కొందరు పురుషులు పెళ్లి చేసుకోవడానికి ఇష్టం చూపిస్తారు. మరికొందరు మాత్రం ఒంటరిగా ఉంటేనే ప్రశాంతంగా ఉంటుందని అనుకుంటారు. నిజానికి పురుషుల ఆరోగ్యానికి ఒంటరిగా ఉండడం మంచిదా? లేక జంటగా జీవితాన్ని గడపడం మంచిదా? అనే విషయాన్ని తెలుసుకునేందుకు అధ్యయనాన్ని నిర్వహించారు. ఈ అధ్యయనం తాలూకు వివరాలను అందించారు. ఈ అధ్యయనంలో వివాహం వల్ల కలిగే ప్రయోజనాలను కూడా వివరించారు.
పెళ్లి చేసుకుంటే ఆయుష్షు పెరుగుతుందా?
ఈ కొత్త అధ్యయనం ప్రకారం పెళ్లి చేసుకున్న పురుషులు ఒంటరిగా జీవించే మగవారితో పోలిస్తే ఎక్కువ కాలం జీవిస్తారని తేలింది. ఒంటరిగా ఉండే పురుషులకు మొదట్లో ప్రశాంతత ఉన్న తర్వాత తెలియకుండానే ఒత్తిడి పడుతుందని. అది అనేక రోగాలకు కారణమవుతుందని చెబుతున్నారు. హార్వార్డ్ హెల్త్ చేసిన అధ్యయనంలో వివాహిత పురుషులు, ఒంటరి పురుషులతో పోలిస్తే ఎక్కువ కాలం జీవిస్తున్నట్టు కనుగొన్నారు. అంతేకాదు వివాహం చేసుకున్న పురుషులు ఒంటరి మగవారితో పోలిస్తే ఎక్కువకాలం జీవించినట్టు కూడా తేలింది. అందుకే వివాహాన్ని జీవితంలోనే ముఖ్య ఘట్టంగా చెబుతారు. ఇది దీర్ఘాయువుకు కూడా దోహదపడుతుందని ఇప్పుడు అధ్యయనం తేల్చింది.
ఒంటరిగా ఉంటే వ్యసనాలకు బానిస అవుతారా?
పెళ్లి చేసుకోవడం వల్ల జీవితంలోని బాధ్యతలను పంచుకోవడానికి ఒక స్థిరమైన భాగస్వామి దొరుకుతుంది. కష్టాలను చెప్పుకోవడానికి కన్నీళ్లు తుడవడానికి ఆమె మీకు తోడుంటుంది. దీని వల్లే వారు డిప్రెషన్ బారిన పడకుండా ఉంటారని మాదకద్రవ్యాలు వంటివి వాడకుండా జాగ్రత్తగా ఉండే పరిస్థితులు ఏర్పడతాయని అధ్యయనం వివరిస్తుంది. ఒంటరిగా ఉండే మగవారు వ్యసనాలకు బానిస అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. వివాహం తమకు తెలియకుండానే మగవారిపై పడే శారీరక, మానసిక ఒత్తిడి తగ్గించడానికి సహాయపడుతుందని తద్వారా దీర్ఘాయువుని ఇస్తుందని అధ్యయనం వివరిస్తుంది.
అమ్మాయిలకే ఎక్కువ సమస్యలు?
ఇదే అధ్యయనంలో పెళ్లి మహిళలపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో కూడా తెలియజేశారు. నిజానికి వివాహం మగవారికే ఎక్కువ ప్రయోజనాలను అందిస్తుంది. మహిళలపై ఎక్కువ ఒత్తిడిని భారాన్ని పడేలా చేస్తుంది. ఒక్కోసారి ఒంటరి మహిళలు ఆరోగ్యకరంగా ఉండే అవకాశం, దీర్ఘాయువును పొందే అవకాశం ఉన్నట్టు అధ్యయనం చెబుతోంది. పురుషులు, స్త్రీలలో వివాహం తాలూకు ప్రయోజనాలు భిన్నంగా ఉన్నాయి. మహిళల్లో వివాహం అనేది భావోద్వేగాలపరంగా, శారీరకపరంగా ఒత్తిడిని అధికంగా చేస్తోం.ది పురుషులతో పోలిస్తే మహిళలకు వివాహం వల్ల ఎక్కువ ప్రయోజనాలు కలిగి అవకాశం లేదు. వివాహం వల్ల మగవారికి అధిక ప్రయోజనాలు కలుగుతాయి.
Also Read: మీ జీవిత భాగస్వామి.. మీతో నిజాయితీగా ఉంటున్నారో లేదో ఇలా తెలుసుకోండి, అదిరిపోయే టిప్!
ఈ కొత్త అధ్యయనాన్ని బట్టి పురుషులు ఒంటరిగా ఉండే కన్నా వివాహం చేసుకొని జంటగా జీవించేందుకే ప్రయత్నించాలి. ఈ దీర్ఘాయువుతో పాటు అనేక రోగాల బారిన పడకుండా మిమ్మల్ని కాపాడుతుంది. పరిపూర్ణమైన జీవితాన్ని గడపడానికి అవకాశాన్ని ఇస్తుంది.
గమనిక: వివిధ అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందిచామని గమనించగలరు. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ నెట్ వర్క్ బాధ్యత వహించదు.