Bigg Boss Telugu 9 Day 12 Episode Review: బిగ్ బాస్ లో కెప్టెన్సీ పోరు ముగిసింది. డిమోన్ పవన్ హౌజ్ కెప్టెన్ అయ్యాడు. ఇప్పటి వరకు ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ గా ఉన్న హౌజ్ లో బిగ్ బాస్ టెనెట్స్ వర్సెస్ టెనెంట్స్ గా మార్చేశాడు. నేటి(12వ రోజు) ఎపిసోడ్ లో టెనెంట్స్ మధ్య పోరు పెట్టాడు. అయితే కెప్టెన్సీ టాస్క్ లో ఫెవరిజం జరిగిందంటూ ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్ అయ్యాడు. కెప్టెన్సీ టాస్క్ లో ఓడిపోవడంతో ఇమ్మాన్యుయే ల్ ఎమోషనల్ అయ్యాడు. రితూ నాకు సపోర్టు చేయలేదు అంటూ కన్నీరు పెట్టుకున్నాడు.
మరోవైపు రితూ కూడా తన గురించి తప్పుగా అనుకుంటున్నారంటూ ఏడుపు మొదలుపెట్టింది. అలా కెప్టెన్సీ టాస్క్ తర్వాత హౌజ్ లో కాసేపు ఎమోషనల్ డ్రామా నడిచింది. ఇంటి దొంగ సంజన మరోసారి తన చేతివాటం చూపించింది. అంతా కెప్టెన్సీ టాస్క్ లో జరిగిన డ్రామా గురించి చర్చించుకుంటుంటే.. తాను మాత్రం థమ్స్ ప్ దొంగలించింది. దొంగచాటుగా థమ్స్ ప్ తాగుతూ ఎంజాయ్ చేసింది. ఆ తర్వాత కవర్లు కొన్ని థమ్స్ ప్ దొంగలించి కవర్లో పెట్టుకుని దాచింది. అవి దొరకడంతో నాకేం తెలియదు అంటూ డ్రామా చేసింది.
ఆ తర్వాత టెనెంట్స్ కి హౌజ్ ఓనర్ అయ్యే చాన్స్ ఇచ్చాడు బిగ్ బాస్. కొన్ని బొమ్మలు ఇచ్చి వాటిని ఓనర్లు విసురుతుంటే టెనెంట్స్ పట్టుకోవాలి. వాటిని తమ తమ బాస్కెట్లో భద్రంగా దాచుకోవాలి. చివరికి ఎవరి దగ్గర ఎక్కువ బొమ్మలు ఉంటే వాళ్లు హౌజ్ ఓనర్ అవుతున్నారు. అయితే ఇక్కడే బిగ్ బాస్ ఓ మెలిక పెట్టారు. కంటెస్టెంట్స్ దాచుకున్న బొమ్మలను.. కొ కంటెస్టెంట్స్ తీసుకోవచ్చని చెప్పి ట్విస్ట్ ఇచ్చాడు. ఇక టాస్క్ కి ప్రియా సంచాలక్ గా వ్యవహరించింది. ఈ క్రమంలో టెనెంట్స్ పెద్ద పెద్ద వారే జరిగింది. అలా జరిగిన మొదటి రౌంట్ ఫ్లోరా షైనీ ఎలిమినేట్ అయ్యింది. ఇక సంజన వాలంటరీగా టాస్క్ నుంచి తప్పుకుంది. ఇక టాస్క్ నుంచి తప్పుకున్న ఫ్లోరా, సంజనలు టెనెంట్స్ లో హౌజ్ ఓనర్ అవ్వాలని అనుకుంటున్న వారికి సపోర్టు ఇవ్వొచ్చని వారికి పవర్ ఇచ్చాడు.
రెండో రౌండ్ లో ప్రియా, మనీష్.. బొమ్మలు, బంతులు విసురుతుంటే టెనెంట్స్ వాటిని పట్టుకుని బాస్కెట్లో వేసుకోవాలి. ఆ తర్వాత ఇక అసలు యుద్ధం మొదలైంది. బొమ్మలు దాచుకుంటే పక్కవాళ్లు వాటిని తస్కరించే ప్రయత్నం చేశారు. తమ బొమ్మలను కాపాడుకోవడానికి టెనెంట్స్ కింద మీద పడ్డారు. ఈ క్రమంలో ఫ్లోరా, ఇమ్మాన్యుయేల్, సంజనలు కలిసి రీతూను టార్గెట్ చేశారు. ఆమె కింద పడేసి బొమ్మలు కొట్టేసేందుకు యత్నించారు. ఈ క్రమంలో సంజన, రీతూల మధ్య వాగ్వాదం జరిగింది. ఇక సుమన్ శెట్టి.. మోచేతితో ఫ్లోరాను గుద్ది విశ్వరూపం చూపించాడు. దీంతో సెకండ్ రౌండ్ లో సుమన్ శెట్ట ఎలిమినేట్ అయ్యాడు.
Also Read: Bigg Boss 9 Telugu: సెలబ్రిటీలకు బానిసలుగా కామనర్స్..!
మూడో రౌండ్ లో రీతూ వర్సెస్ ఇమ్మాన్యుయేల్, తనూజగా టాస్క్ కొనసాగింది. రీతూ, తనూజలు నోర్ముయ్ నోర్ముయ్ అంటూ ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డారు. ఇక మూడో రౌండ్ లో రీతూ తనూజని టార్గెట్ చేసింది. ఈ క్రమంలో తనకు సపోర్టు చేయమంటూ తనూజ సుమన్ శెట్టిని వేడుకుంది. ఆయన అతడు కరగలేదు. ఫైనల్ గా ఈ టాస్క్ మూడో రౌండ్ లో రీతూ చౌదరి ఎలిమినేట్ అయ్యింది. ఇక నాలుగో రౌండ్ లో తనూజ, ఇమ్మాన్యుయేల్, తనూజలు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారు. గేమ్ మధ్యలో తను గివప్ ఇస్తానని, దీంతో నా బొమ్మలన్ని తనకు వెళ్లిపోతాయంటూ తనూజ ఫేవరిజం చూపించింది.
ఇక ఈ నాలుగో రౌండ్ లో తనూజ ఎలిమినేట్ అవ్వడంతో ఫైనల్ గా రాము రాథోడ్, ఇమ్మాన్యుయేల్ లు మిగిలారు. ఓడిన తనూజ అక్క అక్క అంటూ వెన్నుపోటు పొడిచారంటూ రీతూని ఉద్దేశిస్తూ కామెంట్స్ చేసింది. ఇక ఈ టాస్క్ లో టాప్ 2గా నిలిచిన రాము రాథోడ్, ఇమ్మాన్యుయేల్ నుంచి టెనెంట్స్ నుంచి హౌజ్ ఓనర్ ఎవరూ అవ్వాలనే టెనెంట్స్ అంత నిర్ణయం తీసుకుని చెప్పాలని బిగ్ బాస్ ఆదేశించారు. ఇక అంత కలిసి చర్చించుకుని అంతా రాము రాథోడ్ కి ఓటు వేశారు. అంత డిస్కషన లో ఉండగానే.. తనూజ రాము రాథోడ్ పేరు ప్రకటించింది. టెనెంట్స్ రామ్ రాథోడ్ ఓనర్ గెలిచాడు. దీంతో రాము రాథోడ్ కి బట్టలు ఉతకడం వంటి పనుల నుంచి బిగ్ బాస్ విముక్తి ఇచ్చాడు.