BigTV English

Social Media problems : సంసారంలో సోషల్ మీడియా తిప్పలు – భార్యభర్తలను విడదీస్తున్న సామాజిక మాధ్యమాలు!

Social Media problems : సంసారంలో సోషల్ మీడియా తిప్పలు – భార్యభర్తలను విడదీస్తున్న సామాజిక మాధ్యమాలు!

Social Media problems : నిత్య జీవితంలో ప్రతీ ఒక్కరూ సామాజిక మాధ్యమాలను వినియోగిస్తున్నన్న సంగతి తెలిసిందే. ఇంకా చెప్పాలంటే ప్రస్తుతం ప్రతి ఒక్కరి దినచర్య ఈ సోషల్ మీడియాతోనే ప్రారంభం అవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వినియోగదారులంతా వృత్తి, వ్యక్తిగత అవసరాల కోసం చాలా సేపు ఈ సామాజిక మాధ్యమాల్లోనే తమ సమయాన్ని గడుపుతూ ఉంటారు. దీంతో ప్రపంచంలోని వివిధ వర్గాల ప్రజలకు చేరువై, వారితో సంబంధాలను, సంభాషలను కొనసాగిస్తున్నాారు. తద్వారా భిన్న సంస్కృతుల గురించి, ప్రముఖ వ్యక్తుల గురించి, ఉద్యమాల గురించి ఇలా ఏ అంశమైనా సులభంగా తెలుసుకోగలుగుతున్నారు.


అయితే ఈ సోషల్ మీడియాలో ఎన్ని లాభాలైతే ఉన్నాయో, అన్నే నష్టాలు కూడా ఉన్నాయి. చాలా మంది ఈ సామాజిక మాధ్యమం వల్ల ప్రత్యక్షంగానో, పరోక్షంగానే తమ జీవితాన్ని నాశనం కూడా చేసుకుంటున్నారు. ఇలా తమ జీవితాన్ని నాశనాన్ని చేసుకునే వారిలో దంపతులు కూడా ఉంటున్నారు.

అసలే ప్రస్తుత కాలంలో చాలా మంది దాంపత్యంలో విఫలమవుతున్న సంగతి తెలిసిందే. దీనికి సోషల్ మీడియా కూడా ఒక కారణమని నిపుణులు చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు మానవ సంబంధాలు, భార్యభర్తల బంధాలపై సోషల్ మీడియా ప్రభావం ఎలా పడుతుందో చూద్దాం!


కొందరు కోపం, బాధ, సంతోషం ఇలా తమలో కలిగిన ప్రతీ ఉద్వేగాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడం అలవాటుగా మారింది. దీని వల్ల భాగస్వాములకు ఇబ్బంది కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది అనవసర వాదనలకు కూడా దారీ తీస్తుంది.

ALSO READ : త్వరలోనే మరో ఆపిల్ ఈవెంట్.. మాక్ బుక్ ప్రో, మాక్ మినీ, ఐమాక్ లాంఛిగ్ ఎప్పడంటే!

ఇక సహజంగా పెట్టే కొన్ని పోస్టులకు మంచి కామెంట్లు, లైకులు కూడా వస్తాయి. అవి సంతోషాన్ని కలిగిస్తాయనే మాట వాస్తవమే. అదే చెడుగా వస్తే మాత్రం తట్టుకోవడం కాస్త కష్టమే. తద్వారా ఒత్తిడికి లోనవుతారు. ఈ ప్రభావం భాగస్వామితో ఉన్న బంధంపై కూడా పడుతుంది.

పైగా సోషల్ మీడియాను ఎక్కువగా ఉపయోగించే వారు అభద్రతా భావానికి లోనవుతూ ఉంటారు. దీని వల్ల భాగస్వామితో చిన్న గొడవ జరిగినా అది పెద్ద అనర్థానికి దారి తీస్తుంది.

ఇంకా ఈ సోషల్ మీడియా భాగస్వామిపై ఉన్న అంచనాలను కూడా పెంచుతోంది. తమకు తగ్గట్టుగా ఉండాలని కోరుకుంటారు. ఒకవేళ అనుకున్నట్టు లేకపోతే నిరాశకు గురౌతారు.

గతంలోని చేదు జ్ఞాపకాల వల్ల కూడా భార్యభర్తల మధ్య గొడవలు మొదలవుతాయి. పాత బంధాలకు సంబంధించిన మెసేజ్​లు, ఫొటోలు ఈ సోషల్ మీడియాలో కనిపిస్తే, అవి ప్రస్తుతం ఉన్న జీవితాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తాయి.

ఇంకా చెప్పాలంటే ఈ సోషల్ మీడియా దూరంగా ఉన్న వ్యక్తులను దగ్గర చేస్తుంది అనేది ఎంత నిజమో, దగ్గరగా ఉన్నవారిని అంతే దూరం చేస్తుంది. కాబట్టి చుట్టూ ఉన్నవారితో తగినంత సమయం కేటాయిస్తూ గడపాలి.

భార్యాభర్తలిద్దరి మధ్య నిజాయతీ కచ్చితంగా ఉండాలి. సోషల్ మీడియా తమ మధ్య ఉన్న బంధాన్ని మరింత బలపరిచేలా చూసుకోవాలి. మొబైల్​ను ఎంతవరకు ఉపయోగించాలి,ఎంత సేపు ఉపయోగించుకోవాలి అనే నియమాలను స్వతహాగా పెట్టుకోవాలి

చివరిగా ప్రతి పనిని సోషల్ మీడియాలో షేర్ చేయడం వల్ల వ్యక్తిగత సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుందని గుర్తుంచుకోవాలి. దీని వల్ల సంసారాలు అయోమయంలోకి వెళ్లిపోతాయి. ఇంకా ఎన్నో సమస్యలు కూడా ఈ సోషల్ మీడియా వల్ల వస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

Related News

Google Pixel 9 vs Pixel 10: పిక్సెల్ 10 కంటే పిక్సిల్ 9 బెటర్.. ఎందుకంటే?

Grok Imagine AI: ఇప్పుడు ఏఐ వీడియో, ఇమేజ్‌‌లు చేయడం అంతా ఫ్రీ.. అందరికీ అందుబాటులో గ్రోక్ ఇమేజిన్

Lava Play Ultra 5G: కేవలం రూ.14999కే సూపర్ గేమింగ్ ఫోన్.. 64MP కెమెరా, భారీ బ్యాటరీతో లాంచ్

Google Pixel 10 Series: గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ ఇండియాలో విడుదల.. అద్భుత కెమెరా, పవర్ ఫుల్ ఏఐ ఫీచర్లు

Vivo V60: 50MP కెమెరా, పెద్ద బ్యాటరీ.. వివో ఫ్లాగ్ షిప్ ఫోన్ పై భారీ డిస్కౌంట్

ChatGPT Free vs ChatGPT Go vs ChatGPT Plus: ఏ ప్లాన్ బెటర్.. మీరు ఏది ఎంచుకోవాలి?

Big Stories

×