BigTV English

OG Movie Team: ఓజీ నిర్మాతలకు బజ్ బాధలు.. ఇక ఆపేయండి అంటూ ఆవేదన

OG Movie Team: ఓజీ నిర్మాతలకు బజ్ బాధలు.. ఇక ఆపేయండి అంటూ ఆవేదన

OG Movie Team: కొన్ని కాంబినేషన్ సినిమాలు అనౌన్స్ చేసినప్పుడే భారీ హైప్ క్రియేట్ అయిపోతుంది. ఈ భారీ హైప్ క్రియేట్ అవ్వడం అనేది సినిమాకు కొంతమేరకు మాత్రమే ప్లస్ అవుతుంది. ఆ హైప్ ను సినిమా అందుకో లేకపోతే భారీ నష్టాలు వస్తాయి. అంచనాలు పెంచుకున్న అభిమానులే సినిమా అంతగా లేదు అని తీసి పడేస్తారు. ఇప్పటివరకు ఇలా చాలా సినిమాలకు జరిగింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన అజ్ఞాతవాసి సినిమా మీద విపరీతమైన హై ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి. కానీ సినిమా ఫలితం డిజాస్టర్.


ఇప్పుడు సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమా మీద కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. దానికి తోడు ట్విట్టర్లో డివివి ఎంటర్టైన్మెంట్స్ వేసే ట్వీట్స్ మామూలు రేంజ్ లో ఉండవు. మామూలుగా అభిమానులు ఎలా మాట్లాడుకుంటారో, ఆ ట్విట్టర్ అకౌంట్ నుండి వచ్చే ట్వీట్స్ కూడా అలానే ఉంటాయి. కొన్ని రిప్లైలైతే సినిమా మీద భారీ హైప్ ని క్రియేట్ చేస్తాయి.

ఓజీ నిర్మాతలకు బజ్ బాధలు

ఈ సినిమా నిర్మాతలకు ఒక కొత్త భయం పట్టుకుంది. ఇప్పటికే ఈ సినిమాకు ఉండాల్సిన దానికన్నా ఎక్కువ బజ్ ఉంది. దీంతో మేకర్స్ అప్రమత్తమైనట్టు తెలుస్తుంది. ఉన్న బజ్ చాలు. ఇంకా బజ్ క్రియేట్ అయ్యేలా పనులు చేయొద్దని ఫిక్స్ అయ్యారట. అందుకే ట్రైలర్ ను సాదాసీదాగా కట్ చేసినట్టు తెలుస్తుంది. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ రేపు విడుదల కానుంది. మరోవైపు ఈ సినిమాకు అన్ని సక్రమంగా అనుకూలిస్తున్నాయి. ఇరు రాష్ట్రాల్లో స్పెషల్ షోస్ కి కూడా పర్మిషన్ లభించింది. సినిమాకి యునానిమస్ పాజిటివ్ టాక్ వస్తే పవన్ కళ్యాణ్ కెరియర్ లో మరోసారి అద్భుతమైన కలెక్షన్స్ చూస్తారు అనడంలో అతిశయోక్తి లేదు.


తమన్ నెక్స్ట్ లెవెల్ డ్యూటీ 

ఈ సినిమాకి ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ రోజుల్లో ఒక మ్యూజిక్ డైరెక్టర్ తో ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ కి కంపేర్ చేయడం అనేది అలవాటైపోయింది. ట్విట్టర్లో చాలామంది యువత అనిరుద్ మ్యూజిక్ ను బీభత్సంగా ఎలివేట్ చేశారు. అలానే బక్కోడు అంటూ పోస్టులు పెడుతుంటారు. ఇది అనిరుద్ కి కూడా రీచ్ అయింది. అందుకే కింగ్డమ్ ఈవెంట్లో మీ బక్కోడు అని అనిరుద్ మాట్లాడాడు. అయితే అనిరుద్ కొట్టిన మూడు సినిమాలకు ఓజి సినిమా సమాధానం చెబుతుంది అంటూ తమన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. స్టేట్మెంట్ మాదిరిగానే ఈ సినిమా కోసం నెక్స్ట్ లెవెల్ డ్యూటీ చేస్తున్నాడు తమన్. ఈ సినిమా నుంచి విడుదలైన మూడు పాటలు మంచి సక్సెస్ సాధించాయి.

Also Read : Sharwanand: మరి పేషంట్ లా మారిపోతున్నారు ఏంటి సార్?

Related News

Deepika Padukone: హమ్మయ్య ఎట్టకేలకు స్పందించిన దీపిక.. ఇలా ట్విస్ట్ ఇచ్చిందేంటి?

Tollywood: ప్రముఖ రచయిత కన్నుమూత.. ఏమైందంటే?

The Raja Saab Trailer : డార్లింగ్ ఫ్యాన్స్ ట్రోల్స్… దెబ్బకు సారీ చెప్పిన డైరెక్టర్

Sharwanand: మరి పేషంట్ లా మారిపోతున్నారు ఏంటి సార్?

Kalki 2 : కల్కి సినిమా నుంచి తప్పుకోవడానికి అదే కారణం, దీపికా పదుకొనే రియాక్షన్

OG Movie: పవన్ ఫ్యాన్ కి గుడ్ న్యూస్… తెలంగాణలో కూడా షో ఉంది

OG : సుజీత్ అసలు ఏం ప్లాన్ చేసావ్ బాబు, థియేటర్లో శవాలు లేస్తాయి

Big Stories

×