Bigg Boss Teja.. ఫుడ్ కి సంబంధించిన వీడియోలు చేసి మంచి పేరు సొంతం చేసుకున్నారు తేజ (Teja). ముఖ్యంగా సెలబ్రిటీలు తమ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తేజతో వీడియోలు చేస్తూ భారీ పాపులారిటీ అందించారు. అందులో భాగంగానే రోజుకొక వీడియోతో ప్రేక్షకులను అలరించే తేజాకి బిగ్ బాస్ లో అవకాశం వచ్చింది. అలా సీజన్ 7 లో పాల్గొన్న తేజ ఆ సీజన్లో నెరవేర్చుకోలేని కోరికలను ఈ సీజన్లో నెరవేర్చుకున్నారని చెప్పవచ్చు. ఇకపోతే బిగ్ బాస్ కంటెస్టెంట్లకు హోస్ట్ నాగార్జున ఒక టీచర్ లాగా.. పొరపాట్లు చేస్తే సరిదిద్దుకోమని సలహా ఇస్తారు. మంచి చేస్తే చప్పట్లు కొడతారు. బాధలో ఉంటే మోటివేట్ చేస్తారు. తప్పు చేస్తే దండిస్తారు కూడా.. అందుకే నాగార్జునకు అంత మంచి పేరు ఉంది. హోస్టింగ్ లో ఆయన భారీగా సక్సెస్ అయ్యారు కూడా.. ఇదిలా ఉండగా ఈయన తేజకు బంపర్ ఆఫర్ ప్రకటించారు అదేంటో ఇప్పుడు చూద్దాం.
బిగ్ బాస్.. సాధారణంగా వీకెండ్స్ లో హోస్ట్ నాగార్జున వేసుకొచ్చే షర్ట్స్ కి ఎంతోమంది ఫాన్స్ ఉన్నారు. పోయిన సీజన్ లో షర్ట్ కావాలని శోభ శెట్టి అడగ్గానే నాగార్జున అలా ఇచ్చేసాడు. ఇక అమర్దీప్ అడిగితే మాత్రం ఆయన లెక్క చేయలేదు. ఈ సీజన్లో మళ్ళీ వైల్డ్ కార్డు ద్వారా టెస్ట్ తేజ పాల్గొన్న విషయం తెలిసిందే .ఇక్కడ కూడా సిగ్గు విడిచి నాగార్జున చొక్కా కావాలని అడిగాడు నాగార్జున. నువ్వు సన్నబడు అప్పుడు షర్ట్ ఇస్తానని మాట ఇచ్చాడు నాగార్జున. దానికోసం టేస్టీ తేజ ఎంతో కష్టపడ్డారు. కానీ ఫలితం లభించలేదు. ఇక బరువు తగ్గకుండానే హౌస్ నుంచి వెళ్ళిపోయాడు తేజ.
ఇకపోతే నిన్న డిసెంబర్ 15న సీజన్ 8 గ్రాండ్ ఫినాలే ఘనంగా జరిగింది. ఈ ఫినాలేకి తేజ కూడా వచ్చారు. ఇక తేజ మాట్లాడుతూ.. మా అమ్మను హౌస్ లోకి తీసుకురావాలనుకుని గత సీజన్లో ఎంతో కష్టపడ్డాను. కానీ కుదరలేదు. ఇక ఈ సీజన్లో ఆ కలను నేర్చుకున్నాను. అంతా మీ వల్లే. అయితే ఒక కోరిక మాత్రం అలాగే మిగిలిపోయింది అని చెప్పాడు. దీంతో నాగార్జున ఏమిటా కోరిక? అని అడగ్గా.. మీ షర్ట్ నాకు దక్కలేదు సార్.. అంటూ తన కోరికను బయటపెట్టారు. అందుకు నాగార్జున మాట్లాడుతూ.. ముందు పెళ్లి ఫిక్స్ చేసుకో అప్పుడు నీకు పెళ్లి డ్రెస్ నేను ఫిక్స్ చేస్తా అంటూ హామీ ఇచ్చాడు. మొత్తానికైతే ఊహించని సర్ప్రైజ్ తగలడంతో తేజా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఏది ఏమైనా నాగార్జున తేజకి బంపర్ ఆఫర్ ప్రకటించారని అదృష్టం అంటే తేజదే అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. మరి నాగార్జున ఇచ్చే బంపర్ ఆఫర్ ను తేజ పొందాలి అంటే పెళ్లి పీటలు ఎక్కాల్సిందే. మరి ఆ కళ్యాణ గడియాలు తేజకి ఎప్పుడు వస్తాయో చూడాలి. ఇక బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా మరింత పాపులారిటీ అందుకొని తనను తాను మరింత ప్రూవ్ చేసుకున్నారు. గత సీజన్లో శోభా శెట్టిని ట్రై చేశాడు. కానీ ఆమె ఆల్రెడీ లవ్ లో ఉంది. ఈ సీజన్లో ప్రేరణని ఇష్టపడ్డాడు. కానీ ఆమెకు పెళ్లి అయిపోయింది. మరి ఎవరిని ఈయనను ఇష్టపడతారో చూడాలి.