Asia Cup 2025 : ఆసియా కప్ 2025లో భాగంగా సెప్టెంబర్ 14న భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో తొలుత టాస్ వేసే సమయంలో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. అలాగే టీమిండియా జట్టు 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన తరువాత కూడా టీమిండియా బ్యాటర్లు సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే కూడా షేక్ హ్యాండ్ ఇవ్వకుండానే డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లిపోయారు. అయితే ఆరోజు నుంచి నేటి వరకు కూడా ఈ వివాదం కొనసాగుతూనే ఉండటం విశేషం. మరోవైపు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.. మ్యాచ్ రిఫరీ ఆండి పైక్రాప్ట్ పై ఆరోపణలు చేసింది. అంతేకాదు.. అతనిపై ఐసీసీకి కూడా ఫిర్యాదు చేసింది.
Also Read : Asia Cup 2025 : పాకిస్తాన్ ను గడగడలాడించిన UAE ప్లేయర్.. ఇండియా నుంచి వెళ్లి… నరకం చూపించాడు
అయితే ఐసీసీ మాత్రం పీసీబీ ఫిర్యాదును తోసి పడేసింది. ఈ విషయంలో పైక్రాప్ట్ తప్పు లేదని..అతనికి ఆసియా క్రికెట్ కౌన్సిల్ నుంచే ఆదేశాలు వచ్చాయని తేలింది. ఈ విషయాన్ని భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగిన ఒకరోజు తరువాత అంటే.. సెప్టెంబర్ 15న పీసీబీ.. ఐసీసీకి ఓ లేఖ పంపించింది. అందులో మ్యాచ్ రిఫరీ టాస్ సమయంలో ఆచారాలను పాటించడం లేదని ఆరోపించింది. ఐసీసీ వెంటనే దీనిపై విచారణ జరిపి.. మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాప్ట్ తన పనిని తాను సరిగ్గానే చేశారని.. ఎలాంటి నిబంధనలను ఉల్లంఘించలేదని పీసీబీకి ఈ-మెయిల్ ద్వారా సమాధానం చెప్పింది. ఆ మెయిల్ లో టాస్ వేసే సమయంలో చేతులు కలుపకూడదని ఏసీసీ నుంచి వచ్చిన ఆదేశాలను అతను పాటిస్తున్నారని పేర్కొంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే..? ఏసీసీ అధ్యక్షుడిగా స్వయంగా పీసీబీ చీఫ్ మొహాసిన్ నఖ్వీ ఉండటం గమనార్హం.
అయితే ఈ ఆదేశాలను ఇచ్చి ఉంటే.. దానికి నేరుగా మొహసిన్ నఖ్వీనే బాధ్యత వహించాలి. ఐసీసీ పంపిన ఈ-మెయిల్ లో పైక్రాప్ట్ వ్యవహరించిన తీరును మెచ్చుకుంటూ… టీవీల్లో ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి రాకుండా చూసుకున్నారని ప్రశంసించింది. అయితే ఐసీసీ ఇచ్చిన సమాధానం పీసీబీకి నచ్చలేదు. దీంతో పీసీబీ ఏకంగా ఆసియా కప్ 2025 నుంచి వైదొలుగుతామని కూడా బెదిరించింది. మరోవైపు టీమిండియాతో జరిగే మ్యాచ్ కి ఇలాగే వ్యవహరించనుంది. అయితే తమ మ్యాచ్ లకు పైక్రాప్ట్ ను తొలగించకపోతే టోర్నమెంట్ నుంచి తప్పుకుంటామని తెలిపింది. ఐసీసీ తమ నిర్ణయానికి కట్టుబడి ఉంది. మ్యాచ్ రిఫరీ తప్పు చేయలేదని.. ఏ జట్టు కోరినంత మాత్రాన అధికారులను మార్చలేమని తేల్చి చెప్పింది. ఈ విషయం తప్పుగా అర్థం చేసుకోవడానికఇ దారి తీస్తుందని.. పేర్కొంది ఐసీసీ. సెప్టెంబర్ 17న మళ్లీ పీసీబీ ఓ మెయిల్ పంపింది. భారత్-పాక్ మ్యాచ్ సమయంలో, ఆ తరువాత కూడా నిబంధనలు ఉల్లంఘించబడ్డాయని వెల్లడించింది. అయితే ఐసీసీ సమాచారం కోరగా.. ఇప్పటివరకు కూడా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు పీసీబీ. ప్రస్తుతం ఈ విషయం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు టీమిండియాతో పాకిస్తాన్ మ్యాచ్ ఆడుతుందా..? లేదా అనేది కూడా ఇంకా క్లారిటీ లేదు.