BigTV English

Bigg Boss 8 : నాగార్జున గారు… బిగ్ బాస్ అని కాదు… తెలుగు వర్షన్ WWE అని పేరు పెట్టాల్సింది..

Bigg Boss 8 : నాగార్జున గారు… బిగ్ బాస్ అని కాదు… తెలుగు వర్షన్ WWE అని పేరు పెట్టాల్సింది..

Bigg Boss 8 : తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ ప్రస్తుతం ఉత్కంటగా మారుతుంది.. మూడో వారం నుంచి హౌస్ లో టాస్క్ లు లిమిట్ లేకుండా పోయాయి.. ఫుడ్ కోసం అని చెప్పి కంటెస్టెంట్స్ కు గొడవలు పెట్టేస్తున్నాడు బిగ్ బాస్. ఇక గురువారం ఎపిసోడ్ లో మాత్రం ఒక్కొక్కరు తక్కువేమి కాదు అని గొడవ పడ్డారు. టాస్క్ ల ఉదృతి పెరగడంతో పాటు.. తిండి విషయంలో కూడా టాస్క్ లతో ముడిపెట్టడంతో హౌస్ లో అంతా షాక్ అవుతున్నారు. అంతే కాదు బిగ్ బాస్ పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.. ఇక నిన్నటి ఎపిసోడ్ లోని హైలెట్స్ గురించి ఒక్కసారి చూసేద్దాం..


బిగ్ బాస్ హౌస్ లో గత రెండు రోజులుగా కోడి గుడ్ల టాస్క్ ను నడిపిస్తున్నారు. ఈ టాస్క్ కోసం అవుతున్న గొడవలు ఆడియన్స్ కు టెన్షన్ పుట్టిస్తున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందా అని ఉత్కంఠ పెంచుతుంది. అందులో ఈ హౌస్ లో ఉన్నవారిలో ఎక్కువమంది షార్ట్ టెంపర్ ఉన్నవారు కావడంతో ఎవరు నోరు జారి ఏమంటారో తెలియడంలేదు. హద్దులు మీరు ప్రవర్తించడమే కాదు. ఏకంగా బుల్ ఫైట్ లాంటివి చేశారు. కొందరు బూతులతో రచ్చ చేశారు. ఫిజికల్ టాస్క్ లో పృధ్వి నిఖిల్ గట్టిగా ప్రయత్నిస్తుండగా.. సంచాలక్ గా మారిన నబిల్.. ఎక్కడికక్కడ టైట్ చేసేస్తున్నాడు. నబిల్, అభయ్ టీమ్ కావడంతో.. సహజంగానే అతని నిర్ణయాలలో కాస్త పార్శియాలిటీ కనిపిస్తోంది. రూల్స్ పేరుతో నిఖిల్ టీమ్ కు గుడ్లు అందకుండా చేస్తున్నాడు.

Bigg Boss Thursday's episode of the House Mets beat for Gaddu
Bigg Boss Thursday’s episode of the House Mets beat for Gaddu

హౌస్ లో మొదటి నుంచి తిండి కోసం పెద్ద యుద్ధమే జరుగుతుంది. మొన్నటివరకు గుడ్డు కోసం నామినేట్ చేసుకున్న హౌస్ మెట్స్ కు గుడ్డు కోసం కొట్టుకొనేలా చేశాడు బిగ్ బాస్.. తిండి విషయంలో ఇలా ఆటలు ఆడించడం కరెక్ట్ కాదు.. ఏంటి ఇది అంటూ ఫైర్ అయ్యాడు. ఇక నిఖిల్, పృధ్వి ఉండటం.. వాళ్ళు ఎక్కువ మంది ఉండటంతో ఎక్కువ గుడ్లు సాధించారు. ఈ విషయంలో కాంతార టీమ్ పొరపాట్ల వల్ల వారికి గుడ్లు లభించడం లేదు. ప్రేరణ, యష్మి తొందర పడుతున్నారు కాని.. ఆట మీద దృఫ్టి పెట్టడంలేదు. నిన్నటి ఎపిసోడ్ లో గుడ్లు బాగానే సంపాదించారు శక్తి టీమ్..టీమ్ లీడర్ అభయ్ మొత్తానికి చేతులెత్తేయడం చిరాకు తెప్పిస్తుంది. ఈ విషయంలో మణికంఠ గట్టిగా ఫైట్ చేస్తున్నాడు. నబిల్ లేకపోవడంతో టీమ్ ఇంకా వీక్ అయ్యింది. మరి గుడ్డు టాస్క్ లో ఎవరు విన్నర్ అవుతారో చూడాలి.. ఇక ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరు బయటకు వెళ్తారో అన్నది ఆసక్తిగా మారింది. మూడో వారం నామినేషన్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉన్నారు. అయితే ఎవరు బయటకు వెళ్తారో అన్నది ఆసక్తిగా మారింది. అభయ్ డేంజర్ జోన్లో ఉన్నాడు. మరి ఈ వారం స్ట్రాంగ్ కంటెస్టెంట్ బయటకు వెళ్తారేమో అని ఆడియన్స్ అభిప్రాయ పడుతున్నారు. ఏం జరుగుతుందో ఈ వారం చూడాలి..


Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×