Bigg Boss 9:వరల్డ్ బిగ్గెస్ట్ రియాల్టీ షో గా గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్ కార్యక్రమం గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఇప్పటికే 8 సీజన్లు పూర్తి చేసుకున్న తెలుగు బిగ్ బాస్ ఇప్పుడు తొమ్మిదవ సీజన్ కు సిద్ధమవుతోంది. డబుల్ హౌస్.. డబుల్ డోస్.. డబుల్ ఎంటర్టైన్మెంట్ అంటూ ఈసారి వినూత్నంగా ప్రేక్షకులను అలరించడానికి ఈ షో సిద్ధమవుతుందని చెప్పవచ్చు. ఇప్పటికే సెప్టెంబర్ 7వ తేదీ నుంచి ఈ షో ప్రారంభం అవ్వడానికి సన్నహాలు సిద్ధం చేసుకుంటూ ఉండగా.. మరొకవైపు హౌస్ లోకి అడుగుపెట్టబోయే కంటెస్టెంట్ల పేర్లు వైరల్ గా మారుతున్నాయి.
అందులో భాగంగానే ఇప్పుడు మరో లేడీ విలన్ హౌస్ లోకి కంటెస్టెంట్ గా వెళ్లబోతోందనే వార్త వైరల్ గా మారింది . ఆమె ఎవరో కాదు షర్మిత గౌడ(Sharmita Gowda). బ్రహ్మముడి సీరియల్ లో రుద్రాణి అత్తగా తెలిసిన ఈ బ్యూటీ.. ఈ సీరియల్ లో నెగిటివ్ రోల్ లో అదరగొడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తన నటనతో ఎంతోమంది తెలుగు ప్రేక్షకుల మదిని సొంతం చేసుకుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ భారీ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈమె.. హౌస్ లోకి అడుగుపెడితే ఎలా ఉంటుందో చూడాలని అభిమానులు కూడా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
శోభ శెట్టిని మించి మెప్పిస్తుందా?
వాస్తవానికి బిగ్ బాస్ సీజన్ 7లో ‘కార్తీకదీపం’ సీరియల్ లో మోనిత అనే నెగటివ్ రోల్ చేసిన శోభాశెట్టి (Shobha Shetty) హౌస్ లోకి అడుగుపెట్టి తన పర్ఫామెన్స్ తో అందరి దృష్టిని ఆకట్టుకుంది. సీరియల్స్ లో విలన్ అనిపించుకున్న ఈమె హౌస్ లో కూడా అంతకుమించి పర్ఫామెన్స్ ఇచ్చింది. ఇప్పుడు ఈమె లాగే సీరియల్ లో నటిస్తున్న మరో లేడీ విలన్ హౌస్ లోకి రాబోతోందని తెలిసి శోభా ను మించి మెప్పిస్తుందా అంటూ అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు.. మరి ఎవరి పర్ఫామెన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో తెలియాలి అంటే షో ప్రారంభం అయ్యే వరకు ఎదురు చూడాల్సిందే.
సామాన్యులకు అగ్నిపరీక్ష..
ఇకపోతే తాజాగా ఈ షోలోకి ఏకంగా ఐదు మంది సామాన్యులను పంపించబోతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే 20 వేలకు పైగా అప్లికేషన్లు రాగా అందులో 45 మందిని ఎంపిక చేసి.. ఇప్పుడు వీరందరిలో ఐదు మందిని సెలెక్ట్ చేయడానికి అగ్నిపరీక్ష అంటూ ఒక మినీ షో నిర్వహిస్తున్నారు. దీనికి శ్రీముఖి హోస్ట్ గా వ్యవహరిస్తూ ఉండగా బిందు మాధవి, అభిజిత్, నవదీప్ జడ్జెస్ గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ మినీ షో సెప్టెంబర్ 5 వరకు జియో హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.
also read:Anupama Parameswaran: ఆ డైరెక్టర్ నరకం చూపించాడు.. స్టేజ్‌పైన అనుపమ