biggboss telugu season 8: అన్ని భాషల్లో పాపులర్ అయిన బిగ్ బాస్ షో సీజన్ 8 సెప్టెంబర్ 1న గ్రాండ్ స్టార్ట్ అయింది. ఈ సీజన్ 8కు కూడా హీరో నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసింది. ఇక సీజన్‌లో ప్రేరణ, యష్మి గౌడ, విష్ణుప్రియ, సోనియా ఆకుల, పృథ్వీరాజ్, నిఖిల్, నబీల్ అఫ్రిది, ఆదిత్య ఓం, బెజవాడ బేబక్క, కిర్రాక్ సీత, నాగ మణికంఠ, అభయ్ నవీన్, ఢీ ఫేం నైనిక, శేఖర్ భాషతో కలిపి మొత్తం14 కంటెస్ట్ంట్స్‌లో హౌస్‌లోకి వెళ్లారు. వారిలో ఎక్కువగా టీవీ సీరియల్స్ నటులు, సినిమా నటలు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్స్ ఉన్నారు. టీవీలో నటులు ఎక్కువగా ఉండటం వల్ల ఈ సీజన్‌లో ఎక్కువమంది ఉండటంతో పిల్లలేకాకుండా పెద్ద వారుకూడా ఈ షో చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ షో మొదలై మూడు రోజులకే నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయింది. దీంతో ఒకరి మరొకరు నామినేషన్ చేయడం స్టార్ట్ చేశారు.
నామినేషన్ నుండి షేఫ్‌గా ఉన్న ముగ్గురు కంటెస్టెంట్స్
నామినేషన్ కంటె ముందు హౌస్‌లో కొన్ని టాస్క్‌లు జరిగాయి. హౌస్ చీఫ్ కోసం జరిగిన ఈ టాస్క్‌లో అందరూ పాల్గొనగా.. యష్మిగౌడ, నిఖిల్, నైనిక గెలిచారు. దీంతో ఆ ముగ్గురు హౌస్ చీఫ్‌లుగా ఎన్నికయ్యారు. టాస్క్ జరిగిన వెంటనే నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఇదే సమయంలో యష్మిగౌడ, నిఖిల్, నైనిక ఛీఫ్‌లుగా గెలవడం వల్ల వారు ఈ వారం నామినేషన్స్‌కు దూరంగా ఉంటారని, వారిని నామినేటే చేయడం కుదరదని బిగ్ బాస్ చెప్పడంతో మిగతావారి మధ్య నామినేషన్ జరిగింది. ఈ నామినేషన్ నాగమణికంఠ, బేబక్క, నబీల్, సోనియా, సీత మధ్య ఎక్కువగా జరిగింది. వీరిపై కూడా చిన్ని రీజన్స్‌కు, చిల్లీ రీజన్స్‌కు నామినేట్ చేసుకోవడం విశేషం.
Also Read: బిగ్ బాస్ నామినేషన్స్ లిస్ట్.. ముందుగా ఎలిమినేట్ అయ్యేది వాళ్లే!
ఒక సెంటిమెంట్ డైలాగ్‌తో దిగజారిపోతున్న నాగమణికంఠ
ఈ నామినేషన్ ప్రక్రియలో హౌస్‌మేట్స్ అందరూ ఎక్కువగా నాగమణికంఠను నామినేట్ చేశారు. దానికి అతని ప్రవర్తనే కారణమని అందిరికీ తెలిసిన విషయమే. అనిల్ రావిపూడి మణికంఠతో చేసిన ప్రాంక్‌లో.. తన కష్టాలు చెప్పుకోవడం, అది ప్రాంక్ అని తెలిసిన తర్వాత మామూలుగా ఉన్నప్పటికీ మిగతా సమయంలో హౌస్‌మేట్స్‌లో అదే విషయాన్ని చెప్తూ సెంటిమెంట్ క్రియేట్ చేసుకోవాలని ప్రయత్నించాడు. ఆఖరికి హౌస్‌మేట్స్ నామినేట్ చేస్తుంటే తన పాపకోసం వచ్చానంటూ సెంటిమెంట్ డైలాగ్స్ చెప్తుతున్నాడు. ఇక నాగమణికంఠ ప్రవర్తనపై స్పందిస్తున్న ప్రేక్షకులు కూడా ప్రతి సారి ఒకే సెంటిమెంటల్ డైలాగ్స్‌తో నెట్టుకురావడం బాగోలేదంటూ విమర్శిస్తున్నారు. ఏదైమనసప్పటికీ నాగమణికంఠనే ఎక్కువమంది నామినేట్ చేశారు. మరి తొలివారం నామినేషన్స్‌లో ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.