Deepika Padukone Kalki 2 Controversy: దీపికా పదుకొనె.. ప్రస్తుతం ఈ పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగుతుంది. వరుసగా రెండు భారీ ప్రాజెక్ట్స్ నుంచి ఆమెను తప్పించడం చర్చనీయాంశమైంది. దానికి కారణాలు కూడా బహిరంగంగానే బయటపెట్టారు. దీంతో ఈ వివాదంపై దీపికా రెస్పాన్స్ కోసం రెండు ఇండస్ట్రీలు ఎదురుచూస్తున్నాయి. మితిమిరిన డిమాండ్స్, కండిషన్స్ వల్లే దీపికాను ‘స్పిరిట్’కి తీసుకోవడం లేదని సందీప్ రెడ్డి వంగా బహిరంగ ప్రకటన చేశారు. స్టార్ హీరోయిన్ అయినంత మాత్రాన అంత ఆటిట్యూడ్ పనికి రాదని అన్నారు. ఆ తర్వాత కొందరు పీఆర్లతో తన స్పిరిట్ మూవీని లీక్ చేయాలని చూస్తున్నారంటూ డైరెక్టర్గా దీపికాపై ఆరోపణలు చేశాడు సందీప్ రెడ్డి. స్పిరిట్లో దీపికాను కాదని, మొన్నటి వచ్చిన యంగ్ హీరోయిన్ తీసుకుని ఆమెకు గట్టి సమాధానం ఇచ్చాడు.
కానీ, ఈ వ్యవహరంపై ఇప్పటి వరకు దీపికా నోరు విప్పలేదు. ఆ తర్వాత ఇచ్చిన ఓ ఇంటర్య్వూలో దీనిపై ప్రశ్న ఎదురవ్వగా.. సమయం వచ్చినప్పుడు అసలు విషయం బయటపడుతుందని ఈ ప్రశ్నను దాటవేసింది. అయితే విషయంలో దీపికా తప్పు పెద్దగా కనిపించలేదు. దీనికి కారణం సందీప్ రెడ్డి వంగా దురుసుతనం ఒక కారణం. ఎందుకంటే ఆయన స్ట్రయిట్ ఫార్వర్డ్ నేచర్, దూకుడు స్వభావం వల్ల ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి ఉంటాయని అనుకున్నారు. కానీ ఈ వ్యవహరంలో దీపికా పెద్దగా ఫోకస్ కాలేదు. పైగా స్టార్ హీరోయిన్ నుంచి ఆ మాత్రం డిమాండ్స్ రావడం కామనే అన్న అభిప్రాయాలు కూడా వచ్చాయి. కానీ, ఇప్పుడు కల్కి 2 నుంచి కూడా ఆమెను తప్పించడం హాట్ టాపిక్‌గా మారింది.
తాజాగా నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ దీపికాను ‘కల్కి 2’ నుంచి తప్పించినట్టు ప్రకటించారు. అంతేకాదు కల్కి లాంటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ చేయాలంటే నిబద్దత, అర్హత ఉండాలని బహిరంగ స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే దీపికాకి కల్కిలో నటించే అర్హత లేదని కల్కి మేకర్స్ అనడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. తెలుగు చలనచిత్ర రంగంలో వైజయంతీ మూవీస్ ఎన్నో మైల్‌స్టోన్స్ సాధించింది. 50 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ సంస్థ ఇప్పటి వరకు ఎలాంటి వివాదంలో నిలవలేదు. ఈ సంస్థలో పని చేసిన నటీనటులను తొలగించిన సందర్భాలు అసలు లేవు. వైజయంతీ మూవీస్ అధినేత అశ్వనీ దత్ చాలా కూల్. చాలా నెమ్మదనం ఉన్న నిర్మాత. అలాగే దర్శకుడు నాగ్ అశ్విన్ కూడా తన పని తాను చేసుకుపోతాడు.
కానీ, ఎలాంటి కాంట్రవర్సిలోనూ తలదూర్చడు. నటీనటులు ఎంపికలోనే ఆయన జాగ్రత్త పడతారు. ఇక దత్ సిస్టర్స్ కూడా చాలా కూల్ పర్సనాలిటిస్. ఇప్పటి వరకు ఏ నటి, నటుడుపై వీరికి కంప్లైయిట్స్ లేవు. అలాగే నటీనటులకు కూడా వైజయంతీ మూవీస్ సంస్థపై ఎలాంటి ఆరోపణలు చేయలేదు. ఈ సంస్థ పని చేసిన ప్రతి ఒక్కరు మేకర్స్ పట్ల వినయం, విదేయత చూపుతుంటారు. అలాంటి బ్యాగ్రౌండ్ ఉన్న వైజయంతీ మూవీస్ సంస్థ మొట్టమొదటి సారి ఓ నటిని తొలగిస్తున్నట్టు ప్రకటించింది. అంటే దీపికా ఏ స్థాయిలో వారిని ఇబ్బంది పెట్టి ఉంటుందనేది మీ అంచనాలకు వదిలేస్తున్నాం. నిజానికి.. కల్కి 2898 ఏడీలో ఆమె పాత్ర చాలా కీలకం. పార్ట్ వన్‌లో తన పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. అసలు కల్కి మూవీ మొత్తం దీపికా రోల్ చూట్టూనే తిరుగుంది.
కథలో టర్నింగ్ పాయింట్ ఇచ్చే రోల్ తనదే. అంతటి ప్రాముఖ్యత ఉన్న నటిని తొలగించడమంటే చిన్న విషయం కాదు. ఎంతో పెద్ద కారణం ఉంటేనే కానీ, మూవీ టీం ఈ నిర్ణయం తీసుకోలేదు. వైజయంతీ మూవీస్ ఈ నిర్ణయం తీసుకుందంటే.. దీపికాపై వస్తున్న ఆరోపణలన్ని నిజమే అన్నమాట. అంటే స్టార్ హీరోయిన్ అన్న మార్క్ని దీపికా స్వార్థంగా చూస్తుందా? స్టార్ హీరోయిన్ అంటే.. డిమాండ్స్, కండిషన్స్ లిమిట్స్ దాటాల్సిందేనా? అంటున్నారు. ఆమె స్టార్ అయినంత మాత్రానా దర్శక–నిర్మాతలు తమ డిమాండ్స్ తలవంచాల్సిందే అన్నట్టు వ్యవహరించిందా? భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేసిన విషయం నిజమేనా? అంటున్నారు. తనపై ఇంత పెద్ద ఆరోపణలు వస్తున్న దీపికా ఇప్పటి వరకు స్పందించకపోవడం ఏంటీ? అంటే ఆమెపై సందీప్ రెడ్డి వంగా, కల్కి చేసిన ఆరోపణలు నిజమేనా? అంటున్నారు. వీటన్నింటికి దీపికా సమాధానం చెప్పే టైం వచ్చింది.. కానీ, ఆమె ఇంకా నోరు మెదకపోవడం ఫ్యాన్స్ని ఆందోళన కలిగిస్తోంది.