికి ఓనర్స్ టెనెంట్స్ లెక్క ఉంటున్నాం. అని సెలబ్రిటీస్ అందరూ మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఈరోజు జరుగుతున్న టాస్క్ లో రీతు అలా అనేసరికి…
ఒకవైపు శ్రీజ దమ్ము, మరోవైపు ప్రియా శెట్టి కూడా అదే మాటను పదేపదే రిపీట్ చేశారు. వెంటనే రీతు చౌదరి డోంట్ టాక్ ఓనర్స్ అంటూ వాళ్ల మీదకు రిటర్న్ ఆర్గ్యుమెంట్ చేసింది. మరోవైపు వాళ్ళిద్దరినీ మాట్లాడకుండా కళ్యాణ్ నోరుమూశాడు. రీతు చౌదరి భరణిను గేమ్ నుంచి ఎలిమినేట్ చేయగానే మళ్లీ ప్రియా శెట్టి శ్రీజా దమ్ము గుడ్ డెసిషన్ అంటూ పొగడ్డం మొదలుపెట్టారు.