IRCTC Tirumala package: తిరుమల శ్రీవారి దర్శనభాగ్యం ఎవరు వద్దనుకుంటారు చెప్పండి. కానీ ఆ దర్శనానికి వెళ్లే మార్గం సౌకర్యంగా ఉండాలి కదా. ఇప్పుడు అలాంటి పవిత్ర యాత్ర కోసం ఓ అద్భుతమైన అవకాశం మీ తలుపు తట్టుతోంది. భక్తి, ఆనందం, విశ్రాంతి.. అన్నింటినీ ఒకే రైలు మార్గంలో పొందాలంటే ఇంకోసారి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పుడే irctc టూర్ ప్యాకేజీ గురించి తప్పక తెలుసుకోండి. ఈ ఛాన్స్ మాత్రం మిస్ చేసుకోవద్దు.
ఆధ్యాత్మికతలో నిండిపోయిన ప్రదేశాలను దర్శించాలనుకునే భక్తులకు ఓ శుభవార్త. ఇండియన్ రైల్వే ప్రయాణాన్ని కంఫర్ట్‌తో ముడిపెట్టి, శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కల్పించేలా ప్రత్యేకమైన ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. IRCTC ప్రవేశపెట్టిన ఈ Lord Balaji Darshan రైల్ టూర్ ప్యాకేజీ ఓ పవిత్ర పయనం కావడమే కాదు.. ప్యాకేజీ అంతా చూసిన తరువాత ఇలాంటి టూర్ ఇంకొకటి లేదేమో’ అనిపించకుండా ఉండదు.
ఎక్కడినుంచి మొదలవుతుంది?
ఈ ప్యాకేజీ కోల్ కతా హౌరా రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమవుతుంది. మీరు ఖరగ్‌పూర్, బాలసోర్, భద్రక్, కటక్ లాంటి స్టేషన్లలో ఎక్కొచ్చు. ప్రతి గురువారం రాత్రి 11:55కి (ట్రైన్ నెం. 12839) చెన్నై మెయిల్ రైలు బయలుదేరుతుంది. తిరిగి ప్రయాణం సోమవారం సాయంత్రం 7:00 గంటలకు (ట్రైన్ నెం. 12840) చెన్నై నుంచి హౌరాకి ఉంటుంది. ప్రయాణ సమయాల్లో మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది గమనించగలరు.
ప్యాకేజీలో ఉండే సౌకర్యాలు
ఈ ప్యాకేజీ మొత్తం 5 నైట్స్ , 6 డేస్‌కు ప్లాన్ చేశారు. ప్రయాణం మొత్తం 3AC క్లాస్‌లో కంఫర్టబుల్ రైల్ ట్రిప్‌తో సాగుతుంది. బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్‌తో కూడిన మిల్స్ ప్లాన్ కలిగి ఉంటుంది. హోటల్ వసతి కూడా ఇందులో భాగమే. తిరుపతిలో లేదా చెన్నైలో మీరు Hotel Ramee Guestline , Regenta Central OMR వంటి ప్రీమియం హోటళ్లలో బస చేయవచ్చు. ఇలా రైలు ప్రయాణం మాత్రమే కాదు, మీరు బస చేసే చోట కూడా ఫీల్ గుడ్ అనిపించేలా ప్యాకేజీ ప్లాన్ చేశారు.
స్వామివారి క్షేత్ర దర్శనం.. 7 కొండలు, ఒక్క లక్ష్యం!
తిరుపతి అంటేనే మనందరికీ తెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి కొండపైన ఉండే ఆలయం. ఈ ఆలయం ఉత్తరాదిలో బాలాజీగా, దక్షిణాదిలో గోవిందా అని పిలవబడే విష్ణు భగవానునికి అంకితమైనది. తిరుమల 7 కొండలపై (సప్తగిరులు) నిర్మించబడి ఉంది. ఈ క్షేత్ర దర్శనం ప్రతి భక్తుడి జీవితంలో కనీసం ఒక్కసారైనా తప్పనిసరిగా చేయాల్సినది.
వెల్లోర్ గోల్డెన్ టెంపుల్.. పసిడి నిండిన పవిత్రత
ఈ టూర్‌లో భాగంగా వెల్లోర్ శ్రిపురం గోల్డెన్ టెంపుల్ కూడా దర్శించవచ్చు. తమిళనాడులోని పళార్ నది ఒడ్డున ఉన్న వెల్లోర్, ఔషధ, విద్యా, పరిశ్రమల కేంద్రంగా పేరొందింది. గోల్డెన్ టెంపుల్‌లో 1500 కిలోల స్వర్ణంతో చేసిన కళాకృతి అందరి దృష్టిని ఆకర్షించేది. ఈ దేవాలయం వేదాల్లోని ప్రతీ అంశాన్ని ప్రతిబింబించేలా నిర్మించబడి ఉంది. ప్రతి ఒక్క డిటైల్ గోల్డ్ ఫాయిల్స్‌తో చేతిపనిగా తయారు చేశారు.
టూర్ టారిఫ్
ప్యాకేజీ ధరలు ఇలా ప్లాన్ చేశారు. సింగిల్ షేరింగ్ రూ. 38,310, డబుల్ షేరింగ్ రూ. 22,395, ట్రిపుల్ షేరింగ్ రూ. 18,365, చిన్నారులు (5-11 ఏళ్లు, బెడ్‌తో) రూ. 9,425, చిన్నారులు (బెడ్ లేకుండా) రూ. 8,375 నిర్ణయించారు.
మీరు బుకింగ్ చేయాల్సిన తేదీ.. మిస్ చేసుకోకండి!
ఈ టూర్ ప్యాకేజీ ప్రతి వారం గురువారం ప్రారంభమవుతుంది. అయితే, వచ్చే ట్రిప్ తేదీ 7 ఆగస్టు 2025. కనుక ముందే ప్లాన్ చేసుకుని IRCTC అధికారిక పోర్టల్ ద్వారా బుకింగ్ చేసుకోండి. ఈ IRCTC ప్యాకేజీ కేవలం ప్రయాణం మాత్రమే కాదు. ఇది ఆధ్యాత్మిక అనుభూతికి, కుటుంబ సమయానికి, తిరుమల దర్శనానికీ, గోల్డెన్ టెంపుల్ సందర్శనకూ ఓ అనుభూతిగా నిలిచిపోతుంది. రైలు, హోటల్, ఫుడ్ అన్నీ ఒకే టికెట్‌లో కవరయ్యేలా ఉండటం వల్ల భక్తులు మళ్లీ, మళ్లీ ప్రయాణించాలనుకునేలా ఉంటుంది. అయితే ఆలస్యం చేయకుండా ఈ ట్రిప్‌ను మీ కుటుంబం కోసం బుక్ చేసుకోండి. ఈ పండుగ కాలంలో పుణ్యక్షేత్ర దర్శనం ప్లాన్ చేయాలనుకుంటే, ఈ IRCTC Lord Balaji Darshan ప్యాకేజీ కంటే బెస్ట్ ఏముంటుంది చెప్పండి!