BigTV English

Bigg Boss: ముగిసిన నామినేషన్స్.. ఓటింగ్ లో ఆమె లీస్ట్..!

Bigg Boss: ముగిసిన నామినేషన్స్.. ఓటింగ్ లో ఆమె లీస్ట్..!

Bigg Boss.. ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ అంటూ హౌస్ లో ఉన్న ఎనిమిది మంది సభ్యులను ఒక క్లాన్ గా.. బిగ్ బాస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా అడుగుపెట్టిన 8 మంది కంటెస్టెంట్స్ ను రాయల్ క్లాన్ గా విభజించారు బిగ్ బాస్. ఇక గేమ్ కాస్త ఒక రేంజ్ లో ఆసక్తికరంగా మారింది అని చెప్పవచ్చు. ఇకపోతే ఆరవ వారం నామినేషన్ లో భాగంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీలకు మాత్రమే నామినేట్ చేసే అవకాశం ఇవ్వడంతో వాళ్లు మొత్తం రచ్చ రచ్చ చేసేసారు. అంతే కాదు రాయల్ క్లాన్ సభ్యులకు ట్విస్ట్ ఇస్తూ హౌస్ సభ్యులు రాయల్ క్లాన్ నుండి ఇద్దరిని నామినేట్ చేయాలని కూడా తెలిపారు బిగ్ బాస్. అలా మొత్తానికైతే అలా అడుగు పెట్టారో లేదో రాయల్ క్లాన్ సభ్యులకు భారీ షాక్ ఇచ్చారు బిగ్ బాస్.


నామినేషన్ లో ఆరుగురు..

ఇదిలా ఉండగా ఈ వారం నామినేషన్ లోకి ఎవరెవరు వచ్చారు..? అనే విషయం ఇప్పుడు చూద్దాం. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 8 లో 5 వారాలు ముగిసే సరికి, ఆరుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. అలా బెజవాడ బేబక్క, ఆర్ జె శేఖర్ బాషా, అభయ్ నవీన్, సోనియా ఆకుల మొదటి నాలుగు వారాల్లో ఎలిమినేట్ కాగా.. ఐదవ వారం మిడ్ వీక్ లో ఆదిత్య ఓం ,ఆదివారం రోజు నైనిక హౌస్ ను వీడిపోయారు. అలా మొత్తం ఆరు మంది హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం హౌస్ లో 8 మంది ఉండగా.. వైల్డ్ కార్డు ద్వారా మరో ఎనిమిది మంది వచ్చారు. అలా హరితేజ , నయని పావని, మెహబూబ్, గంగవ్వ, గౌతమ్ కృష్ణ, ముక్కు అవినాష్, రోహిణి , టేస్టీ తేజ వీళ్లంతా కూడా గత సీజన్ల కంటెస్టెంట్స్ కావడం గమనార్హం. ఇకపోతే ఈ వారం నామినేషన్స్ లోకి విష్ణు ప్రియ, కిర్రాక్ సీత, పృథ్వీ , యష్మీ గౌడతోపాటు గంగవ్వ, మెహబూబ్ లు నామినేషన్ లోకి వచ్చేసారు.


లీస్ట్ లో సీత..

ఇదిలా ఉండగా మరొకవైపు ఆన్లైన్లో అనధికారికంగా జరుగుతున్న ఓటింగ్ లో షాకింగ్ రిజల్ట్ కనిపిస్తోంది. బిగ్ బాస్ లో మరోసారి రీ యంట్రీ ఇచ్చిన గంగవ్వ, ఈ వారం ఓటింగ్ లో టాప్ లో నిలవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఏకంగా 29% ఓట్ల రాగా.. విష్ణు ప్రియకు 20 శాతం, పృథ్వీ రాజ్ కు 16 శాతం , యష్మీ అలాగే మెహబూబ్ కి 14% ఓట్లు వచ్చాయి. కిరాక్ సీతకు 7% ఓటింగ్ తో లిస్టులో నిలిచింది. బిగ్ బాస్ హౌస్లో టాప్ త్రీ లో ఉంటారనుకున్న యష్మీ, సీత ఇప్పుడు లీస్టులోకి రావడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×